సంచలనం కోసం, ప్రాచుర్యం కోసం చానళ్ళు చమత్కారాలు చేయడంలో విశేషమేమీ లేదు. ఇటీవల టీవీ-1 చానల్ దళితులకు బతుకులకు అధికారం అంటూ కాంపెయిన్ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఒక లోగోను క్రమం తప్పకుండా తెరమీద చూపుతూ, కొన్ని నినాదాలను స్క్రోలింగులో తరచూ చూపుతోంది. అతేకాక ఈ దిశలో ఒక పాటను తగిన ఫోటోలతో ప్రసారం చేస్తోంది. టీవీ-1 ఏ కారణంతో ఈ ప్రచార ఉద్యమాన్ని చేపట్టినా అది మంచిదేనని చెప్పాలి. చాలా కాలంగా మీడియాకు దూరంగా వర్గాల విషయంలో మీడియాకు అదర పాత్రం కావడం ఆనందదాయకమే!
ఇటీవలి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద యుద్ధం ప్రకటించిన టివీ-9, టీవీ-1లు ఇలా ఇప్పుడు మరో అంశాన్ని స్వీకరించడం పరిశీలనార్హం. ఎందుకు ఫలానా ప్రచారం స్వీకరిస్తారో తెలిపే విధానం మన మీడియాలో ఉండదు. కానీ టిటిడి విషయం కోల్పోయిన గౌరవం బడుగులకు రాజ్యాధికారము అనే ప్రచారంవల్ల లభిస్తుంది. నిజానికి సుమారు మూడు సంవత్సరాల క్రితం ఒక తెలుగు దిన పత్రిక స్వీకరించిన పత్రికా విధానానికి ఈ పోకడ చాలా దగ్గరగా ఉంది. మిగతా చానళ్ళు - మనకెందుకు ఈ ఆలోచన రాలేదని ఆలోచించే పరిస్థితి ఉంది. కనుక ఈ అంశాన్ని ఇతర చానళ్ళు స్వీకరించినా ఆశ్చర్యం లేదు. టీవీ-9 సంస్థ చేపట్టే ఏ పని అయినా సంచలనంతో కూడి ఉంటూ, తమ సంస్థకు లాభించేలా ప్రయత్నిస్తుంది. కారణం ఏమైనా, ఒక మంచి పని జరుగుతోందని అభినందించాలి.
* * *
హెచ్‌ఎంటివీలో దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ ఆగిపోయినట్టుంది. వినాయకచవితి రోజుల్లో ‘సరదా’గా అని ఒక చిరు అంశం చూశాను. అది సరదాగా అని అన్న దానితో ప్రయోజనం తప్పక ఉంటుంది. హుస్సేన్‌సాగర్ అడుగునకు పోయిన వినాయకుడు - మూషికాలు సంభాషించుకోవడం వస్తువు. హుస్సేన్‌సాగర్ కలుష్యానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కరిగిపోతాయని చెప్పించాడు. కాలుష్యం స్థాయి ఎక్కువ అనే సెట్టర్ ఇందులో ఉంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కలిగే అనార్థాలు గురించి అసలు చెప్పపోవడం సబబు అనిపించదు. కేవలం వ్యంగ్యం, హస్యమే ప్రదానం కావడంతో ఇతర విషయాలు దారి తప్పాయి. కొంత పరిశోధనతో ఇలాంటి అంశాలు ప్రయత్నిస్తే చానల్‌కు గౌరవం, వీక్షకులకు ప్రయోజనం.
వినాయకచవితి సందర్భంగా ప్రసారమైన ఇంకో విషయం గురించి చెప్పాలి. విద్యుద్దీపాల అలంకరణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే ‘జరభద్రం’ స్టూడియో ఎన్‌లో ప్రసారమైంది. వాస్తవానికి ‘జరభద్రం’ చిరు కార్యక్రమం చానల్‌కు గౌరవం కల్గించే ప్రయత్నం. ఒక పార్టీవైపే ఆలోచించే, వాదించే చానల్‌గా స్టూడియో ఎన్‌కు పేరు పడుతోంది. అయినా, అటువంటి ఛాయలు లేకుండా సాగే ‘జరభద్రం’ ప్రసారంతో ప్రతిష్ట ఇనుమడిస్తుంది. ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా, నేరుగా, కొంత పరిశోధనతో సాగే ఈ కార్యక్రమం రక్తికడుతోంది. పర్యావరణం, ఆరోగ్య, వినియోగ అవగాహన, చట్టం, హక్కులు వంటి వాటిపై మరిన్ని చేయాల్సిన అగత్యం చాలా ఉంది.
డబ్బులు ఆడించగల నిర్మాత సినిమా విడుదలయితే - అది బ్రేకింగ్ న్యూస్ కాగలదు. వార్త కార్యక్రమం కాగలదు. సినిమా విడుదలకు ముందురోజు ప్రముఖ చానళ్ళు పోటీ అనుకోకుండా ఆయా తారలతో లైవ్‌షోలతో నింపేస్తాయి. అవసరమైతే సమయాన్ని మార్చి, సిద్ధంగా ఉండగలవు. సరదాగా కాసేపు’ సినిమాకు సంబంధించి ఆ సినిమా దర్శకుడు చాలా చానళ్లలో కనిపించారు. మిగతా చానళ్ళు కార్యక్రమాలు కాదుగానీ- ఎన్టీవీలో స్వాతి మైత్రేయ వంశీని ఇంటర్‌వ్యూ చేసింది. గాయని అయిఉండి, చానళ్ళలో పాటల ప్రోగ్రాం నిర్వహించిన ఈవిడ ఇటీవల రెండక్షరాల పేరుతో న్యూస్ రీడర్‌గా మారిపోయింది. అయితే న్యూస్‌రీడర్ యాంకర్ కావడం మంచిదే! కాస్త లోకజ్ఞానం ఉంటుందని ఆశిద్దాం. రాసిచ్చిన ప్రశ్నలకు వరుసగా చదివితే ప్రయోజనం కాదుకానీ, హాస్యం పండుతుంది. జవాబు ఆధారంగా ప్రశ్న సాగాలి. అలాకాక స్వాతి విధానంలోనే సాగితే పరువు గల్లంతవుతుంది. స్వాతి న్యూస్ రీడర్‌గా చక్కగాఉంది. అయితే ఇంటర్‌వ్యూలు నిర్వహించాలంటే మరింత సాధన, సమయస్ఫూర్తి అవసరం మరి. శ
పోటీ చానల్‌ను మట్టి కరిపించడం ఎలా? Andhra bhoomi 28th Sep.2010
Posted by Nagasuri on Tuesday, September 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
good analysis, sir.
Post a Comment