చాలా సందర్భాలలో సైన్స్‌తో మతాన్నీ, దేవుడిని ముడిపెట్టి వ్యాఖ్యానిస్తుంటారు. సైన్స్ చెప్పలేనిది ఆధ్యాత్మికత వివరిస్తుందనీ, దేవుడు సైన్స్‌కు అతీతమని సైతం వివరిస్తూ ఉంటారు. ఐన్‌స్టీన్, శంకరాచార్యులు చెరో దారిన బయలుదేరి అన్వేషిస్తూ చివరకు ఓ చోట (సదరు బాబా పాదాల చెంత) కలిశారని కూడా కొన్నిచోట్ల వినబడుతూ ఉంటుంది. మతం లేని సైన్స్ గుడ్డిది, సైన్స్ లేని మతం కుంటిది అని మహా శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారని కూడా కొందరు గుర్తు చేయవచ్చు.
వాస్తవానికి మతాన్ని గానీ, దేవుడనే భావనను గానీ వివరించి చెప్ప డం సైన్స్ పనికాదు. దేవుడు ఉన్నాడని గానీ, లేడని గానీ సైన్స్ చెప్పదు. దేవుడు ఆధారంగా ప్రారంభమయ్యే మతం గురించి సైన్స్ చెప్పే అవకా శం అసలు లేదు. మనిషి అనుభవంలోకి వచ్చిన వాటిని వివరించేది సైన్స్. లేదా మనిషి తన పరిధిలో తెలుసుకునే విషయ పరంపరను హేతుబద్ధం గా సైన్స్ వివరిస్తుంది. తెలియని వాటికి ఆదిమానవుడు భయపడేవాడు. రాత్రి ఎందుకు ఏర్పడుతుందో, వర్షం ఎప్పుడు కురుస్తుందో, గ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలిసేది కాదు. ఇవి బోధపడనటువంటి కాలంలో ఇటువంటి విషయాలతో ముడిపడి మత సంబంధమైన, పురాణగాథలు అన్ని దేశాల్లో ప్రచారంలో ఉన్నాయి.
ఇక్కడ మరో అంశం గురించి చెప్పుకోవాలి. సైన్స్ రావడంతో చాలా అపోహలు పటాపంచలయ్యాయి. అపోహలతో ఆధారపడి జీవనోపాధి సాధించుకుంటున్న వారికి ఇటువంటివి సహజంగా ఆనందం కలిగించవు. ఫలితంగా వీరు సైన్స్ అవగాహనను వ్యతిరేకించడం కూడా ఉంటుంది. ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు ఇరువైపులా ఉంటారు. సైన్స్ రాకతో మతం పలాయనం చిత్తగించిందనే వ్యాఖ్య ఇటువంటి సందర్భాలలోనే వినబడుతూ ఉంటుంది. కేవలం ఇటువంటి సందర్భంలోనే 'సైన్స్-మతం' సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు తారసపడుతూ ఉంటాయి.
ప్రకృతిలోని దృగ్విషయాలను వివరించడంతో సైన్స్ మొదలవుతుంద ని మొదటే చెప్పుకున్నాం. ప్రకృతి అంటే కంటికి కనపడే దాని నుంచి కన్ను చూడలేని దూరం దాకా వ్యాపించిందని మనకు తెలుసు. అలాగే కన్ను చూడలేని దానిని కూడా కొట్టి వేయలేం. ఇక్కడే టెలిస్కోప్ వంటి పరికరా లు మనిషికి దోహదపడతాయి. స్థూల జగత్తును మాక్రో వరల్డ్ అనీ, సూక్ష జగత్తును మైక్రో వరల్డ్ అని పేర్కొంటుంటాం.
సైన్స్-మతం గురించి ప్రస్తావించుకున్నప్పుడు మరో పార్శ్వం ఉంది. దయ, ప్రేమ, సహనం, కారుణ్యం వంటి మానవీయ భావనలను సైన్స్ వివరించజాలదు. ఈ గుణాల అవసరం గురించి మతం చాలా స్పష్టంగా చెబుతూ ఉంటుంది. ఈ గుణాలు మనుషులలో ఎందుకు ఉన్నాయో, లేదా ఎందుకు లేవో లేదా ఎందుకు తగ్గుతున్నాయో-సామాజిక శాస్త్రాలు చెప్పవచ్చు. కానీ విజ్ఞాన శాస్త్రాలు ప్రస్తుతం వివరించే అవకాశం లేదు. సైన్స్ తనకు తెలిసింది వివరిస్తుంది. అంతే! సైన్స్ పరిధిలో లేని దేవుడి గురించి వివరించమనడం అర్ధరహితం.
అందుకే బుద్ధుని వంటి తాత్వికు లు దేవుడు ఉన్నా, లేకపోయినా మనం పట్టించుకోనక్కర లేదు అని భావిస్తారు. కేవలం సాటి మనిషి,అతడి సంక్షేమం ప్రధానమని కూడా బుద్ధుడు బోధించాడు. అంతేకాదు 'శాస్త్రీయ దృక్పథం' అనే దానికి బుద్ధుడు 2500 సంవత్సరాల కిందట చెప్పిన విషయాన్ని నిర్వచనంగా ప్రపంచం అంగీకరించింది.
అదే సమయంలో మత విశ్వాసాలు గల సమాజాన్ని దూషించడం కూడా సైన్స్ పనికాదు. దేవుడు, మతం అనే వాటిని తిరస్కరించడం కూడా తగదని కొందరంటారు. మనంచేసే పనుల గురించి, వాటి ఫలితా ల గురించి ఎక్కువ ఆలోచించడం, ఆశించడం కూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఎక్కువ ఆశిస్తే, నిరాశ ఎదురయినపుడు తీవ్రం గా క్షోభకు లోనవుతారు. ఇటువంటి సందర్భాలలో బరువు దించుకునే ఉపకరణంగా దేవుడనే భావన దోహదపడాలి.
ఇక్కడ చిన్న ఉదాహరణ ఉంది. అడవిలో కట్టల మోపుతో వస్తున్న మనిషికి సాయం చేయడానికి తోడు ఎవరూ ఉండరు. కానీ ఆ వ్యక్తికి దాహం వేయవచ్చు, లేదా ప్రకృతి కార్యం సంబంధాల అవసరం ఏర్పడవచ్చు. మరి అటువంటి సమయం లో పరిష్కారం ఏమిటి? అందుకే ఆరడుగుల రాతి స్తంభం నాటుతారు అక్కడక్కడ. దానికి రెండు మూడు మెట్లు కూడా ఉంటాయి.
మనిషి ఎత్తు బట్టి ఎక్కడో ఒక చోట నిలబడి ఆ రాతి స్తంభం మీద మోపును జొనిపి పెట్టవచ్చు. పని అయిన తర్వాత, అలాగే ఆ మోపును నెత్తి మీద పెట్టుకోవచ్చు. ఈ ఏర్పాటు 'శుమైతాంగి' అని అంటాడు. చాలా అందంగా కనబడుతుంది ఈ పదం. అడవిలో ఉండే ఈ 'శుమైతాంగి' ఏర్పాటు వంటిది దేవుడనే భావన. మనిషి తనకుండే మానసికమైన బరువును దేవుడి మీద ఉంచవచ్చు. అవసరం లేని వారికి అవసరం లేదు. అడవిలో ఉండే 'శుమైతాంగి'ని అంద రూ వాడాలని లేదు.
కానీ అవసరమైన వారికి ఇది ఎంతో దోహదపడుతుంది. దేవుడనే భావన కూడా అంతే! అదే సమయంలో దేవుడు, మతం భావనల ఆధారంగా అర్థంలేని నమ్మకాలనూ, ఆచారాలను అంగీకరించనవసరం లేదు. వాటిని విడమర చి చెప్పడం అనే పనిని సైన్స్ వాదులు స్వీకరించవచ్చు. ఎందుకంటే సర్వమానవాళి సంక్షేమాన్ని సైన్స్ కోరుకుంటుంది కనుక. సున్నితమైన ఈ తేడాను గమనించకుండా పరుషంగా ఇరువర్గాలు పరస్పరం దూషించుకోవడం అర్ధరహితం. నిజానికి సమాజానికి ఈ రెండింటి అవసరం ఎంతో, ఎలానో తెలుసుకుని అంత వరకే వాడుకునే అప్రమత్తత మనిషికి చాలా అవసరం. అటువంటి ఆలోచనా ధోరణి నేడు ఎంతో ప్రయోజనకరం.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
Relevance of science and religion సైన్స్, మతమూ రెండూ అవసరమే-Andhrajyothy daily 11.02.2011
Posted by Nagasuri on Saturday, February 12, 2011గణితాన్ని విజ్ఞాన శాస్త్రాలలో మహారాణిగా పరిగణిస్తారు. నిజానికి గణితం అనేది సైన్స్‌కు పరిభాష. గణితాత్మకంగానే సైన్స్ అవగాహన సాగుతుంది. అలాగే భౌతికశాస్త్రం విశ్వం గురంచీ, దాన్ని నడిపే శక్తి గురించీ వివరిస్తుంది. అణువు నుంచి అంతరిక్షం దాకా భౌతికశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అయితే పదార్థం అంతర్గత నిర్మాణం, చర్యల గురించి వివరించేది రసాయన శాస్త్రం.
ఆహారం, ఔషధాలు, ఇంధనం... ఇలా చాలా విషయాలను రసాయన శాస్త్రమే చెప్పాలి. మరో రకంగా చూస్తే తయారు చేయబడే అన్ని పదార్థాలు, సంగ్రహించబడే అన్ని పదార్థాల గురించి రసాయన శాస్త్రం వివరిస్తుంది. అందుకే రసాయన శాస్త్రాన్ని 'సెంట్రల్ సైన్స్' అని అంటారు. ఇక్కడ సెంట్రల్ అనే దాన్ని 'కీలకం' అని మనం అనువదించుకుంటేనే పూర్తి అర్థం బోధపడుతుంది. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఎన్ని విషయాలు చెప్పినా, ఈ ప్రపంచం, జీవులు ఎందుకు కదులుతాయో అందుకే తొలి మూడింటిని భౌతిక శాస్త్రాలు అని పరిశీలిస్తే, మిగతా వాటిని జీవ శాస్త్రాలు అని అంటారు.
అసలు ఈ విషయాలు చెప్పుకోవడానికి సందర్భం ఉంది కనుకనే, ఈ ముచ్చట్లు! 1911లో మేడమ్ క్యూరీకి నోబెల్ బహుమతి రసాయన శాస్త్ర విభాగంలో లభించింది. అది ఆమెకు రెండవసారి! నిజానికి క్యూరి అంటే బహువచనం-పియరీ క్యూరి, మేరి క్యూరి దంపతులు. మేరి- పియరి క్యూరి విద్యార్థిని. వారు ప్రేమించుకుని 1860లో వివా హం చేసుకున్నారు. రేడియో ధార్మికత గురించి వీరిరువురు పరిశోధిం చి థోరియం రేడియో ధార్మిక మూలకంగా కనుగొన్నారు. తర్వాత 1898లో వారు పొలోనియం, రేడియం అనే మూలకాలను కనుగొన్నారు.
ఈ కృషికి వారు 1902లో నోబెల్ బహుమతిని కలిసి అందుకున్నారు. అయితే 1906లో పియరి క్యూరి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రేడియో ధార్మిక పరిశోధనల కారణంగానే మేరికి క్యాన్సర్ వచ్చిందని భావన. మేరి కుమార్తె ఐరిన్, మేరి సహాయకుడు ఫ్రెడిరిక్ జూలియట్ ను వివాహమాడింది. వారిరువురు 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. వీరు కూడా రెండు సంవత్సరాల వ్యవధి లో (1956, 1958 లలో) క్యాన్సర్‌తో మరణించారు. మూడు నోబెల్ బహుమతులు సాధించిన నలుగురి కుటుంబం ఇది.
నిజానికి మేరి క్యూరి జీవితం గమనిస్తే ఒక జానపద కథలాగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతులేని స్ఫూర్తిని మిగుల్చుతుంది. రసాయ న శాస్త్రం ప్రాధాన్యం పట్ల, అవసరం పట్ల అవగాహన తగ్గుతున్న సమయంలో మేరి క్యూరి సైన్స్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ 2011 సంవత్సరంను 'అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం'గా గుర్తించారు. మేరీక్యూరి విజయానికి శత వార్షికమని స్ఫురిస్తూ ఈ అంతర్జాతీయ సంవత్సరం ప్రకటించబడింది. రసాయన శాస్త్రం విజయాలను ప్రస్తుతిస్తూ, మానవ జాతికి అది చేసిన మహత్కార్యాలను గుర్తుచేస్తూ 2011 సంవత్సరం కార్యక్రమాలు సాగాలని 'అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం' నిర్ణయించింది.
