TRP trap

on Wednesday, September 14, 2011

on Wednesday, July 27, 2011

on Wednesday, April 13, 2011

Ombudsman at HMTV- A respectable initiative : Eevaram- 23rd Jan 2011

on Saturday, January 29, 2011

on Wednesday, January 19, 2011

Medianaadi

Niira Radia tapes-role of media

on Sunday, December 19, 2010

Usage of Telugu

on Sunday, October 31, 2010


టెక్నాలజీకి జై

on Wednesday, October 27, 2010

దాదాపు లక్షన్నరమంది 'తారలు' గ్రూప్-4 పరీక్షలకు అభ్యర్థులుగా ఉండడం అసలు వార్త. సుమారు పన్నెండు లక్షలమంది అభ్యర్థుల లో కొందరు అంటే ఐశ్వర్యరాయ్, నయనతార, శ్రీదేవి, మాధురిదీక్షిత్, సానియామీర్జా, సోనియాగాంధీ, రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, చిరంజీవి వంటి వారి ఫోటోలు కనిపించాయట! తమాషాగా అప్లయి చేసి-పేర్లు, ఫోటోలు ఇలాంటి ప్రముఖులవి తగిలించారట. ఇలా ఎనిమిదోవంతు దాకా వ్యాపించి ఉన్న దరఖాస్తులను వేరు చేయడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి గగనమైందట. ఆటపట్టించడానికి అప్లయ్ చేసిన వారెవరూ పరీక్ష రుసుము పంపలేదట. కంప్యూటర్ ప్రోగ్రాంలో సమస్య ఉండి,పరీక్ష రుసుం లేకనే అప్లికేషన్ ఆమోదింపబడిందట. మరికొందరు ప్రబుద్ధులు మొక్క లు, చెట్లు, జంతువుల ఫోటోలతో నింపారట. ఈ వ్యవహారం చూస్తే 'పిల్లి కి చెలగాటం' అనే సామెత గుర్తుకురావచ్చు.అలాగే 108 నెంబర్‌కు ఫోన్ చేసే ఆకతాయి కాలర్స్ ఎక్కువైపోయారని సమాచారం. నిజంగా సమస్య లేకపోయినా, ఫోన్ చేసి ఆటపట్టించడం పెరిగిందని తెలుస్తోంది. ఇక్కడ తొలిరకం ఆకతాయిలకూ, రెండవ రకం ఆకతాయిలకు తేడా ఏమీ లేదు. ఆన్‌లైన్‌లో అల్లరి చేసే వారికి కాస్తా సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. అంతే!ఇది ఒక పార్శ్వం కాగా, దీనికి పూర్తిగా భిన్నమైన దృశ్యం ఇంకోటి ఉంది. నెంబర్ 782474317884 ప్రాధాన్యం ఏమిటి? ఇది మన దేశంలో తొలి ఆధార్ గుర్తింపు సంఖ్య. మహారాష్ట్రకు చెందిన గిరిజన మహిళ రంజ న సోనా వాణెకు చెందిన గుర్తింపు సంఖ్య అది. ఆవిడ వేలుముద్రలు, కనుపాప ముద్రలతో సహా నిక్షిప్తమైన బయోమెట్రిక్ ఐడెంటిటి నెంబర్ అది. దీనినే సులువుగా అర్థం కావడానికి 'ఆధార్' అని వ్యవహరిస్తున్నారు. ఇందులో పన్నెండు అంకెలుంటాయి.వీటితో పాటు బహిర్గతం కానీ మరో నాలుగు అంకెలు కూడా ఉంటాయి. ఇది అధికారిక అవసరాల కోసం రహస్యంగా ఉంచబడతాయి. ఈ గుర్తింపు సంఖ్య ప్రాధాన్యం ఏమిటంటే భారతదేశంలో మరే వ్యక్తికీ ఈ సంఖ్య ఉండదు. ఈ సంఖ్య అంటే ఆ ఫలానా వ్యక్తి అని అర్థం. దీనిద్వారా బ్యాంకు అకౌంట్ తెరవడం, గ్యాస్ కనెక్షన్ సాధించడం, రేషన్‌కార్డు పొందడం, ఇంకా పాన్‌కార్డు, ఫోన్ కనెక్షన్, పాస్‌పోర్టు వంటివి కూడా పొందడానికి వీలవుతుంది. ఈ జాబితాలో మరికొన్ని వచ్చి చేరే అవకాశం ఉంది.అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధా ని మన్మోహన్ 'ప్రపంచంలో మరెక్కడా ఇంత భారీ స్థాయిలో సాంకెతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం లేదని' పేర్కొంటూ త్వరలో ప్రతి భారతీయుడు 'ఆధార్' సంఖ్య పొందే వీలుందని విశదం చేశారు. ఇది తక్కువ ఖర్చుతో, జాతీయస్థాయిలో ఉపయోగపడే, తర్వగా పరీక్షించే వీలున్న గుర్తింపు సంఖ్య ఆధార్.