హిందీ రాజ్యంలో తెలుగు తేజం

on Tuesday, August 24, 2010

హిందీ రాజ్యంలో తెలుగు తేజం
August 23rd, 2010

ఒక్కసారిగా తెలుగు చానళ్లన్నీ ఆనంద పడుతూ ఒకేరకంగా బృందగీతాన్ని ఆలపించాయి. అటువంటి సందర్భం చాలా విశేషంగా వుంటుంది. శ్రీరామ్ ఇండియన్ ఐడల్‌గా ఎంపిక కావడమే అపురూపమైన విషయం. గతంలో కారుణ్య, హేమచంద్ర తృటిలో తప్పిపోయారు. ఆ సందర్భంలో హిందీ చానళ్లు ఉత్తరాది పక్షపాతమని చాలా చర్చలు జరిగాయి. ఎస్‌ఎంఎస్‌లలో రాజకీయాలు సాగుతాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈసారి తెలుగు కుర్రాడు సోనీ ఇండియన్ ఐడల్-5 ఫేం అధిరోహించడం తెలుగువారి అసంతృప్తిని వమ్ము చేసింది. అంతేకాదు దక్షిణాది పట్ల చానళ్లు చిన్నచూపు అనే అపవాదు కూడా పోయింది.
టీవీ రంగం తారలను తయారుచేస్తోందనే వాస్తవం క్రమం స్థిరపడుతోంది. కారుణ్య, హేమచంద్ర ప ఊర్తిగా విజేతలు కాకపోయి, తర్వాత ఆ ప్రచారం వారికి ఎంతో గుర్తింపు నిచ్చింది. సోనీ షోల తర్వాతనే వారు మ రింత ప్రాచుర్యంలోకి వచ్చారు. ఒకరకంగా చూస్తే సినిమాను మించిన గుర్తింపు టీవీ ద్వారా సిద్ధిస్తోంది. ఒక దశలో టీవీ చిన్నతెర, సినిమా పెద్ద తెర అని భావించేవారు. కానీ నేడు చిన్న తెర ద్వారా మరింత ఆదరణ పొందాలని సినీ తారలు ఆశిస్తున్నారు. ఆగస్టు 24న ఈటీవీలో జగపతిబాబు పాల్గొనే ‘రాజురాణి జగపతి’ అనే షో రాత్రి 9.30కు మొదలైంది. ఇది వరకే హీరో సాయికుమార్ సమర్పించే ‘వావ్’ ఈ టీవీలో ఎంతో ప్రజాదరణ పొందింది. అదే షో అదే యాంకర్‌తో ఈటీవీ కన్నడలో మొదలవుతోంది.
ఇటీవల ఈటీవీ కాస్త వైవిధ్యంగా షోలు రూపొందిస్తూ మిగతా చానళ్లకు గట్టిపోటీ ఇస్తోంది. రాత్రి 9.30కు రెండుజులు ఉదయభాను ‘్ఢ’, రెండు రోజులు సాయికుమార్ ‘వావ్’, రెండురోజులు సంగీతం ఆధారమైన కార్యక్రమాలు ఇలా రక్తికడుతున్నాయి. వార్తా చానళ్లలో ఈటీవీ-2 పోటీపడకుండా సాగిపోతున్నా ఈటీవీ మాత్రం మంచి పోటీ ఇస్తోంది.
* * *
అమెరికా సంస్థ సిబిఎస్, రిలయన్స్ సంస్థ బిగ్ కలిసి చెరిసగం వాటాలతో బిగ్ సిబిఎస్ అనే సంస్థను ఏర్పరిచాయి. రెండు నెలల క్రితం ఈ వార్త భారతీయ టీవీ రంగంలో సంచలనం కలిగించింది. ఇటీవల ఈ ఒప్పందంవల్ల సాధ్యపడే అంశాలు కొన్ని వెల్లడి అయ్యాయి. ఈ సంవత్సరాంతానికి మూడు ఇంగ్లీషు చానళ్లు వస్తాయి. బిగ్ సిబిఎస్‌ప్రైమ్ అనే చానల్ 18-34 వయసున్న వారికోసం ప్రారంభమయ్యే జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్. బిగ్ సిబిఎస్ స్పార్క్ అనేది 18-24 వయసున్న యువత కోసం కాగా బిగ్ సిబిఎస్ లవ్ అనే చానల్ 18-34 వయసున్న మహిళలకోసం.