మనకు తెలిసిన జగత్తు అంతా ఘన, ద్రవ, వాయు రూపంలోనే ఉంటుంది. రసాయన శాస్త్ర అపరమైన అవగాహన బట్టే మనకీ ప్రపం చం బోధపడుతుంది. నిజానికి అన్ని జీవ వ్యాపారాలూ (క్రియలు) రసాయన చర్యల ద్వారానే నియంత్రించబడతాయి. అయితే అన్ని శాస్త్ర విభాగాల లాగానే రసాయన శాస్త్రాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే రసాయన శాస్త్ర పురోగతి మాత్రమే కాకుండా, మానవ కోటి భవిష్యత్తు కూడా గాయపడుతుంది. విజ్ఞాన శాస్త్రాలలో కీలక స్థానాన్ని ఆక్రమించిన రసాయన శాస్త్రం విజ్ఞానపు పార్శ్వాన్ని, కళాత్మక కోణాన్ని మరింత విపులంగా గుర్తుచేయాలని రసాయన శాస్త్రజ్ఞుల ప్రపంచం తహతహలాడుతోంది.
ముఖ్యంగా బాల బాలికలలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి కలిగించాలని ప్రధానం గా భావిస్తున్నారు. కెమిస్ట్రి క్లాసంటే బోరు అని ఎంతో మంది బాలబాలికలు భావించడానికి కారణం ఎవరో తెలుసా? అలా బోధించే మన ఉపాధ్యాయులూ, మన బోధనా విధానాలూ! ఇది భవదీయుడి అభిప్రాయం కాదు. డాక్టర్ పి.ఎస్.ఎన్. రావు వంటి ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడి ఆలోచనా సరళి. దీని గురించి కూడా ప్రస్తుతం మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ విజయం సాధిస్తే, మరింత గొప్ప పరిశోధనకు ద్వారాలు తెరుచుకొంటాయి.
వాస్తవానికి మారిన విజ్ఞాన పరిస్థితుల్లో రసాయన శాస్త్రం పరిధి అంతులేనిది. జీవశాస్త్రపు లోతులు చూడటానికి రసాయన శాస్త్రం ఒక దివిటీలాగా దోహదపడుతుంది. ఆరోగ్యం, రోగం గురించి బోధపడాలంటే జన్యు స్థాయిలో రసాయన ప్రక్రియలు అవగతం కావాల్సి ఉంది. 2009 సంవత్సరం రసాయన శాస్త్రపు నోబెల్ బహుమతి భారతీయ సంతతికి చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్‌కు వచ్చింది. ఇదే కాదు, ఇటీవల నోబెల్ బహుమతులన్ని,జీవవ్యవస్థల రసాయన ధర్మా లు వివరించడానికే కేటాయించబడ్డాయి. ఆరోగ్యం, పర్యావరణం వం టి వాటికి సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే రసాయన శాస్త్రం ఎంతో అవసరం. ఈ రెండు అంశాలు ఆరోగ్యం, పర్యావరణం అనేవి మనగల అభివృద్ధిని సాధించే విద్యకు చాలా కీలకం. అటువంటి విద్యా సాధనకు ఐక్యరాజ్య సమితి ఒక దశాబ్దాన్ని ప్రకటించింది.
అందుకే రసాయన శాస్త్రాన్ని ఇష్టపడుదాం, అర్థం చేసుకుందాం, మరింత మంచి పరిశోధన చేద్దాం, మరింత అర్థవంతమైన, భద్రత గల భవిష్యత్తును రూపొందించుకుందాం. ఈ దిశలోనే 2011లో వివి ధ విజ్ఞాన శాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి. ఎందుకంటే రసాయన శాస్త్రం అనేది మన జీవితమూ, మన భవిష్యత్తూ కనుక!
-
సైన్స్ అంటే సత్యపథం, ఆశావాదం, కపటం లేని విధానం! ఈ విషయాలు పేర్కొనడానికి కారణాలున్నాయి. సైన్స్ ఆధారంగా ఏర్పడిన సంస్థలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్స్ ద్వారా ఆరోగ్యం, ఆహారం, ఆయుష్షు సాధ్యం కావాలని శ్రమిస్తున్నాయి. అర్ధరహితమైన నమ్మకాలు, దోపిడీ సాగకూడదని భావిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకునిపోయిన మూఢనమ్మకాలు ఇంకా విస్తరిస్తున్నాయి. కానీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి టెక్నాలజీ సైతం దోహదపడవచ్చు. అసంగతమైన నమ్మకాలకు పురిగొల్పే టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు విరివిగా ప్రసారం కావడంలో టెలివిజన్ అనే టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. దీనికి మించి కొత్త రకం సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి స్వరూపం గుర్తించే క్రమంలో బోల్తాపడకూడదు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక సదస్సు జరిగింది. దీని సారాం శం ఏమిటంటే మొబైల్ ఫోన్ల వాడకంతో సమస్యలు లేవనీ, అది కేవలం అర్ధరహిత ప్రచారమని. ఆ మేరకు మరుసటి రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ సదస్సును మొబైల్ కంపెనీలు ఖర్చుతో నిర్వహించారు. అందువల్ల ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే వల్లిస్తుంది. ఈ వార్త ప్రచురింపబడిన రోజునే ఆరోగ్య కార్యక్రమంలో మొబైల్‌ఫోన్‌తో అనర్థాలు చాలా ఉన్నాయని టీవీ చానల్ ప్రసారం చేసింది. నిజానికి ఈ పరిస్థితిని కూల్‌డ్రింకులలో రసాయనాల అంశంతో పోల్చవచ్చు. శీతల పానీయాలలో రసాయనాలున్నాయని సహేతుకంగా రుజువైనా, ప్రచారం పుణ్యమా అని చాలామంది దాన్ని పూర్తిగా నమ్మడం లేదు. ఈ స్థాయిలో శీతలపానీయాల సంస్థలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
శీతలపానీయాల లోగుట్టును వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలూ, సైన్స్ సంస్థలూ చాలా పాటుపడ్డాయి. కొంత విజయం సాధించాయి కూడా! తర్వాత సైన్స్ సంస్థలు ఈ విషయం పట్ల కాస్త వెనుకంజవేయ డం, దాంతో శీతల పానీయాల సంస్థలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. అయితే మొబైల్‌ఫోన్ల వాడకం గురించి పెద్దఎత్తున అవగాహ నా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ ముసుగున మన ఆరోగ్యం, ఉనికి మొదలైన వాటిని దెబ్బతీసే వాటిని గమనించడం సైన్స్ ఉద్యమశీలుర తక్షణ కర్తవ్యం. మొబైల్ బెడద కేవలం ఒకటి మాత్రమే కావచ్చు.
మరింత పరిశీలన చేస్తే మరిన్ని సమస్యలున్నాయని బోధపడవచ్చు. ఇటీవల కాలంలో గ్రహణం, శాంభవి, మరేదో మూఢనమ్మకం.. ఇలా ఏది సంభవించినా టీవీ చానళ్లలో అరగంటకు తక్కువ కాకుండా చర్చలు ప్రసారం అవుతున్నాయి. ఇందు లో ఉదయం పూట జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక వాదనకు నేతృత్వం వహిస్తుండగా; సైన్స్ సంస్థల వ్యక్తులు వారితో విభేదిం చే చర్చలో పాల్గొంటారు. అనుసంధానంగా ఉండే సమన్వయకర్త మాటలకు ఆజ్యం పోస్తూ, మంటలు ఎగిసే చర్చ జరపాలని ప్రయత్నిస్తారు.
ఎటువంటి వెలు గు లేకుండా కేవలం వేడి జిమ్ము తూ చర్చ ముగుస్తుంది. ఇరు వర్గాల తీవ్ర స్వరాలు గుర్తుంటా యి. కానీ చర్చ చివరకు ఏమి చెప్పిందో గుర్తుకురాదు. శృతిమించిన వాదనలు పెరిగి కొందరిని టీవీ కట్టేసేట్టు చేయవచ్చు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయం గల్లంతు కావడాన్ని ఎక్కువమంది గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి చర్చల వల్ల సైన్స్ సంస్థలకు కొంత ప్రచారం లభించవచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా సాధ్యపడిన విషయం కూడా కావచ్చు. కానీ వీక్షకుల దృష్టిలో ఇలా విభేదించే వారిగా, గొడవపడే వారిగా సైన్స్ సంస్థల వ్యక్తులు గుర్తుండిపోవచ్చు.
కానీ సైన్స్ అంటే వీలయినంత ఎక్కువమంది దోహదపడే గొప్ప సాధనమని చెప్పలేకపోతున్నారని గమనించాలి. నిజానికి జ్యోతిష్యం, వాస్తు.. వంటివి ఉపాధి కల్పించే మార్గాలు. కానీ సైన్స్ ప్రచారం వంటివి హాబీగా సాగే పనులు. అందువల్ల మొదటి వర్గంవారు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా, లాఘవంగా సాగుతా రు. వారే ప్రచార మాధ్యమాలకు ప్రకటనలు కూడా ఇస్తారని గమనించా లి. కనుక ప్రసార మాధ్యమాలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా సాగుతా యి. దీనితో సైన్స్ అసలు ప్రయోజనం కనబడకుండాపోతోంది. కానీ కొంత ప్రచారం మాత్రం మిగులుతుంది. సైన్స్‌లేని ప్రచారంతో ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి.
మరోవైపు విలువైన రాళ్లు, శని యంత్రాలు, హనుమాన్ కవచాలు విశృంఖలంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకోవైపు అర్ధరహితమైన కథనాలు సైన్స్ కథనాలుగా రక్తికడుతున్నాయి. అంతకు మించి సైకాలజి, సైన్స్, ఆరోగ్యం అటూ అర్ధరాత్రికి ముందు విచిత్రమైన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. ఈ తరహా అంశాల వల్ల ఏమి ప్రయోజనం ఉందో ఆలోచించాలి.
వీటిని విసర్జించాలని పోరాడేవారు ఎవరు? సైన్స్ సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నారని ఇటువంటి పోకడలను ఉపేక్షించడం తగునా? అందుకే సైన్స్ ఉద్యమ సంస్థలను ఆలోచించమని కోరడం! ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినా, రాయడం అనేది చాలా మౌలికమైన అంశం. అది లేకుండా ఇతర మాధ్యమ రూపాలను మనం ఊహించ లేం. కానీ సైన్స్ రచయితలు ఎందరున్నారని ఎవరైనా అడిగితే చేతి వేళ్ల సంఖ్యను మించిన సంఖ్య రాకపోవడం నేటి విషాదం.
నలభై సంవత్సరాలలోపు సైన్స్ రచయితలు ఎవరైనా ఉన్నారా- అని ఎంతో మందికి సందే హం రావచ్చు. దీన్ని మరింత ముదరనిస్తే ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రావచ్చు. కనుక సైన్స్ ఉద్యమ సంస్థలు నేడు పూర్తిగా దృష్టిపెట్టి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే వాణిజ్య ఎత్తుగడలతో పోరాడుతూ, క్రమంగా ఆ వాణిజ్యానికే పావుగా మారిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు!
-డా. నాగసూరి వేణుగోపాల్
మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించ గలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది.
సెన్స్, టెక్నాలజీ కారణంగా కలిగే ప్రయోజనాల గురించీ, అలాగే మరోవిధంగా వాడితే కలిగే వినాశనం గురించీ చెప్పడానికి- కత్తితో పోల్చడం చాలా కాలంగా ఉంది. కత్తిని రెండు రకాలుగా వినియోగిస్తాం అని చెప్పడం ఉద్దేశ్యం. కానీ, ప్రయోజనాల గురించి చాలా సందర్భాలలో చెప్పకోవాల్సినంతగా మనం ఘనంగా చెప్పుకోవడం లేదేమో! ఒక సంగీతం విషయం తీసుకుంటే టెక్నాలజీ చేసిన దోహదం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది.