ఆధార్ గుర్తింపు సంఖ్య సెప్టెంబర్ 30న శ్రీకారం చుట్టుకుంది. దీనికి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు అవుతోందని ఒక అంచనా. సుమారు ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రజలంద రూ ఈ గుర్తింపు సంఖ్యను పొందగలరని మరో గణింపు. దీని ద్వారా ప్రభు త్వ పథకాల సద్వినియోగం కాగలవని ఆశ. ఎన్నికల మోసాలు అరికట్టటడంతోపాటు ఉగ్రవాదం వంటి సమస్యను అంతమొందించడానికి ఈ 'ఆధార్' వ్యవస్థ దోహదపడుతోందని భావిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలిస్తే ఇదంతా సాధ్యమా? అని కూడా అనిపించవచ్చు.సెప్టెంబర్ 30 దరిదాపుల్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఈ 12 అంకెల సంఖ్యను మరింత వినియోగించుకోవచ్చునని తెలుపుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన అయోధ్యకు సంబంధించి తీర్పు వెలువడింది. ఆ సందర్భంగా మొబైల్ ఫోన్లలో బల్క్ మెసేజ్‌లను నిషేధించారు. చాలా మంది మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఆధార పత్రాలు పంపమనే ప్రక్రియ మొదలైంది. రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ఉంటే సరిదిద్దుతారు. అంతేకాదు త్వరలో ఫోన్‌నెంబర్లు ఇక నుంచి 12 అంకెలు కలిగి ఉంటాయి. జనాభా వందకోట్లు దాటిపోయినప్పడు పది అంకెల మొబైల్‌నెంబర్ సరిపోదు. ఇంకా వివరంగా చెప్పాలంటే 117 కోట్ల జనాభా ఉండగా 65.242 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని అంటున్నారు. ఇది గత జూలై మాసపు లెక్కింపు అట. కాకతాళీయంగా సెప్టెంబర్ 28న మరో ప్రకటన వెలువడింది. బ్యాంకు బ్రాంచీలు, ఎటిఎం సేవలు అందని మారుమూల ప్రాంతాలకు సేవలు తప్పక అందాలని రిజర్వ్‌బాంక్ మార్గ నిర్దేశాలను గత మంగళవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా బిజినెస్ కరస్పాండెం ట్లు నియమించబడతారు. డబ్బులు జమ చేయడం, వెనక్కి తీసుకోవడం వంటి పనులను ఈ కరస్పాండెంట్లు చేస్తారు. దీనికి మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం దోహదపడుతుంది.ఒక వారంలో సంబంధించిన మూడు సంఘటనలకు ఈ పన్నెండు అంకెల సంఖ్య మంచి పరిష్కారం కాగలదని 'టెక్నాలజీ విజనరీస్' భావిస్తున్నారు. యూనిక్ ఐడెంటిటి నెంబర్ ఒకవైపు మొబైల్ ఫోన్ నెంబర్‌గా, మరోవైపు మొబైల్ బ్యాంకింగ్ నెంబర్‌గాకూడా ఉపయోగపడుతుందని వీరి ప్రతిపాదన. వివరాలు పరిశీలిస్తే ఇది సాధ్యమా అని ఆశ్చర్యం కలగవచ్చు.అదే సమయంలో గత మూడు దశబ్దాలలో సంభవించిన కంప్యూట ర్ విప్లవాలు పరికిస్తే ఇవన్నీ సాధ్యం కావచ్చు అనే నమ్మకం కూడా కలుగుతుంది. అరకొర పొరపాట్లు, అజాగ్రత్తలు, కొన్ని మోసాలు కూడా ఎదురుకావచ్చు. వాటికి వ్యవస్థలో స్వాభావికంగా ఉండే నిర్లిప్తత ఆజ్యం పోయవచ్చు. అయినా పట్టు సడలవలసిన పని లేదు. అటువంటి దుశ్చర్యలకు కళ్ళెం వేయాల్సిందే!మన సమాజం వైవిధ్యంగా ఉన్నప్పుడు ప్రయత్నా లు, ప్రయోగాలు విభిన్నంగానే ఉంటాయి. అందుకే ఐశ్వర్యరాయ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థిగా ఆవిడ ప్రమేయం లేకుండా మారిపోయింది. కొసమెరుపు లాంటి తాజాకలం ఏమిటంటే రైతులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తారట. ఈ మంగళవారం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