మన దేశంలో హిందీ చానళ్ల మధ్యే పోటీ బాగా వుంది కానీ, వినోదాత్మక ఇంగ్లీషు చానళ్ల మధ్య పోటీ తక్కువే అని ఈ సంస్థ అభిప్రాయం. స్టార్ వరల్డ్, జీ కెఫె, జీస్టుడియో తప్ప మరే వినోదాత్మక ఇంగ్లీషు చానల్ ప్రాచుర్యం కాలేదు. కనుక ఇంగ్లీషు చానళ్లకు మార్కెట్ వుందని అభిప్రాయం. ఒక్క భారత దేశమే కాకుండా శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్తాన్ వంటి దేశాలను కూడా ఆకట్టుకోవచ్చని వీరి వ్యూహం. 2012 కు ప్రపంచంలోనే అత్యధిక డిటిహెచ్ కనెక్షన్లున్న దేశంగా భారతదేశం వుంటుందని ఒక అంచనా. అందువల్ల డిటిహెచ్‌ను కూడా నిర్వహించే బిగ్ సంస్థతో సిబిఎస్ చేతులు కలిపింది. ఈ సంస్థ ముందు ముందు ఇతర భారతీయ భాషలలో ప్రవేశిస్తోంది. అందులో తెలుగు ఖచ్చితంగా వుంటుంది.
* * *
తెలుగు చానళ్లను అవార్డులు ముంచెత్తుతున్నాయి. టాటా డొకొమో సంస్థ లోకల్ టీవీతో కలిసి అవార్డులు ప్రకటించింది. అయితే సమస్య ఏమిటంటే చానళ్లలో ఎంత వైవిధ్యముందో, అవార్డులలో కూడా అంతకు మించిన వైరుధ్యముంది. ఎన్ని చానళ్లకు ఏ అవార్డులిచ్చారో మనకు సులువుగా తెలిసే అవకాశం లేదు. ప్రతి మీడియా సంస్థ తమకు వచ్చిన అవార్డు గురించి ఊదరకొడుతుంది. అవార్డులిచ్చిన సంస్థకు ఆ మేరకు ప్రచారం వుంటుంది. అయితే ఏ మీడియా సంస్థ కూడా ఇతర మీడియా సంస్థలు పొందిన అవార్డుల గురించి చెప్పవు. అవార్డుల సంస్థలు కూడా సాధ్యమైనంత ఎక్కువ చానళ్లకు ఇవ్వాలని ప్రయత్నిస్తాయి. చానళ్లు పాపులర్‌గా మారినట్టు అవార్డులు కూడా అటువంటి రీతిలోనే స్పందిస్తున్నాయి. ఎబిఎన్‌లో ప్రసారమయ్యే ‘ఓపన్ హార్ట్’ కార్యక్రమాన్ని మోస్ట్ పాపులర్ న్యూస్ బేస్డ్ టాక్‌షోగా టాటా డొకొమో తీర్మానించింది. ఇంతవరకు ఏ టీవీ చానల్ కనీసం టీవీ-9కూడా నడవని రీతిలో ఎబిఎన్ షో సాగుతుంది. మందు కొట్టారా అని ఒక నాయకుడినీ, ఎంతమందిని పడేశారని ఓ నాయకురాలినీ...ఇలా ఒక ప్రత్యేకమైన పంథాలో ఈ ఓపన్ హార్ట్ సాగుతుంది. యధా ప్రజ-తధా రాజా అన్నట్టు యధా ఛానళ్లు-తథా అవార్డులు అనవచ్చునేమో!
* * *
అన్నట్టు ఒక కొసమెరుపు లాంటి అంశం చూద్దాం. సీరియళ్లలో ఎపిసోడ్లు వందలు దాటిపోతున్నాయని విమర్శలు మనకు తెలిసిందే! అయితే ఒక అవార్డుల ఫంక్షన్‌లో ఇలాంటి విమర్శ ఎదురైతే అవార్డు పొందిన నిర్మాత చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? తమిళం వంటి భాషల్లో వేలసంఖ్యలో (మన తెలుగుకన్నా ఎక్కువగా) సీరియల్ ఎపిసోడ్లు సాగుతున్నాయని

0 comments:

Post a Comment