తొలి దశలో సైన్స్ అనేది సంగీతం తీరుతెన్నులు తెలుసుకోవడానికి తోడ్పడితే, తర్వాతి దశలో టెక్నాలజీ సంగీతానికి శాశ్వతత్వాన్ని, విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించింది. టెక్నాలజీ సౌలభ్యాలు లేకపోతే గాయనీ గాయకులు ఇంత హాయిగా ప్రావీణ్యం చూసి ఉండేవారు కాదు. ప్రకృతిని అర్థం చేసుకోవడంతో సైన్స్ మొదలై, అనుకరించడంలో వర్ధిల్లుతోంది. మనిషి గళం నుంచి వాయిద్యాల సంగీత ధ్వనులు అర్థం చేసుకోవడానికి శబ్దానికి చెందిన విజ్ఞాన శాస్త్రం గొప్పగా సహకరించింది. అలా సహకరిస్తూ తాను ఎంతో వృద్ధి చెందింది కూడా! హైస్కూలు, ఇంటర్మీడియట్ స్థాయిలో సంగీత వాయిద్యాలు ఎలా పనిచేస్తాయో అని వివరించే అంశాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఇటీవల విజయవాడలో ఒకరోజు పాటు కార్యక్రమం నిర్వహించింది. అందులో టెక్నాలజీ ప్రభావం గురించి వివరించమని ఆహ్వానించినపుడు-ఈ విషయం గురించి మళ్లీ దృష్టిపెట్టాను. గ్రామఫోన్ రికార్డు ద్వారా ధ్వని ముద్రణ మొదలైంది. అదే తర్వాత టేపుగా మారింది. టేపుతో సౌలభ్యం ఉన్నా నాణ్యత మాత్రం గ్రామఫోన్‌దే. తర్వాత వచ్చిన కాంపాక్ట్ డిస్క్ నాణ్యతలో మాత్రం టేపు ను మించిపోయింది.
మరింత చిన్నదిగా మారి, విస్తారమైన సంగీతాన్ని దాచుకోగలిగింది. రేడియో రావడంతో గ్రామఫోన్‌కు రెక్కల గుర్రం లభించినట్టయింది. తర్వాత వచ్చిన క్యాసెట్ రికార్డర్ మరింత విరివిగా సంగీతం లభించేలా సమాజానికి దోహదపడింది. అలాగే సిడి ప్లేయర్ దాన్ని మింగేసి మరింతగా సంగీతానికి దోహదపడింది. తర్వాత ప్రవేశించిన ఎఫ్ఎం రేడియో ఇటు రేడియోలోని సౌలభ్యాన్ని, అటు సిడి ప్లేయర్‌లోని నాణ్యతను అందివ్వగలిగింది. అదే సమయంలో రేడియోతో కలిసిపోయిన టెలిఫోన్- వినేవారికి కావాల్సిన సంగీతాన్ని తక్షణమే అందివ్వ గలిగింది. ప్రజల అభీష్టాన్ని గౌరవించడానికి టెక్నాలజీ దోహదపడింది.
ఇదంతా దృశ్యరూపం నోచుకోని సంగీత పరిస్థితికి వివరణ. ఘంటసాల హయాంలో టీవీలూ, వీడియో క్యాసెట్లు రాలేదు. సినిమా పాట అంటే ఆకాశవాణి, గాయనీగాయకులు, సినిమా పేరు, సినిమా దర్శకుడు అని మాత్రమే పరిచయం. కేవలం చెవి ద్వారా మనసులో గీతం బోధప డి అర్థపరిమళం బుద్ధిని సోకే వెసులుబాటు ఉండేది. రేడియో స్థానాన్ని టీవీ ఆక్రమించిన తర్వాత గాయనీగాయకుల స్థానాన్ని నటీనటులూ, సంగీత దర్శకుల స్థానాన్ని కెమెరామెన్ ఆక్రమించారని వ్యాఖ్యానించినా తప్పు లేదు.
రేడియో స్వర్ణయుగం తెలియని వారికి నేడు టీవీలో కనిపించే నృత్యభంగిమలే, వర్ణశోభితమైన దృశ్యాలే గుర్తుంటాయి. దృశ్యానికుండే శక్తి అంతటిది. అప్పటి పరిస్థితే ఘంటసాలకు గొప్పగా లాభించింది. ఆయన వేలాది పాటలు పాడకపోయినా విశేషమైన గుర్తింపు లభించింది. అదే సమయంలో గొప్పగా వృద్ధి చెందిన టెక్నాలజీ నేటి గాయనీ గాయకులకు ప్రతిబంధకంగా కూడా మారిపోయిందని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. పాశ్చాత్య సంగీతానికి టెక్నాలజీ తోడ్పాటు మరింత పెద్దది. టెక్నాల జీ లేకుండా పాశ్చత్య సంగీతాన్ని అసలు ఊహించలేము కూడా! రచన, గానం, నృత్యం, నృత్యదర్శకత్వం, సంగీత దర్శకత్వం అనేవి ఒకే వ్యక్తిలో కలిసిపోవడంతో పాటు మినుకుమనే, తళుకులూ, అలాగే సంగీతశాలలోని ఆధునికమైన సంగీతపు ఏర్పాట్లు విశేషంగా ఉంటాయి. అంతేకాదు గానం అనేది పరిసరాల మీదా, వాతావరణం మీద ఆధారపడుతుందని భావిస్తాడు. అందుకే ఉదయరాగాలు, సంధ్యారాగాలు అని వివరిస్తారు కూడా. ఇటువంటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించే రీతిలో సంగీత ప్రదర్శనశాలలు రూపొందాయి.
కంప్యూటర్ రావడం, ఇంటర్‌నెట్ తోడవడం అనేది అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదని చెప్పుకోవచ్చు. ఒక మహానది ద్వారా అనంత సాగరాన్ని చేరడం అనే భావన కూడా కలుగుతుంది. కంప్యూటర్ రాకతో సిడి, వీడియో, రేడియో, టీవీ, ఫోన్ అన్నీ కలగలిసిపోయాయి. మన దేశంలో ఇంకా కంప్యూటర్ చాలా మందికి అస్పృశ్యంగానే ఉంది. అక్షరాస్యత, ఆర్థిక పరిస్థితి ఇంకా అవరోధాలు గానే నిలిచి కంప్యూటర్‌ను దూరంగా ఉంచాయి. కంప్యూటర్, నెట్ ఎక్కువ మందికి చేరిననాడు మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. దానికి వాణిజ్యం తోడ్పడుతుంది.
మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించగలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది. తాజా సాక్ష్యంగా చెప్పాలంటే టీవీ చానళ్ల ద్వారా వెలుగుచూసి, ప్రచారాన్ని పొందిన వర్ధమాన గాయనీ గాయకుల జాబితా గురించి పేర్కొనాలి. మరింత తాజా ఉదాహరణ ఏమిటి అంటే టీవీలో మారుమ్రోగుతున్న తెలుగు జానపద గీతాన్ని మీకు గుర్తు చేయాలి మరి!
-నాగసూరి వేణుగోపాల్
ఇరవయో శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక ప్రగతి అనూహ్యంగా ఉందని భావిస్తారు. గతం నుంచి వర్తమానంలోకి వస్తున్నప్పుడు ఈఅనూహ్యా లు వరసగా తారసపడతాయి. రేడియో, టెలివిజన్, సినిమా, టెలిఫోన్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ.. వంటి చాలా విభాగాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని, ఇంతగా ప్రభావాన్ని కలుగజేస్తాయని ఎవరూ ఊహించలేదు.
ఎలక్ట్రాన్‌ను ఆవిష్కరించిన జె.జె.థాంసన్ తన పరిశోధనకు ఫలితాలు పెద్దగా ఉండక పోవచ్చని భావించారు. కానీ పాదార్థిక పరిశోధనకు, ఎలెక్ట్రానిక్స్‌కూ తెరలేపింది ఈ ఎలెక్ట్రాన్ ఆవిష్కరణే! అలాగే గత దశాబ్దపు సాంకేతిక విజ్ఞాన ప్రభావాన్ని ఒక సారి అవలోకిస్తే-మరెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అక్షరం చెరిగిపోలేదు గానీ అదృశ్య రూపంగా, అరూపంగా మారింది. ఉత్తరాలు, వ్రాత ప్రతులు తగ్గిపోయి మౌఖిక రూపంలో సాఫ్ట్ అవతారం ధరించింది. వివరంగా చెప్పాలంటే ఈ పదేళ్ళలో ఉత్తరాలు బాగా తగ్గిపోయాయి.
డిసెంబర్ నెల చివరి వారం అంటే తమకు ఉత్తరాల భారం పెరుగుతుందని పోస్టల్ శాఖ వారూ, ఆలస్యంగా వస్తాయని ప్రజలు ఆందోళన పడేవారు. ఆ స్థాయిలో గ్రీటింగ్ కార్డుల హడావుడి ఉండేది. ఇపుడంత లేదు. కానీ ఈ భారం నేడు సెల్ ఫోన్, ఇంటర్నెట్‌ల మీద పడింది. కంప్యూటర్, ఇంటర్నెట్‌కు సంబంధించి చాలా గొప్ప ఫలితం, ఎక్కువ ప్రయోజనకరమైన విశేషం- ఈ మెయిల్. ఎటువంటి జాప్యం లేకుండా సమాచారం పంపడమే కాదు, మన సమాచా రం మన దగ్గరే భద్రంగా ఉంచుకుని-కావాల్సిన వాళ్ళకు క్షణంలో పంపవచ్చు.
మరో రకంగా జిరాక్స్ ఖర్చును తగ్గించింది. ఇక షార్ట్ మెసేజ్ సర్వీ స్ (ఎస్ఎమ్ఎస్)తో సమాచారం కచ్చితంగా, త్వరగా అరచేతిలో వాలడం మన దేశానికి ఈ దశాబ్దపు వింతే! అదే సమయంలో ఇంగ్లీషు భయంకరంగా రూపు కోల్పోతున్నదని భాషా వేత్తలు ఆందోళన పడుతున్నారు. తెలుగు ఇంకా కంప్యూటర్ భాషగా విస్తరించలేదు కనుక, మనకా సమస్య లేదు. తెలుగు భాషకు ఇంత స్థాయిలో సాంకేతిక పుష్టి లభించినప్పుడు మనం ఇంకెంత స్థాయిలో తెలుగును దోష భూయిష్టం చేస్తామో తేలీదు! సరళీకరణ, ఉదారీకరణ ఫలితాలు వెల్లువయ్యింది - ఈ దశాబ్దంలోనే.
విమాన ప్రయాణం ఇదివరకు కాల్పనిక రచనలలో కూడా తక్కువగా ఉం డేది. కానీ నేడు అది చాలా సామాన్యమైపోయింది. అంతేకాదు, విదేశాలకు పోక, తర్వాత బంధువులు పోయి రావడాలు, అక్కడి పరికరాలు వగైరా గమనించడాలు, ఇక్క డ కూడా అలాంటివి రావాల ని కోరుకోవడాలు బాగా పెరిగింది. స్వంత వాహనాలు విషయానికి వస్తే 20వ శతా బ్దం చివరి దశాబ్దంలో స్కూటర్ పాతబడి పోయింది. ఈ దశాబ్దంలో కారు సహజమైపోయింది. లక్ష రూపాయలకు నానో కారు అనే విషయాన్ని సంచలనాత్మకంగా చర్చించారు. చర్చ ఉన్న స్థాయిలో కారు లేదన్నది వేరే విషయం.
అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలాగానే కంప్యూటర్ ఖరీదు తగ్గింది. ఈ విషయం చెప్పుకుంటున్నప్పుడు ఎటిఎంల గురించి చెప్పుకోకపోతే బావుండదు. ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ -బ్యాంకులో డబ్బులుంటే చాలు రాల్చుకోవచ్చు శ్రమ లేకుండా. ఇటువంటి దానికీ పాస్‌బుక్కు, చెక్కు, బ్యాంక్ టైమింగ్స్, వెయిటింగ్ విసుగు వంటి వాటితో కలసిన రోజులను పోల్చుకోండి -అప్పుడు తెలుస్తుంది టెక్నాలజీ సౌఖ్యం! సరిగ్గా ఇటువంటిదే టీవీ వినోదం. ఎటువంటి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా, కాలయాపన లేకుండా 'కావాల్సింది కావాల్సినంత' అనే స్థాయి లో టీవీ వినోదం విచ్చల విడిగా లభిస్తోంది.