చానళ్ల బుద్ధి కురచ Andhrabhoomi 5-10-10

on Wednesday, October 6, 2010

పెళ్లెప్పుడు బాబూ-అని ప్రశ్నిస్తూ ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వరుణ్‌గాంధీ పెళ్లి కబురు వచ్చేసరికి రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదని మన తెలుగు చానళ్లకు తెలిసివచ్చింది. అంతే సదరు విషయంపై కార్యక్రమం సిద్ధమై, తెలుగునాట వాలిపోయింది.చానళ్లకు జ్ఞాపకశక్తి అతి కురచ అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం!
సరిగా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయి. మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలు తల్లడిల్లిపోయాయి. తెలుగు చానళ్లు ఈ వార్తలతో మహావరదలుగా మారిపోయాయి. టీవీ-9 దీనిమీద ఊరూరా ర్యాలీలుపెట్టి విరాళాలు సేకరించింది కూడా! నిజానికి ఇలా విరాళాలు సేకరించడంపై మరో చానల్ ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించబోయి చివరకు ఆ అంశం తప్ప మిగతా విషయాలతో కార్యక్రమాన్ని నింపింది. సరే! టీవీ-9 ఇంతవరకు అలా సేకరించిన విరాళం ఎలా వ్యయం చేసిందో టీవీ చానళ్లను తక్కువగా వీక్షించే భవదీయ కాలమిస్టుకు ఇంతవరకు కంటకానీ, చెవినగానీ పడలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళం కనుక, వారికి తెలుసుకొనే హక్కు లేదని ఏలే చానళ్ల ‘ఆధునిక నీతి నియమం’ కావచ్చుకాక! కానీ సంవత్సరం తిరగలేదు, ఏ చానల్‌కైనా 2009 అక్టోబర్ వరదలు గుర్తుకు వచ్చాయా? ఏదో పొరపాటున మహాటీవీ వారికి మాత్రం గుర్తు వచ్చినట్టుంది. వారు మాత్రం అరగంట కార్యక్రమం చేసినట్టు మాత్రమే మా కంటబడింది.
* * *
చానళ్లకు పేర్లు మారడం తెలుగులో బాగా పెరిగిందా? తేజ న్యూస్, అల్ఫా తెలుగు, ఆదిత్య, సంస్కృతి, తేజ, నవ్వులు, ఖుషీ వీటిపేర్లు మారిపోయాయి. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి ‘తేజ’ జెమిని మూవీస్‌గా మారింది. అలాగే నవ్వులు, ఖుషీ కూడా అదే త్రోవలో నడిచాయి. అంటే సన్ నెట్‌వర్క్ చానళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఏదోరకంగా జెమినీ అనే అక్షరాలను తప్పక కలిగి ఉంటాయి. అలాగే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో వరసగా ఉదయ, సూర్య, సన్ అనే పేర్లను కచ్చితంగా కలిగి ఉంటాయి. ఇది యాజమాన్యపరంగా అనుకూలించే విషయం. అంతకుమించి జాతీయస్థాయిలో ప్రకటనలు ఆకర్షించడానికి కొంత వెసులుబాటు అదనంగా ఉంటుంది.
* * *