దీన్నయితే అసలు ఊహించలేదు. దేశంలో ఐదువందలకు పై చిలుకు - ఒక లెక్కింపు ప్రకారం 503 - రకరకాల చానళ్ళతో ముందు ముందు 'టీవీ వైరాగ్యం' కూడా విరివిగా పల్లవించే పరిస్థితి రావచ్చు. టెక్నాలజీ వినియోగం బాగా పెరిగి, వీటి రూపకల్పనకు మూల భూతమైన విజ్ఞాన భావనలు, శాస్త్రీయ అభినివేశం పూర్తిగా అంతరించి పోయిందేమో అనే భయం కలుగుతుంది. శాస్త్రీయ దృష్టి సరే, ఇంగితం కూడా అంతర్ధానం అవుతోందనే భయం కలుగుతోంది.
ఇది ఒక వైపుకాగా, మరో వైపు ఆత్మ విశ్వాసం క్లాసులతోపాటు దేవాలయాలు, పూజలు, మొక్కులు వగైరాలు కూడా మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతకుమించి విగ్రహాలు, బొమ్మలు, ఆచారాలు మరింతగా జనంలోకి చొచ్చుకువచ్చాయి. టెక్నాలజీ వాడకం పెరిగితే, దాని ద్వారా తారసపడే మోసాలు కూడా పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా - అన్నట్టు నేరాలలో సైబర్ నేరాలు గొప్పవయా -అని చెప్పుకోవాలి. వీటిలో ప్రక్రియ ఎంత సరళంగా, లాఘవంగా ఉంటుందో జరిగే మోసం అంత భారీ స్థాయిలో ఉంటోంది.
అంతకుమించి సృజనాత్మకంగా ఉంటుంది. నిజానికి దీని గురించి ఎక్కువ చర్చిస్తే టెక్నాలజీ అంటే భయం పెరుగుతుందని భావించే వారు కూడా ఉన్నారు. నిజానికి సైబర్ నేరాలకు అవసరమైన చట్టాలు మరింత పకడ్బందీగా ఏర్పడుతున్న కాలమిది. వీటన్నిటితో పాటు, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల విపరీతమైన మోజు పెరిగి మౌలిక విజ్ఞాన అంశాల పట్ల గౌరవం, అభిమానం తగ్గడం ఆందోళన కల్గిస్తోంది. బి.టెక్ వైపు ఉన్న హడావుడిలో బియస్సి వైపు దాదా పు లేదని డిగ్రీ కోర్సుల వివరాలు చెబుతున్నాయి
. ఇలా జరగడం ముందు ముందు మౌలిక పరిశోధనలనే దెబ్బతీస్తుంది. అందుకే పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి కల్గించాలనే కొంత ప్రయత్నం ఈ దశాబ్దంలో పెరిగింది. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రయోగశాలలను చూసే అవకాశం ఇప్పుడు కల్గిస్తున్నారు. ఫలితంగా సైన్స్ పట్ల మరింత మక్కువ పెరగగలదని నమ్మకం. ఇక చివరగా తెలుగు పత్రికలలో పాపులర్ సైన్స్, సైన్స్ అంశాల శీర్షికలు, సమాచారం బాగా తగ్గిపోయింది ఈ దశాబ్దంలోనే.
సైన్స్ పుస్తకాల అమ్మకాలు గణనీయంగా తగ్గకపోయినా -పత్రికలలో సైన్స్ సమాచారం బాగా తగ్గిపోయింది. కేవలం వాణిజ్యపు లంకె ఉండే టెక్నాలజీ అంశాలు, కన్స్యూమర్ గూడ్స్ వంటి వాటికి సంబంధించి సమాచారం ఇస్తున్నారు. అలాగే వైజ్ఞానిక కల్పనా సాహిత్యానికి సంబంధించి తెలుగులో ఈ దశాబ్దంలో వచ్చిన చెప్పుకోదగ్గ రచనలు పెద్దగా లేవు.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
Phd (Journalism) from AU courtesy:Vaartha 20.12.2010
Posted by Nagasuri on Sunday, December 19, 2010Labels: Andhrajyothy, awards, Nagasuri, Nagasuri Venugopal
సైన్స్ అంటే సత్యపథం, ఆశావాదం, కపటం లేని విధానం! ఈ విషయాలు పేర్కొనడానికి కారణాలున్నాయి. సైన్స్ ఆధారంగా ఏర్పడిన సంస్థలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్స్ ద్వారా ఆరోగ్యం, ఆహారం, ఆయుష్షు సాధ్యం కావాలని శ్రమిస్తున్నాయి. అర్ధరహితమైన నమ్మకాలు, దోపిడీ సాగకూడదని భావిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకునిపోయిన మూఢనమ్మకాలు ఇంకా విస్తరిస్తున్నాయి. కానీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి టెక్నాలజీ సైతం దోహదపడవచ్చు. అసంగతమైన నమ్మకాలకు పురిగొల్పే టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు విరివిగా ప్రసారం కావడంలో టెలివిజన్ అనే టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. దీనికి మించి కొత్త రకం సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి స్వరూపం గుర్తించే క్రమంలో బోల్తాపడకూడదు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక సదస్సు జరిగింది. దీని సారాం శం ఏమిటంటే మొబైల్ ఫోన్ల వాడకంతో సమస్యలు లేవనీ, అది కేవలం అర్ధరహిత ప్రచారమని. ఆ మేరకు మరుసటి రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ సదస్సును మొబైల్ కంపెనీలు ఖర్చుతో నిర్వహించారు. అందువల్ల ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే వల్లిస్తుంది. ఈ వార్త ప్రచురింపబడిన రోజునే ఆరోగ్య కార్యక్రమంలో మొబైల్‌ఫోన్‌తో అనర్థాలు చాలా ఉన్నాయని టీవీ చానల్ ప్రసారం చేసింది. నిజానికి ఈ పరిస్థితిని కూల్‌డ్రింకులలో రసాయనాల అంశంతో పోల్చవచ్చు. శీతల పానీయాలలో రసాయనాలున్నాయని సహేతుకంగా రుజువైనా, ప్రచారం పుణ్యమా అని చాలామంది దాన్ని పూర్తిగా నమ్మడం లేదు. ఈ స్థాయిలో శీతలపానీయాల సంస్థలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
శీతలపానీయాల లోగుట్టును వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలూ, సైన్స్ సంస్థలూ చాలా పాటుపడ్డాయి. కొంత విజయం సాధించాయి కూడా! తర్వాత సైన్స్ సంస్థలు ఈ విషయం పట్ల కాస్త వెనుకంజవేయ డం, దాంతో శీతల పానీయాల సంస్థలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. అయితే మొబైల్‌ఫోన్ల వాడకం గురించి పెద్దఎత్తున అవగాహ నా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ ముసుగున మన ఆరోగ్యం, ఉనికి మొదలైన వాటిని దెబ్బతీసే వాటిని గమనించడం సైన్స్ ఉద్యమశీలుర తక్షణ కర్తవ్యం. మొబైల్ బెడద కేవలం ఒకటి మాత్రమే కావచ్చు.
మరింత పరిశీలన చేస్తే మరిన్ని సమస్యలున్నాయని బోధపడవచ్చు. ఇటీవల కాలంలో గ్రహణం, శాంభవి, మరేదో మూఢనమ్మకం.. ఇలా ఏది సంభవించినా టీవీ చానళ్లలో అరగంటకు తక్కువ కాకుండా చర్చలు ప్రసారం అవుతున్నాయి. ఇందు లో ఉదయం పూట జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక వాదనకు నేతృత్వం వహిస్తుండగా; సైన్స్ సంస్థల వ్యక్తులు వారితో విభేదిం చే చర్చలో పాల్గొంటారు. అనుసంధానంగా ఉండే సమన్వయకర్త మాటలకు ఆజ్యం పోస్తూ, మంటలు ఎగిసే చర్చ జరపాలని ప్రయత్నిస్తారు.
ఎటువంటి వెలు గు లేకుండా కేవలం వేడి జిమ్ము తూ చర్చ ముగుస్తుంది. ఇరు వర్గాల తీవ్ర స్వరాలు గుర్తుంటా యి. కానీ చర్చ చివరకు ఏమి చెప్పిందో గుర్తుకురాదు. శృతిమించిన వాదనలు పెరిగి కొందరిని టీవీ కట్టేసేట్టు చేయవచ్చు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయం గల్లంతు కావడాన్ని ఎక్కువమంది గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి చర్చల వల్ల సైన్స్ సంస్థలకు కొంత ప్రచారం లభించవచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా సాధ్యపడిన విషయం కూడా కావచ్చు. కానీ వీక్షకుల దృష్టిలో ఇలా విభేదించే వారిగా, గొడవపడే వారిగా సైన్స్ సంస్థల వ్యక్తులు గుర్తుండిపోవచ్చు.
కానీ సైన్స్ అంటే వీలయినంత ఎక్కువమంది దోహదపడే గొప్ప సాధనమని చెప్పలేకపోతున్నారని గమనించాలి. నిజానికి జ్యోతిష్యం, వాస్తు.. వంటివి ఉపాధి కల్పించే మార్గాలు. కానీ సైన్స్ ప్రచారం వంటివి హాబీగా సాగే పనులు. అందువల్ల మొదటి వర్గంవారు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా, లాఘవంగా సాగుతా రు. వారే ప్రచార మాధ్యమాలకు ప్రకటనలు కూడా ఇస్తారని గమనించా లి. కనుక ప్రసార మాధ్యమాలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా సాగుతా యి. దీనితో సైన్స్ అసలు ప్రయోజనం కనబడకుండాపోతోంది. కానీ కొంత ప్రచారం మాత్రం మిగులుతుంది. సైన్స్‌లేని ప్రచారంతో ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి.
మరోవైపు విలువైన రాళ్లు, శని యంత్రాలు, హనుమాన్ కవచాలు విశృంఖలంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకోవైపు అర్ధరహితమైన కథనాలు సైన్స్ కథనాలుగా రక్తికడుతున్నాయి. అంతకు మించి సైకాలజి, సైన్స్, ఆరోగ్యం అటూ అర్ధరాత్రికి ముందు విచిత్రమైన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. ఈ తరహా అంశాల వల్ల ఏమి ప్రయోజనం ఉందో ఆలోచించాలి.
వీటిని విసర్జించాలని పోరాడేవారు ఎవరు? సైన్స్ సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నారని ఇటువంటి పోకడలను ఉపేక్షించడం తగునా? అందుకే సైన్స్ ఉద్యమ సంస్థలను ఆలోచించమని కోరడం! ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినా, రాయడం అనేది చాలా మౌలికమైన అంశం. అది లేకుండా ఇతర మాధ్యమ రూపాలను మనం ఊహించ లేం. కానీ సైన్స్ రచయితలు ఎందరున్నారని ఎవరైనా అడిగితే చేతి వేళ్ల సంఖ్యను మించిన సంఖ్య రాకపోవడం నేటి విషాదం.
నలభై సంవత్సరాలలోపు సైన్స్ రచయితలు ఎవరైనా ఉన్నారా- అని ఎంతో మందికి సందే హం రావచ్చు. దీన్ని మరింత ముదరనిస్తే ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రావచ్చు. కనుక సైన్స్ ఉద్యమ సంస్థలు నేడు పూర్తిగా దృష్టిపెట్టి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే వాణిజ్య ఎత్తుగడలతో పోరాడుతూ, క్రమంగా ఆ వాణిజ్యానికే పావుగా మారిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు!
-డా. నాగసూరి వేణుగోపాల్
సెన్స్, టెక్నాలజీ కారణంగా కలిగే ప్రయోజనాల గురించీ, అలాగే మరోవిధంగా వాడితే కలిగే వినాశనం గురించీ చెప్పడానికి- కత్తితో పోల్చడం చాలా కాలంగా ఉంది. కత్తిని రెండు రకాలుగా వినియోగిస్తాం అని చెప్పడం ఉద్దేశ్యం. కానీ, ప్రయోజనాల గురించి చాలా సందర్భాలలో చెప్పకోవాల్సినంతగా మనం ఘనంగా చెప్పుకోవడం లేదేమో! ఒక సంగీతం విషయం తీసుకుంటే టెక్నాలజీ చేసిన దోహదం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది.
తొలి దశలో సైన్స్ అనేది సంగీతం తీరుతెన్నులు తెలుసుకోవడానికి తోడ్పడితే, తర్వాతి దశలో టెక్నాలజీ సంగీతానికి శాశ్వతత్వాన్ని, విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించింది. టెక్నాలజీ సౌలభ్యాలు లేకపోతే గాయనీ గాయకులు ఇంత హాయిగా ప్రావీణ్యం చూసి ఉండేవారు కాదు. ప్రకృతిని అర్థం చేసుకోవడంతో సైన్స్ మొదలై, అనుకరించడంలో వర్ధిల్లుతోంది. మనిషి గళం నుంచి వాయిద్యాల సంగీత ధ్వనులు అర్థం చేసుకోవడానికి శబ్దానికి చెందిన విజ్ఞాన శాస్త్రం గొప్పగా సహకరించింది. అలా సహకరిస్తూ తాను ఎంతో వృద్ధి చెందింది కూడా! హైస్కూలు, ఇంటర్మీడియట్ స్థాయిలో సంగీత వాయిద్యాలు ఎలా పనిచేస్తాయో అని వివరించే అంశాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఇటీవల విజయవాడలో ఒకరోజు పాటు కార్యక్రమం నిర్వహించింది. అందులో టెక్నాలజీ ప్రభావం గురించి వివరించమని ఆహ్వానించినపుడు-ఈ విషయం గురించి మళ్లీ దృష్టిపెట్టాను. గ్రామఫోన్ రికార్డు ద్వారా ధ్వని ముద్రణ మొదలైంది. అదే తర్వాత టేపుగా మారింది. టేపుతో సౌలభ్యం ఉన్నా నాణ్యత మాత్రం గ్రామఫోన్‌దే. తర్వాత వచ్చిన కాంపాక్ట్ డిస్క్ నాణ్యతలో మాత్రం టేపు ను మించిపోయింది.
మరింత చిన్నదిగా మారి, విస్తారమైన సంగీతాన్ని దాచుకోగలిగింది. రేడియో రావడంతో గ్రామఫోన్‌కు రెక్కల గుర్రం లభించినట్టయింది. తర్వాత వచ్చిన క్యాసెట్ రికార్డర్ మరింత విరివిగా సంగీతం లభించేలా సమాజానికి దోహదపడింది. అలాగే సిడి ప్లేయర్ దాన్ని మింగేసి మరింతగా సంగీతానికి దోహదపడింది. తర్వాత ప్రవేశించిన ఎఫ్ఎం రేడియో ఇటు రేడియోలోని సౌలభ్యాన్ని, అటు సిడి ప్లేయర్‌లోని నాణ్యతను అందివ్వగలిగింది. అదే సమయంలో రేడియోతో కలిసిపోయిన టెలిఫోన్- వినేవారికి కావాల్సిన సంగీతాన్ని తక్షణమే అందివ్వ గలిగింది. ప్రజల అభీష్టాన్ని గౌరవించడానికి టెక్నాలజీ దోహదపడింది.
ఇదంతా దృశ్యరూపం నోచుకోని సంగీత పరిస్థితికి వివరణ. ఘంటసాల హయాంలో టీవీలూ, వీడియో క్యాసెట్లు రాలేదు. సినిమా పాట అంటే ఆకాశవాణి, గాయనీగాయకులు, సినిమా పేరు, సినిమా దర్శకుడు అని మాత్రమే పరిచయం. కేవలం చెవి ద్వారా మనసులో గీతం బోధప డి అర్థపరిమళం బుద్ధిని సోకే వెసులుబాటు ఉండేది. రేడియో స్థానాన్ని టీవీ ఆక్రమించిన తర్వాత గాయనీగాయకుల స్థానాన్ని నటీనటులూ, సంగీత దర్శకుల స్థానాన్ని కెమెరామెన్ ఆక్రమించారని వ్యాఖ్యానించినా తప్పు లేదు.
రేడియో స్వర్ణయుగం తెలియని వారికి నేడు టీవీలో కనిపించే నృత్యభంగిమలే, వర్ణశోభితమైన దృశ్యాలే గుర్తుంటాయి. దృశ్యానికుండే శక్తి అంతటిది. అప్పటి పరిస్థితే ఘంటసాలకు గొప్పగా లాభించింది. ఆయన వేలాది పాటలు పాడకపోయినా విశేషమైన గుర్తింపు లభించింది. అదే సమయంలో గొప్పగా వృద్ధి చెందిన టెక్నాలజీ నేటి గాయనీ గాయకులకు ప్రతిబంధకంగా కూడా మారిపోయిందని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. పాశ్చాత్య సంగీతానికి టెక్నాలజీ తోడ్పాటు మరింత పెద్దది. టెక్నాల జీ లేకుండా పాశ్చత్య సంగీతాన్ని అసలు ఊహించలేము కూడా! రచన, గానం, నృత్యం, నృత్యదర్శకత్వం, సంగీత దర్శకత్వం అనేవి ఒకే వ్యక్తిలో కలిసిపోవడంతో పాటు మినుకుమనే, తళుకులూ, అలాగే సంగీతశాలలోని ఆధునికమైన సంగీతపు ఏర్పాట్లు విశేషంగా ఉంటాయి. అంతేకాదు గానం అనేది పరిసరాల మీదా, వాతావరణం మీద ఆధారపడుతుందని భావిస్తాడు. అందుకే ఉదయరాగాలు, సంధ్యారాగాలు అని వివరిస్తారు కూడా. ఇటువంటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించే రీతిలో సంగీత ప్రదర్శనశాలలు రూపొందాయి.
కంప్యూటర్ రావడం, ఇంటర్‌నెట్ తోడవడం అనేది అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదని చెప్పుకోవచ్చు. ఒక మహానది ద్వారా అనంత సాగరాన్ని చేరడం అనే భావన కూడా కలుగుతుంది. కంప్యూటర్ రాకతో సిడి, వీడియో, రేడియో, టీవీ, ఫోన్ అన్నీ కలగలిసిపోయాయి. మన దేశంలో ఇంకా కంప్యూటర్ చాలా మందికి అస్పృశ్యంగానే ఉంది. అక్షరాస్యత, ఆర్థిక పరిస్థితి ఇంకా అవరోధాలు గానే నిలిచి కంప్యూటర్‌ను దూరంగా ఉంచాయి. కంప్యూటర్, నెట్ ఎక్కువ మందికి చేరిననాడు మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. దానికి వాణిజ్యం తోడ్పడుతుంది.
మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించగలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది. తాజా సాక్ష్యంగా చెప్పాలంటే టీవీ చానళ్ల ద్వారా వెలుగుచూసి, ప్రచారాన్ని పొందిన వర్ధమాన గాయనీ గాయకుల జాబితా గురించి పేర్కొనాలి. మరింత తాజా ఉదాహరణ ఏమిటి అంటే టీవీలో మారుమ్రోగుతున్న తెలుగు జానపద గీతాన్ని మీకు గుర్తు చేయాలి మరి! -నాగసూరి వేణుగోపాల్
దాదాపు లక్షన్నరమంది 'తారలు' గ్రూప్-4 పరీక్షలకు అభ్యర్థులుగా ఉండడం అసలు వార్త. సుమారు పన్నెండు లక్షలమంది అభ్యర్థుల లో కొందరు అంటే ఐశ్వర్యరాయ్, నయనతార, శ్రీదేవి, మాధురిదీక్షిత్, సానియామీర్జా, సోనియాగాంధీ, రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, చిరంజీవి వంటి వారి ఫోటోలు కనిపించాయట! తమాషాగా అప్లయి చేసి-పేర్లు, ఫోటోలు ఇలాంటి ప్రముఖులవి తగిలించారట. ఇలా ఎనిమిదోవంతు దాకా వ్యాపించి ఉన్న దరఖాస్తులను వేరు చేయడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి గగనమైందట. ఆటపట్టించడానికి అప్లయ్ చేసిన వారెవరూ పరీక్ష రుసుము పంపలేదట. కంప్యూటర్ ప్రోగ్రాంలో సమస్య ఉండి,పరీక్ష రుసుం లేకనే అప్లికేషన్ ఆమోదింపబడిందట. మరికొందరు ప్రబుద్ధులు మొక్క లు, చెట్లు, జంతువుల ఫోటోలతో నింపారట. ఈ వ్యవహారం చూస్తే 'పిల్లి కి చెలగాటం' అనే సామెత గుర్తుకురావచ్చు.అలాగే 108 నెంబర్‌కు ఫోన్ చేసే ఆకతాయి కాలర్స్ ఎక్కువైపోయారని సమాచారం. నిజంగా సమస్య లేకపోయినా, ఫోన్ చేసి ఆటపట్టించడం పెరిగిందని తెలుస్తోంది. ఇక్కడ తొలిరకం ఆకతాయిలకూ, రెండవ రకం ఆకతాయిలకు తేడా ఏమీ లేదు. ఆన్‌లైన్‌లో అల్లరి చేసే వారికి కాస్తా సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. అంతే!ఇది ఒక పార్శ్వం కాగా, దీనికి పూర్తిగా భిన్నమైన దృశ్యం ఇంకోటి ఉంది. నెంబర్ 782474317884 ప్రాధాన్యం ఏమిటి? ఇది మన దేశంలో తొలి ఆధార్ గుర్తింపు సంఖ్య. మహారాష్ట్రకు చెందిన గిరిజన మహిళ రంజ న సోనా వాణెకు చెందిన గుర్తింపు సంఖ్య అది. ఆవిడ వేలుముద్రలు, కనుపాప ముద్రలతో సహా నిక్షిప్తమైన బయోమెట్రిక్ ఐడెంటిటి నెంబర్ అది. దీనినే సులువుగా అర్థం కావడానికి 'ఆధార్' అని వ్యవహరిస్తున్నారు. ఇందులో పన్నెండు అంకెలుంటాయి.వీటితో పాటు బహిర్గతం కానీ మరో నాలుగు అంకెలు కూడా ఉంటాయి. ఇది అధికారిక అవసరాల కోసం రహస్యంగా ఉంచబడతాయి. ఈ గుర్తింపు సంఖ్య ప్రాధాన్యం ఏమిటంటే భారతదేశంలో మరే వ్యక్తికీ ఈ సంఖ్య ఉండదు. ఈ సంఖ్య అంటే ఆ ఫలానా వ్యక్తి అని అర్థం. దీనిద్వారా బ్యాంకు అకౌంట్ తెరవడం, గ్యాస్ కనెక్షన్ సాధించడం, రేషన్‌కార్డు పొందడం, ఇంకా పాన్‌కార్డు, ఫోన్ కనెక్షన్, పాస్‌పోర్టు వంటివి కూడా పొందడానికి వీలవుతుంది. ఈ జాబితాలో మరికొన్ని వచ్చి చేరే అవకాశం ఉంది.అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధా ని మన్మోహన్ 'ప్రపంచంలో మరెక్కడా ఇంత భారీ స్థాయిలో సాంకెతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం లేదని' పేర్కొంటూ త్వరలో ప్రతి భారతీయుడు 'ఆధార్' సంఖ్య పొందే వీలుందని విశదం చేశారు. ఇది తక్కువ ఖర్చుతో, జాతీయస్థాయిలో ఉపయోగపడే, తర్వగా పరీక్షించే వీలున్న గుర్తింపు సంఖ్య ఆధార్.ఆధార్ గుర్తింపు సంఖ్య సెప్టెంబర్ 30న శ్రీకారం చుట్టుకుంది. దీనికి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు అవుతోందని ఒక అంచనా. సుమారు ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రజలంద రూ ఈ గుర్తింపు సంఖ్యను పొందగలరని మరో గణింపు. దీని ద్వారా ప్రభు త్వ పథకాల సద్వినియోగం కాగలవని ఆశ. ఎన్నికల మోసాలు అరికట్టటడంతోపాటు ఉగ్రవాదం వంటి సమస్యను అంతమొందించడానికి ఈ 'ఆధార్' వ్యవస్థ దోహదపడుతోందని భావిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలిస్తే ఇదంతా సాధ్యమా? అని కూడా అనిపించవచ్చు.