ఈసారి వినాయకచవితి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గడిచిపోయింది. నిమజ్జనంతోపాటు అయోధ్య తీర్పు అనే హడావుడి వార్తలు జనాలను బెదరగొట్టాయి. తర్వాత తీర్పు 28 అనీ ప్రచారం మొదలైంది. చివరికి సెప్టెంబర్ 30గా ఖరారు అయింది. తీర్పు కూడా భయాందోళనలు లేని రీతిలో రావడం దేశం ఊపిరి పీల్చుకుంది.
వినాయక చవితి సమయంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ప్రేలుడు సంభవించింది అని చానళ్లు హంగామా చేశాయి. కానీ చానళ్లు భయపెట్టినంత స్థాయిలో సంఘటన లేదు కానీ ఒకవైపు వినాయకచవితి ఉత్సవాలు, మరోవైపు బాబ్రీ మసీదు తీర్పు అని సంశయ పడుతున్న వేళ ఇటువంటి వార్తలకు అటువంటి స్థాయిలో సంచలనం సృష్టించాలనుకోవడం మన తెలుగు చానళ్ల స్థాయికే చెల్లింది.
టెక్నాలజీ బాగా పెరిగితే, బుర్ర మరీ నేలబారిపోతోందా? నిమజ్జనంరోజున ఒకేసారి పలు దృశ్యాలను చూపాలని నాలుగు కాదు, ఏడెనిమిది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంగా చూపాలని తాపత్రయపడ్డారు. ఈ దృశ్యాలు ఎంత చిన్నగా మారాయంటే ఒక్కోసారి సదరు చానల్ లోగో ఒక దృశ్యాన్ని మింగేసేటంత! అదే సమయంలో లైవ్ అంటూ మాటలు రాని రిపోర్టర్ చేత వ్యాఖ్యానం ఇప్పించాలని ప్రయత్నించడం మరో విషయం. ఈ రిపోర్టర్‌లు అంతా నాయకుల తగవులను బాగా అందివ్వగలరు గానీ ఇటువంటి సంఘటనలను కాదు. టీవీ-9 వ్యాఖ్యాత తొమ్మిది ప్రాధాన్యతను చెబుతూ టీవీ-9ను సంకీర్తన లంకించుకోవడం ఎంతో ఎబ్బెట్టుగా ఉంది. వినాయక చవితి నిమజ్జనం వ్యాఖ్యానం విషయంలో దూరదర్శన్ పైచేయి అని రుజువు చేసుకుంది. మిగతా చానళ్లు ఏమాత్రం శ్రమ, ఖర్చు లేకుండా రేటింగులు రాలాలని ప్రయత్నించాయి. కానీ బాలాపూర్ లడ్డు వేలం వివాద విషయాన్ని ప్రత్యక్ష ప్రసారంగా మలచిన చానళ్లు కూడా రెండు ఉన్నాయి. దానికేశ్రమ అక్కరలేదు. ప్రచారం కావాలనుకున్నవారు, వారే సొంత వాహనం మీద పారితోషికం ఆశించకుండా స్టుడియోలో వాలుతారు. అదీ కిటుకు!
* * *
టీవీ చానళ్లు చూస్తుంటే ఎవరి గోల వారిది అనే సామెత పదే పదే గుర్తుకువస్తుంది. సాక్షి చూస్తే జగనన్న యాత్ర పదేపదే చూపుతారు కదా అని స్టుడియో ఎన్‌వైపు వెళ్లాను. రాత్రి పదిగంటలకు ఒన్‌మినిట్ అని అరగంటలో ముప్పయి వార్తలు ఇచ్చే కార్యక్రమం అది. కానీ ఆ కార్యక్రమం ఎవరికీ చెప్పకుండా రద్దయిపోయింది. అంతేకాదు చంద్రబాబు యాత్రతో చానల్ సాగిపోయింది. అది అరగంటో, గంటో-మనకు తెలియదు. ఎందుకంటే పరీక్షగా చూసే ఓపిక లేదు కనుక. చమక్కు: ఓరు‘ఘల్లు’, విశాఖ తీరాన, కృష్ణాతీరం...ఇవి ఎన్‌టీవీలో ప్రాంతాలవారీ వార్తాకదంబాలకు చేసిన నామకరణాలు. ఇంగ్లీషు శీర్షికల ఎడారిలో తెలుగు ఒయాసిస్సులా ఇవి వినపడుతున్నాయి