సెప్టెంబర్ 30 దరిదాపుల్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఈ 12 అంకెల సంఖ్యను మరింత వినియోగించుకోవచ్చునని తెలుపుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన అయోధ్యకు సంబంధించి తీర్పు వెలువడింది. ఆ సందర్భంగా మొబైల్ ఫోన్లలో బల్క్ మెసేజ్‌లను నిషేధించారు. చాలా మంది మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఆధార పత్రాలు పంపమనే ప్రక్రియ మొదలైంది. రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ఉంటే సరిదిద్దుతారు. అంతేకాదు త్వరలో ఫోన్‌నెంబర్లు ఇక నుంచి 12 అంకెలు కలిగి ఉంటాయి. జనాభా వందకోట్లు దాటిపోయినప్పడు పది అంకెల మొబైల్‌నెంబర్ సరిపోదు. ఇంకా వివరంగా చెప్పాలంటే 117 కోట్ల జనాభా ఉండగా 65.242 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని అంటున్నారు. ఇది గత జూలై మాసపు లెక్కింపు అట. కాకతాళీయంగా సెప్టెంబర్ 28న మరో ప్రకటన వెలువడింది. బ్యాంకు బ్రాంచీలు, ఎటిఎం సేవలు అందని మారుమూల ప్రాంతాలకు సేవలు తప్పక అందాలని రిజర్వ్‌బాంక్ మార్గ నిర్దేశాలను గత మంగళవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా బిజినెస్ కరస్పాండెం ట్లు నియమించబడతారు. డబ్బులు జమ చేయడం, వెనక్కి తీసుకోవడం వంటి పనులను ఈ కరస్పాండెంట్లు చేస్తారు. దీనికి మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం దోహదపడుతుంది.ఒక వారంలో సంబంధించిన మూడు సంఘటనలకు ఈ పన్నెండు అంకెల సంఖ్య మంచి పరిష్కారం కాగలదని 'టెక్నాలజీ విజనరీస్' భావిస్తున్నారు. యూనిక్ ఐడెంటిటి నెంబర్ ఒకవైపు మొబైల్ ఫోన్ నెంబర్‌గా, మరోవైపు మొబైల్ బ్యాంకింగ్ నెంబర్‌గాకూడా ఉపయోగపడుతుందని వీరి ప్రతిపాదన. వివరాలు పరిశీలిస్తే ఇది సాధ్యమా అని ఆశ్చర్యం కలగవచ్చు.అదే సమయంలో గత మూడు దశబ్దాలలో సంభవించిన కంప్యూట ర్ విప్లవాలు పరికిస్తే ఇవన్నీ సాధ్యం కావచ్చు అనే నమ్మకం కూడా కలుగుతుంది. అరకొర పొరపాట్లు, అజాగ్రత్తలు, కొన్ని మోసాలు కూడా ఎదురుకావచ్చు. వాటికి వ్యవస్థలో స్వాభావికంగా ఉండే నిర్లిప్తత ఆజ్యం పోయవచ్చు. అయినా పట్టు సడలవలసిన పని లేదు. అటువంటి దుశ్చర్యలకు కళ్ళెం వేయాల్సిందే!మన సమాజం వైవిధ్యంగా ఉన్నప్పుడు ప్రయత్నా లు, ప్రయోగాలు విభిన్నంగానే ఉంటాయి. అందుకే ఐశ్వర్యరాయ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థిగా ఆవిడ ప్రమేయం లేకుండా మారిపోయింది. కొసమెరుపు లాంటి తాజాకలం ఏమిటంటే రైతులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తారట. ఈ మంగళవారం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ సాహితీవేత్తగా, శాంతినికేతన్ నిర్మాతగా, రవీంద్ర సంగీతం రూపకర్తగా మనకు తెలుసు. అయితే రవీంద్రనాథుని సాహిత్య వర్ణ పటంలో శాస్త్ర విజ్ఞానం కూడా ఒక ప్రధాన అంశమని; సాహిత్యాన్ని, సైన్స్‌ను, తత్వశాస్త్రాన్నీ మేళవించి చక్కని గీతాలు, పద్యా లు రాశారని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయాలు తెలుగునాట అంతగా ప్రాచుర్యంలో లేవు. కనుక వాటిని ఒకసారి పరిశీలించడం ఎంతో స్ఫూర్తిదాయకం. అప్పటికి బెంగాల్‌లో ఆచార్య రామేందర్ సుందర్ త్రివేది, అక్షయ్ కుమర్‌దత్తా, ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్, జగదానందరాయ్, ఆచార్య జగదీశ్‌చంద్రబోస్ వంటి వారు పాపులర్ సైన్స్‌ను బెంగాల్‌లో రాస్తున్నారు. కానీ వీరికంటే సుబోధకంగా, జటిలమైన శాస్త్ర అంశాలను జనరంజకంగా రాసి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు గడించడం విశేషం. ఠాగూర్ సైన్స్ ఆసక్తి ఆయన స్వగృహం (జోరాశంకో)లోనే మొదలైం ది. ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్‌ఠాగూర్ ప్రోత్సాహంతో సీతానాథ్‌ఘోష్ ఎన్నో పాపులర్ సైన్స్ వ్యాసాలు రాశాడు. ఈ సీతానాథ్‌ఘోష్‌నే ఠాగూర్ తన స్వీయచరిత్రలు 'జీవన స్మృతి', 'బాల్యం'లలో ఎంతగానో ప్రస్తుతి స్తూ, తనకు స్ఫూర్తి అని పేర్కొంటారు. తన సైన్స్ టీచర్ సీతానాథ్‌ఘోష్ రచనల కారణంగానే విదేశాలలో సాంకేతిక విజ్ఞానంతో ముడిపడిన వ్యవసాయాన్ని అధ్యయనం చేశాడు. శాంతినికేతన్‌లో పట్టుపురుగుల పెంప కం, సిల్కుదారం తయారీ సంబంధించి కృషిచేసి ప్రారంభించాడు ఠాగూర్! ఆరువేల అడుగుల రాగితీగ, బ్యాటరీ సాయంతో సీతానాథ్‌ఘోష్ అప్పట్లో 'మేగ్నటిక్ హీలర్' రూపొందించి కలకత్తాలో సంచలనం కలిగించిన వ్యక్తి. దీని సాయంతో కీళ్లనొప్పులు తొలగించిన ఆయన దగ్గరనే ఠాగూర్ తొలిసైన్స్ పాఠాలు నేర్చుకున్నారు. వడికే యంత్రం, గోధుమల ను దంచే యంత్రం, మరనాగలి, ఇంకు తయారు చేశాడు సీతానాథ్‌ఘోష్. స్వదేశీ పరిజ్ఞానంతో కృషి చేయాలనే భావన ఠాగూర్ మనసులో చిన్ననాటనే పడింది. అందుకే పి.సి.రే 'బెంగాల్ కెమికల్స్'తో ముందుకు వస్తే ఠాగూర్ ఎంతగానో ఆనందపడి అభినందించాడు. అంతేకాదు, గ్రామీణ మహిళలకు కుటీర పరిశ్రమలలో నైపుణ్యం పెంచడానికి శిక్షణాశాలను శాంతినికేతన్‌లో ఏర్పరచాడు ఠాగూర్. ఫ్రెంచి శాస్త్రవేత్త, తత్వవేత్త హెన్రీ బెర్గ్‌సన్-సృష్టి ఎలా ఏర్పడిందనే సిద్ధాంతం తెలుసుకున్నాక ఆస క్తి కలిగి చార్లెస్ డార్విన్, లామార్క్ సిద్ధాంత కృషిని అధ్యయనం చేశా డు ఠాగూర్. మానవ జననం తొలు త ఆఫ్రికాలో మొదలైందని తెలుసుకున్న ఠాగూర్ 'ఆఫ్రికా' అనే పద్యం రాశాడు. అబిసీనియా (ఇథియోపియా) మీద ఇటలీ దాడి చేసినప్పుడు ఈ పద్యం రాశాడు. విశ్వాన్ని పరిచయం చేస్తూ 'విశ్వ పరిచయ' అనే గ్రంథంలో ఠాగూర్ ఖగోళశాస్త్రం, భౌతిక శాస్త్ర అంశాలు రాశారు. ఈ గ్రంథాన్ని మహా శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌బోస్‌కు అంకితమివ్వడం విశేషం. ఈ పుస్తకంలో సూత్రాలు, సమీకరణలు కాకుండా సరళంగా రచన సాగింది. విజ్ఞాన సమాచారం చాలా ఉన్న ఆసక్తి కొరవడదు. ఈ రచనకు మూలకారణం తండ్రితో పాటు బాల్యంలో సాగిన ఆకాశదర్శనమే (స్కైవాచ్) అని ఠాగూ ర్ పేర్కొంటాడు. సౌరకాంతిలోని ఏడు రంగులను నృత్యమాడే నెమలి ఫించంలోని ఏడు రంగులతో పోలుస్తాడు ఠాగూర్. రేడియోథార్మిక గామా, బీటా కిరణాలను ఠాగూర్ 'ఆకాశవాణి' అని పునర్ నామకరణం చేశాడు. తర్వాత ఇదే పేరును రేడియోకు ఆయనే వాడాడు. శరీరం లోప లి ఎముకలను గమనించగల ఎక్స్ కిరణాల శక్తిని గమనించి, వాటి ఆవిష్కర్త రాంట్‌జన్‌ను ఎంతగానో ప్రస్తుతిస్తాడు. పరమాణువు అతి చిన్నదని ఠాగూర్ వివరిస్తాడు. ఠాగూర్ రచనలలో హాస్యం కూడా తొణికిసలాడుతుంది. ఎలక్ట్రాన్‌లలోని రుణాత్మకతను స్త్రీత్వంతో, ప్రోటాన్‌లోని ధనాత్మకతను పురషత్వంతో పోల్చాడు ఠాగూర్. రేడియో ధార్మికత గురించి చర్చించినప్పుడు అటువంటి దానితో (భవిష్యత్తులో) శక్తి తయారవుతుందని వివరిస్తాడు. సర్ జేమ్స్‌జీన్స్ సంక్లిష్ట ఆలోచనలను చాలా సరళంగా వివరిస్తాడు ఠాగూర్. సౌరకుటుంబంలో భూభ్రమణం గురించి విశదపరచడానికి బంగాళాదుంపతో వివరిస్తాడు. జగదీశ్‌చంద్రబోస్, ఠాగూర్ మంచి మిత్రులు. బోస్ కోసం ఠాగూర్ 'కర్ణ' అనే పద్యం రాశాడు. జగదీశ్‌చంద్రబోస్ పరిశోధనలంటే ఠాగూర్‌కు చాలా గురి. ఆయన స్ఫూర్తితో శాంతినికేతన్‌లో ఠాగూర్ చెట్లను పెంచే కార్యక్రమం, విత్తనాలు చల్లే కార్యక్రమా లు ప్రారంభించాడు. విశ్వభారతిలో సైన్స్ ఉపాధ్యాయుడు జగదానంద రే ను జనరంజక విజ్ఞాన వ్యాసాలు రాసేలా ప్రోత్సహించాడు ఠాగూర్. సివి రామన్ పరిశోధన చేసిన 'ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్' సంస్థను స్థాపించింది మహేంద్రలాల్ సర్కార్. సర్కార్‌కు మంచి మిత్రుడు ఠాగూర్. సర్కార్ మహాశయుడు హోమియో ప్రాక్టీసును ప్రారంభించడంలో ఠాగూర్ ప్రోత్సాహం ఉందంటారు. సరోజినీనాయు డు కూతురు పద్మజానాయుడు, శాస్త్రవేత్త మహల్నాజాన్ భార్య జబ్బు పడినప్పుడు ఠాగూర్ హోమియో విధానంలో చికిత్స చేశాడని అశోక్‌బాగ్చీ తన పుస్తకంలో వివరిస్తాడు. ఈ సమాచారం పరిశీలిస్తే రవీంద్రుడికి బాల్యం నుంచి సైన్స్ పట్ల, సైన్స్ ప్రయోజనం పట్ల, సైన్స్ సాహిత్యం పట్ల ఆసక్తి, దృక్పథం మెండు గా ఉన్నాయని గమనించవచ్చు. సైన్స్‌ను, ఫిలాసఫిని, సాహిత్యాన్ని రంగరించి సాగడం; సైన్స్ అనువర్తనాలను తన దగ్గరి నుంచే ప్రారంభించడం చాలా ఆసక్తిని కలిగిస్తాయి. నిజానికి ఈ మేళవింపు కారణంగా సాహిత్యానికి ఔచిత్యాన్ని, సైన్స్‌కు లాలిత్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవ న పంథా రూపొందుతుంది. విశ్వకవి విజ్ఞాన విశ్వవీక్షణం విస్తృతి మనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది.- నాగసూరి వేణుగోపాల్
భావాల సంఘర్షణతోనే ప్రగతి Andhra jyothy daily 24 th Sep 2010
Posted by Nagasuri on Saturday, September 25, 2010సైన్స్‌కు, సంఘర్షణకు మధ్య విడదీయరాని బంధం ఉందా? ప్రాకృతి క విషయాలను తరచి చూడకుండా, అంగీకరించి ఉంటే ఇంత స్థాయిలో సైన్స్ ప్రగతి ఉండేదా అనే ప్రశ్న చాలా సబబు. భూమి బల్ల పరుపుగా ఉంది, సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడని పూర్తిగా స్వీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండి ఉండేది. శోధనతో అన్వేషించిన మానవ మస్తిష్కం తెలుసుకున్న వాస్తవం వేరుగా ఉంది. భూమి గుండ్రంగా ఉందనీ; సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఉండదని కేవలం భూగ్రహం తన చుట్టు తాను పరిభ్రమిస్తోందని తర్వాత ఆవిష్కరించబడింది.