పోటీ చానల్‌ను మట్టి కరిపించడం ఎలా? Andhra bhoomi 28th Sep.2010

on Tuesday, September 28, 2010

సంచలనం కోసం, ప్రాచుర్యం కోసం చానళ్ళు చమత్కారాలు చేయడంలో విశేషమేమీ లేదు. ఇటీవల టీవీ-1 చానల్ దళితులకు బతుకులకు అధికారం అంటూ కాంపెయిన్ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఒక లోగోను క్రమం తప్పకుండా తెరమీద చూపుతూ, కొన్ని నినాదాలను స్క్రోలింగులో తరచూ చూపుతోంది. అతేకాక ఈ దిశలో ఒక పాటను తగిన ఫోటోలతో ప్రసారం చేస్తోంది. టీవీ-1 ఏ కారణంతో ఈ ప్రచార ఉద్యమాన్ని చేపట్టినా అది మంచిదేనని చెప్పాలి. చాలా కాలంగా మీడియాకు దూరంగా వర్గాల విషయంలో మీడియాకు అదర పాత్రం కావడం ఆనందదాయకమే!
ఇటీవలి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద యుద్ధం ప్రకటించిన టివీ-9, టీవీ-1లు ఇలా ఇప్పుడు మరో అంశాన్ని స్వీకరించడం పరిశీలనార్హం. ఎందుకు ఫలానా ప్రచారం స్వీకరిస్తారో తెలిపే విధానం మన మీడియాలో ఉండదు. కానీ టిటిడి విషయం కోల్పోయిన గౌరవం బడుగులకు రాజ్యాధికారము అనే ప్రచారంవల్ల లభిస్తుంది. నిజానికి సుమారు మూడు సంవత్సరాల క్రితం ఒక తెలుగు దిన పత్రిక స్వీకరించిన పత్రికా విధానానికి ఈ పోకడ చాలా దగ్గరగా ఉంది. మిగతా చానళ్ళు - మనకెందుకు ఈ ఆలోచన రాలేదని ఆలోచించే పరిస్థితి ఉంది. కనుక ఈ అంశాన్ని ఇతర చానళ్ళు స్వీకరించినా ఆశ్చర్యం లేదు. టీవీ-9 సంస్థ చేపట్టే ఏ పని అయినా సంచలనంతో కూడి ఉంటూ, తమ సంస్థకు లాభించేలా ప్రయత్నిస్తుంది. కారణం ఏమైనా, ఒక మంచి పని జరుగుతోందని అభినందించాలి.
* * *
హెచ్‌ఎంటివీలో దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ ఆగిపోయినట్టుంది. వినాయకచవితి రోజుల్లో ‘సరదా’గా అని ఒక చిరు అంశం చూశాను. అది సరదాగా అని అన్న దానితో ప్రయోజనం తప్పక ఉంటుంది. హుస్సేన్‌సాగర్ అడుగునకు పోయిన వినాయకుడు - మూషికాలు సంభాషించుకోవడం వస్తువు. హుస్సేన్‌సాగర్ కలుష్యానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కరిగిపోతాయని చెప్పించాడు. కాలుష్యం స్థాయి ఎక్కువ అనే సెట్టర్ ఇందులో ఉంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కలిగే అనార్థాలు గురించి అసలు చెప్పపోవడం సబబు అనిపించదు. కేవలం వ్యంగ్యం, హస్యమే ప్రదానం కావడంతో ఇతర విషయాలు దారి తప్పాయి. కొంత పరిశోధనతో ఇలాంటి అంశాలు ప్రయత్నిస్తే చానల్‌కు గౌరవం, వీక్షకులకు ప్రయోజనం.
వినాయకచవితి సందర్భంగా ప్రసారమైన ఇంకో విషయం గురించి చెప్పాలి. విద్యుద్దీపాల అలంకరణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే ‘జరభద్రం’ స్టూడియో ఎన్‌లో ప్రసారమైంది. వాస్తవానికి ‘జరభద్రం’ చిరు కార్యక్రమం చానల్‌కు గౌరవం కల్గించే ప్రయత్నం. ఒక పార్టీవైపే ఆలోచించే, వాదించే చానల్‌గా స్టూడియో ఎన్‌కు పేరు పడుతోంది. అయినా, అటువంటి ఛాయలు లేకుండా సాగే ‘జరభద్రం’ ప్రసారంతో ప్రతిష్ట ఇనుమడిస్తుంది. ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా, నేరుగా, కొంత పరిశోధనతో సాగే ఈ కార్యక్రమం రక్తికడుతోంది. పర్యావరణం, ఆరోగ్య, వినియోగ అవగాహన, చట్టం, హక్కులు వంటి వాటిపై మరిన్ని చేయాల్సిన అగత్యం చాలా ఉంది.