ఈ విషయాలు ధ్రవపడటానికి పట్టిన సమయం కన్నా, సమాజం అంగీకరించడానికి ఎక్కువ కాలం పట్టింది. తొలుత, ప్రకృతితో సంఘర్షించి సైన్స్ వాస్తవం వెలికివస్తే తర్వాత దశలో దాన్ని అంగీకరించడానికి సమా జం సంఘర్షించింది. ఎందుకంటే విశ్వాసాలతో ముడిపడిన కథలు, గాథ లు, పాటలు జన జీవితంతో విడదీయలేనివిగా ఉంటాయి.
టాలెమి, కోపర్నికస్, గెలీలియో వంటి గొప్పవారు వాస్తవాన్ని వెల్లడించి తమ జీవితాల ను పణంగా పెట్టారు. కొన్ని శతాబ్దాల తర్వాత మనకు ఈ విషయాలు చాలా సాధరణంగా అనిపించవచ్చు. కానీ వారి జీవితాలు ఎంత సంక్షుభితంగా సాగాయో తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
సైద్ధాంతిక స్థాయిలో సైన్స్ అభివృద్ధి చెందినప్పుడు ఈ రకమైన సంఘర్షన ఎదురుకాగా; సైన్స్ తర్వాతి దశలో ప్రాయోగికంగా అంటే టెక్నాలజీ గా రూపు ధరించిన తర్వాత మరోరకమైన సంఘర్షణను ఎదుర్కొంది. సైన్స్ సూత్రాలతో పనిచేసే టెక్నాలజీ మానవ శ్రమను తగ్గిస్తోంది. మాన వ నైపుణ్యాన్ని పెంచుతోంది అని వివిధ వర్గాలు అర్థం చేసుకున్న పిమ్మట మరోరకమైన పెనుగులాట మొదలైంది. ఏ వర్గాలకైతే అవకాశం ఉందో ఆ వర్గాలు తమకు తగిన బాణిలో ప్రయత్నాలు ప్రారంభించాయి.
విధ్వంసకర ఆయుధాలు అనే టెక్నాలజీ తయారైన నేపథ్యం ఏమిటో ఒక్కసారి పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం మధ్య కాలంలో శాస్త్రవేత్తలను బంధించి మారణాయుధాలు రూపొందించమని కట్టడి చేశారు. రాజ్యాధికారాన్ని దీనికోసం వినియోగించి ఒత్తిడి చేశారు.
ఆటంబాంబు అనే సమర ఆయుధం పురిటిగడ్డ సంక్షుభిత రాజకీయమే! అలా తయారైన మారణాయుధం ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించగలదో రెండవ ప్రపంచ యుద్ధం సాక్ష్యాధారాలతో రుజువు చేసింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ నూతన మారణాయుధాల ప్రయోగంతోనే రెండవ ప్రపంచయుద్ధం శ్రీకారం చుట్టుకుంది.
రెండు ప్రపంచయుద్ధాల తర్వాత ఏర్పడిన ద్విముఖ ప్రపంచంలో కూడా రాజకీయా లు టెక్నాలజీ ప్రగతిని ప్రభావి తం చేశాయి. సోవియట్ రష్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు పోటాపోటీగా చంద్రునిపై శోధనలు, విశ్వంతరాళ పరిశోధనలు ప్రారంభించాయి. దాదాపు మూడు దశబ్దాలకు పైగా ఈపోటీ నడిచింది. సరిగ్గా ఈ దశలోనే టెక్నాలజీ అనేది భయపెట్టడానికీ రక్షణ పొందడానికి ఆధారమైంది. శత్రుదేశం ఇంత స్థాయిలో టెక్నాలజీ సాధించింది అనేది భయహేతువు కాగా; శత్రు దేశానికి సమఉజ్జిగా టెక్నాలజీని పొందామనే భద్రతా భావం కూడా మరోవైపు ఏర్పడింది.
ప్రపంచశాంతి కోసం సాంకేతిక విజ్ఞానం అనే భావన ఈ నేపథ్యంలో ఏర్పడింది. జపాన్‌పై అమెరికా బాంబులు ప్రయోగించిన రోజు హిరోషి మా డేను ఈ సందర్భానికి వేదికగా చేసుకుని ఆ భావనను ప్రచారం చేశా రు. ఈ దశలో అమోఘంగా కృషి చేసిన మహా శాస్త్రవేత్తలున్నారు. నేటికీ ఈరకమైన చర్చ చాలా అవసరం. ఇది ఇరుగుపొరుగు దేశాల మధ్య ఎంత అవసరమో తన లక్ష్యాన్ని స్థిరపరుచుకునే శాస్త్రవేత్తకు అంతకుమించి అవసరం. ఇక్కడే సైన్స్, టెక్నాలజీ ఎవరి కోసం బోధపడుతుంది.
విశ్వం రెండుగా విడిపోయిన తర్వాత పోటాపోటీగా స్పేస్ టెక్నాలజీ వృద్ధి చెందింది. అదే సమయంలో పరిశోధన భూతలం దాటి విశ్వాంతరాళంలోప్రవేశించడంతో పరిశోధన ఖర్చు విపరీతంగా పెరిగిందని గుర్తించా లి. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తర్వాత అమెరికా వ్యూహం మార్చుకుంది. దాంతో ప్రపంచ దేశాలు సంయుక్తంగా పరిశోధనలకు దోహదపడడం మొదలైంది. ఇటీవల అంటే ఆగస్టు 26న 'నేచర్' పత్రికలో ఒక నివేదిక మరో విషయాన్ని వెల్లడించింది.
సిఈఆర్ఎన్ అన్వేషణకు సంబంధించి రాబోయే ఐదేళ్లలో బడ్జెట్ కోత ఎంతో చర్చించడానికి 20 దేశాలు సమావేశమవుతున్నాయని ఆ సమాచారం. ప్రస్తుతం యూరప్ దేశాలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం ఒక పోకడ. సెర్న్ వంటి దాన్లో యూరప్ దేశాలతో పాటు అమెరికా, ఆసియా దేశాలు కలిసి పనిచేస్తాయి.
శాస్త్ర సాంకేతిక రంగాలలో మెగా రీసెర్చి ప్రాజెక్టులకు ఆర్థికంగా దోహదపడే మూడవ పెద్ద దేశం బ్రిటన్ ఇప్పుడు పొదుపు మంత్రం పఠిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు వ్యయం చేయడంలో తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఈ రెండు ఆర్థికంగా బ్రిటన్ కన్నా మెరుగ్గా ఉండవచ్చునేమో! నేడు కొన్ని మెగా రీసెర్చి ప్రాజెక్టులు ఆర్థికపరమైన సంఘర్షణను ఎదుర్కొంటున్నాయి. ఇలా సైన్స్, టెక్నాలజీ తొలినుంచి ఏదో ఒక రకమైన సంఘర్షణను ఎదుర్కొంటున్నాయి. అయితే నేడు పలు దేశాలు కలిసి ఈ సంఘర్షణలో పాలుపంచుకోవడం మబ్బు తునకకు వెలుగు చారిక!
-నాగసూరి వేణుగోపాల్
నిజానికి ఒక విషయం గురించి తెలుగునాట చర్చ అంతగా జరగలేదు. అస్ట్రేలియా లో ఫలానా వ్యక్తి దేశాధినేత అవుతాడని ఆక్టోపస్ పేర్కొంది. దానికి తార్కాణం ఏమిటంటే ఆ ఫలానా వ్యక్తి ఫోటోను గట్టిగా కావలించుకుంది ఆక్టోపస్. ఆయన ప్రత్యర్థి పట్ల కనీసం చూడనైనా చూడలేదు.
ఇలాంటి వార్తలు జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా పత్రికల్లో, టీవీల్లో గిరికీలు కొట్టాయి. కానీ ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో తేలింది ఏమిటి? ఏ పార్టీకి ఆధిక్యత రాకుండా ఆయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆ గందరగోళం ఇంకా తేట పడలేదు. ఎవరు అధ్యక్షులో తేలలేదు. సరే ఇది రాజకీయ పరిస్థితి. ఆయారాం, గయారాంల ఆట ఇంకా కుదుట పడలేని దేశమది. మరి ఆక్టోపస్ జ్యోతిష్యం ఏమిటి? ఎందుకు చెట్టెక్కింది?
వార్తల వెల్లువలో, వ్యాఖ్యానాల సముద్రంలో మునిగిపోకుండా ఒక్క క్షణం ఆలోచిం చి చూస్తే ఈ ఆక్టోపస్ వ్యవహారం ఏమి చెబుతుంది? ఎనిమిది కాళ్ళ జీవి చెప్పడం ఏమి టి? దాన్ని మనం నమ్మడం ఏమిటి? నెదర్లాండ్స్‌పై స్పెయిన్ గెలవడం, జర్మనీ క్రీడా విజయాలు -జూలైలో ప్రపంచ వార్తల్లో పెద్ద విశేషం.
వీటిని పాల్ అనే ఆక్టోపస్ ముందుగా చెప్పిందని ఒకటే హోరు! ఆ సమయంలోనే తెలుగునాట ఛానళ్లలో చిలుక జ్యోస్యాలు కూడా వచ్చి పడ్డాయి. అయితే నేడు ఆక్టోపస్ ఎలా హడావుడిగా సంచలనం సృష్టించిం దో, అంతకు మించిన వేగంతో అదృశ్యమైంది.
ఈ పరిస్థితి చూస్తే ఛార్లెస్ డికెన్స్ నవల 'టేల్ ఆఫ్ టూ సిటీస్' ప్రారంభ వ్యాక్యాలు తప్పక గుర్తుకు వస్తాయి. తెన్నేటి సూరి చేసిన అనువాదం నవల కన్నా మనకే మెరుగ్గా అతికినట్టు అనిపిస్తుంది.
'అది వైభవోజ్వల మహాయుగం-వల్లకాటి అధ్వాన్నశకం; వెల్లి విరిసిన విజ్ఞానం-బ్రహ్మజెముడులా అజ్ఞానం; ఆశాకుసుమాలు కుసుమించే మధుర వసంతం నైరాశ్యపు చలిగుబుళ్లు, ...స్వర్గానికి రాచబాట చేసుకున్నామనుకున్న- మనుష్యులు నడుస్తున్నారు నరకానికి సూటిగా...' సరిగ్గా ఇలాంటి పరిస్థితే ప్రపంచవ్యాప్తంగా తాండవిస్తోందా?
అమేయమైన తెలివిగల ఆధునిక మనిషీ, అటు అణు గర్భాన్ని, జన్యు అంతఃకుహారాన్ని జయించాడని భావించే మనిషీ; మరోవైపు విశ్వాంతరాళాన్ని, అన్య గ్రహాలను శోధించే మనిషీ-కనీస ఇంగితాన్ని సైతం ఆధునికత అనే లాకర్లో పెట్టి ఆక్టోపస్ చెప్పిందని పడుగులిడటం, ప్రపంచవ్యాప్తంగా చర్చించడం ఏమిటి?
ఆక్టోపస్ వ్యవహారం అనేది కేవ లం ఒక మచ్చుతునక మాత్రమే! మన బుద్ధి నైశిత్యాన్ని చూసి ఆక్టోపస్ పగలబడి నవ్వుతోందా అనిపిస్తోం ది. మన సామాజిక శాస్త్రాలు, నైపుణ్యాలు, ఉదారవాదాలు, శాస్త్రీయ దృక్పథాలు లుప్తమై జ్యోతిష్యం అంటూ ఎనిమిదికాళ్ల జీవి వెంట పడటం తమాషా గదూ!
అస్తికత్వం, నాస్తికత్వం-అనే ఆలోచనలతో పోలి స్తే ఆక్టోపస్ వ్యవహారం చాలా దిగువన ఉండిపోతుంది. దేవుడు ఉన్నా డు, లేడు-అని వివాదం చేసే వారిలో కనీసం స్పష్టత ఉంటుంది. కానీ అసలు స్పష్టత లేని గాలి వాటు వ్యవహారాలు ఆక్టోపస్ వంటి అంశాలు!
ఎద్దు ఈనింది అంటే కొట్టంలో కట్టెయ్ అనే మాటలో ఔచిత్యరాహిత్యం పుష్కలంగా ఉందని మనం భావిస్తాం. కానీ ఆక్టోపస్ వ్యవహారాన్ని ఖండించాలని మనం పరిగణిం చం. దీనికి ఖండన కూడా అక్కరలేదని అంటాం కూడా! ఇది పైపెచ్చు వినోదం కలిగించే విషయం కదా అని కూడా చమత్కరిస్తాం.
ఈ తతంగంలో కామన్‌సెన్స్ కొంత ఉన్నది కూడా కొండెక్కుతుందనే భావన మనకు రాదు. ఇందులో మనం వినోదం పెంచుకునే రీతిలో ఉంటే వాదనలో, వ్యాఖ్యలో తేడా ఉంటుంది. చివరకు ఆక్టోపస్‌ను ఆక్టోపస్ మాత్రమే చంపుకుంది. ఆస్ట్రేలియాలోని అనిశ్చిత పరిస్థితి. మనకు జ్ఞాన భిక్ష పెట్టింది. కానీ మన మధ్య ఆక్టోపస్ తతంగాలు చాలా ఉన్నాయి.
ఐటి చదువు చదివి, మంచి ఉద్యోగం చేస్తూ కంప్యూటర్‌తో చేతికి రంగురంగుల దారా లు ధరించే యువకుల ఆలోచన ఏమిటి? మంచి భర్త కావాలని పూజలు చేసే ఆధునిక యువతి-ఒకవైపు చదువు, మరోవైపు ఉద్యోగం గల ఈ యువతి-నిత్యం పూజలు చేయడంలోని ఆంతర్యం ఏమిటి?
గ్రహబలం, రాశిఫలం, జ్యోతిష్యం అంటూ ప్రతి ఉదయం తమ సమయంతో పాటు ఎంతో మందికి కాలహరణం చేసే మీడియా వ్యక్తుల దృక్పథం ఏమిటి? రంగురాళ్లను ధరిస్తే లేదా మరో కవచం ధరిస్తే కష్టాలుపోతాయి, సుఖాలు పరిగెత్తుకువస్తాయని తారలు చెబితే నమ్మే జనం ఇంగితం ఏమిటి?
ఇలాంటి 'ఆక్టోపస్ తంతులు' ఇంకా మనకు చాలానే ఉండవచ్చు. ఇవి ఎనిమిది కాళ్లతో ఏకకాలంలో ఎనిమిది దిక్కుల్లో సాగవచ్చు. ఫలితంగా మనం పైకి కాకుండా ఎంతో కిందకు వెడుతూ వెళ్లవచ్చు. అందుకే నేడు మనకు ఇంటర్‌నెట్, వీకీపీడియా, విజ్ఞాన సర్వస్వాలు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది పెద్దబాలశిక్ష స్థాయి ఇంగితం మాత్రమేనా?
-నాగసూరి వేణుగోపాల్
'నెమలికి పించం ఎలాగో/నాగుబాముకు మణి ఎలాగో'- విజ్ఞాన శాస్త్రానికి గణి తం అలా భాసిస్తుంది. ఈ అర్థం వచ్చే శ్లోకాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ నెల 19న అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సమ్మేళనంలో పేర్కొన్నారు. మన దేశంలో ఇటువంటి సదస్సు జరగడం ఇదే ప్రథమం. అది కూడా హైదరాబాదులో జరగడం మనకు ఆనందదాయకం.
గణితాన్ని 'క్వీన్ ఆఫ్ సైన్సెస్'గా పిలువడం కద్దు. వాస్తవానికి విజ్ఞాన శాస్త్రం అనేది గణితం ద్వారా పలుకుతుంది. భౌతిక శాస్త్రానికి గణితాత్మక రుజువులు ప్రవేశపెట్టింది గెలీలియో! శ్రీశ్రీకీ, గురజాడకు ఎంత సాహిత్య సంబంధం ఉందో న్యూటన్‌కూ గెలీలియోకు అంతే విజ్ఞాన శాస్త్ర సంబంధం ఉంది.
తర్కం బదులు, గణితం రాక తో విజ్ఞాన శాస్త్రం వ్యక్తీకరణ పెరిగింది. నేడు ఆర్థిక శాస్త్రం, జీవ శాస్త్రం వంటి చాలా రంగాలలో గణితం కీలకమైంది. డిఎన్ఏ, జీనోమ్ వంటి రంగాలలో గణితం సాయపడ కపోతే అడుగు ముందుకు కదలదు.
గణితశాస్త్రం మీదున్న అపోహలు కూడా చాలా ఎక్కువ! లెక్కలు అర్థం కావని చెప్పడం ఒక ఫ్యాషన్. దీనికి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇతోధికంగా దోహ ద పడుతున్నారు. మూడు దశాబ్దాల క్రిందటి మాట మీతో పంచుకుంటాను. తొమ్మిదో తరగతిలో ఆల్జిబ్రా క్లాసులో చాలా ఒక లెక్కను స్టెప్స్‌ద్వారా సాధించి, ముగించాం. మాస్టారు చెప్పేటప్పుడు ఎటువంటి నోట్స్ లేకుండా బోర్డు మీద రాస్తూ పోతే మేం అందివ్వడం పద్ధతి.
అలా అందించడంలో మా మధ్య పోటీ ఉండేది. ఓసారి అలా సాధించిన తర్వాత నేను టీచరును అడిగాను-ఎందుకింత కష్టపడి దీన్ని పూర్తిచేయడం? దీనివల్ల ఉపయోగం ఏమిటి? అని. ఆయన నా మీద ఇష్టంతో వివరించారు.
కానీ నాకు ఏ మాత్రం సంతృప్తి కల్గించలేదు. ఆయనకు ఆ స్థాయిలో బోధన జరిగి ఉంటే నాకు సం తృప్తికరమైన సమాధానం లభించి వుండేది. అగ్రశ్రేణి ఉపాధ్యాయుల పరిస్థితి మూడు దశాబ్దాల క్రితం ఇలాఉంటే నేడు ఎలా మారి ఉంటుంది?
దీనికి సమాధానం ఏడోతరగతి పాఠ్య పుస్తకం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది)లో తర్వాత కొంత కాలానికి చూశాను. ఆ పుస్తకం మున్నుడిలో విశ్వంలో, విశ్వాంతరాళంలో వస్తువులు, ఖగోళ వస్తువుల మధ్య దూరం కనుక్కోవటానికి గణితం తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీని కంటే మెరుగైన నిర్వచనం మరోటి ఉండవచ్చు.
కానీ దానిని వివరించేస్థాయిలో ఉపాధ్యాయుడు ఉంటే గణితానికి ఆకర్షణ ఉంటుంది, సౌందర్యం ఉంటుం ది అందుకే డాన్ స్పైల్‌మన్ అనే గణిత శాస్త్రవేత్త తనకు ప్రదానం చేసిన ఒక పురస్కారానికి ధన్యవాదాలు చెబుతూ నాలుగో గ్రేడులో తనకు గణితంలో ఆసక్తి కల్గించిన మాస్టారుకు కృతజ్ఞతలు తెలియచేస్తారు.
తృతీయ ప్రపంచదేశాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గణితశాస్త్రం మీద ఆసక్తి తగ్గుతుందనే ఆందోళన ఉంది. పరిశోధనలో ప్రవేశించేవారి సంఖ్య బాగా తగ్గుతుంది. ఒక్క ఖరగ్‌పూర్ ఐఐటిలో థియరిటికల్ మేథమెటిక్స్ వైపు పరిశోధనకు వచ్చే వారు కేవలం ఒక శాతమేనట. మిగతా 99శాతం మంది అప్లయిడ్ మ్యాథ్స్‌వైపు వెడుతున్నారు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా గణితం సంక్షోభంలో ఉందని భావిస్తున్నారు. హైదరాబాదు లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమెటీషియన్స్'లో పాల్గొన్న మూడు వేల మంది గణితశాస్త్రవేత్తలు ఇదే విషయమై ఆందోళన చెంది, గణిత శాస్త్ర బోధనను ఎలా ఆసక్తికరంగా మలచాలని లోతుగా చర్చించారు. భావిపరిశోధకులుగా మలచాలని దేశవ్యాప్తంగా 400 మంది పరిశోధక విద్యార్థులను ఆహ్వానించడం విశేషం!
గణితశాస్రం-విజ్ఞాన శాస్త్రాలకు రాణిగా పరిగణించబడినా ఆ శాస్త్రంలో నోబెల్ బహుమతి లేదు. కేవలం రసాయన, భౌతిక, జీవ (వైద్య) శాస్త్రాలు, సాహిత్యంలో మాత్రమే ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ప్రారంభించాడు. ఆర్థిక శాస్త్రాన్ని ఆ తర్వాత కలిపారు. ప్యూర్ మేథమెటిక్స్‌లో సౌందర్యం ఉంటుంది. ఆసక్తి ఉంటుంది.
అయితే తక్షణ ప్రయోజనం పరిశోధకుడికి ఉండకపోవచ్చు! కానీ అప్లయిడ్ మేథమెటిక్స్ వల్ల లాభం ఉంటుంది, కానీ బోరుగా ఉంటుంది. ఇదీ గణిత శాస్త్రం పరిస్థితి. పాఠశాల స్థాయిలో స్పష్టంగా ఉండే గణితంపై స్థాయికి వెళ్ళే కొద్ది క్రమంగా అరూపంగా మారుతుంది.
అందువల్ల పై స్థాయికి వెళ్ళే కొద్దీ బోధన దెబ్బ తింటుంది. అలాగే స్త్రీలు గణితానికి దూరం అనే అభిప్రాయముంది. అదేదో పురుషుల సొత్తు మాత్రమే అయినట్టు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ భావనకు సహేతుకమైన ఆధారం ఏదీ లేదు. కానీ ఏదో సాంస్కృతిక పరమైన ఆలోచన కారణంగా ఇటువంటి భావం స్థిరపడింది.
అయితే ఇటీవల కాలంలో స్త్రీలు బాగా రాణిస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో బాలికలు ఎమ్సెట్‌లో రాణించినంతగా, ఐఐటి ప్రవేశపరీక్షలో నెగ్గుకు రాలేక పోతున్నారు. దీనికి సంబంధించి వినబడే వివరణ ఏమంటే ఐఐటి పరీక్షలో విశ్లేషణా సామర్థ్యం అధికంగా ఉండాలని.
గణితంలో పరిశోధన చాలా చౌక. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలో లాగా పెద్ద పెద్ద ఖరీదైన ప్రయోగశాలలు ఇక్కడ అవసరం లేదు. చిన్న కలం, కాగితాలు ఉంటే చాలు. శ్రీనివాస రామానుజం నోటు పుస్తకాలలో నేటికీ బోధ పడని గణిత శాస్త్ర అంశాలు ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్ కు ఫిజిక్స్; ఫిజిక్స్‌కు మ్యాథ్స్‌కు పునాది అని మనకు తెలుసు.
ఎమ్ఎస్‌సి రసాయన శాస్త్రం చదవాలంటే బిఎస్‌సిలో భౌతిక శాస్త్రం చదవాలి. ఎమ్ఎస్‌సి భౌతిక శాస్త్రం చదవాలంటే బి ఎస్ సిలో గణిత శాస్త్రం తప్పనిసరి గా చదవాలి. ఇదీ వరుస. కానీ నేడు కంప్యూటర్, ఐటి హడావుడి అధికమై అమ్మలాంటి గణిత శాస్త్రం నిరాదరణకు గురవుతోంది!