డబ్బులు ఆడించగల నిర్మాత సినిమా విడుదలయితే - అది బ్రేకింగ్ న్యూస్ కాగలదు. వార్త కార్యక్రమం కాగలదు. సినిమా విడుదలకు ముందురోజు ప్రముఖ చానళ్ళు పోటీ అనుకోకుండా ఆయా తారలతో లైవ్‌షోలతో నింపేస్తాయి. అవసరమైతే సమయాన్ని మార్చి, సిద్ధంగా ఉండగలవు. సరదాగా కాసేపు’ సినిమాకు సంబంధించి ఆ సినిమా దర్శకుడు చాలా చానళ్లలో కనిపించారు. మిగతా చానళ్ళు కార్యక్రమాలు కాదుగానీ- ఎన్టీవీలో స్వాతి మైత్రేయ వంశీని ఇంటర్‌వ్యూ చేసింది. గాయని అయిఉండి, చానళ్ళలో పాటల ప్రోగ్రాం నిర్వహించిన ఈవిడ ఇటీవల రెండక్షరాల పేరుతో న్యూస్ రీడర్‌గా మారిపోయింది. అయితే న్యూస్‌రీడర్ యాంకర్ కావడం మంచిదే! కాస్త లోకజ్ఞానం ఉంటుందని ఆశిద్దాం. రాసిచ్చిన ప్రశ్నలకు వరుసగా చదివితే ప్రయోజనం కాదుకానీ, హాస్యం పండుతుంది. జవాబు ఆధారంగా ప్రశ్న సాగాలి. అలాకాక స్వాతి విధానంలోనే సాగితే పరువు గల్లంతవుతుంది. స్వాతి న్యూస్ రీడర్‌గా చక్కగాఉంది. అయితే ఇంటర్‌వ్యూలు నిర్వహించాలంటే మరింత సాధన, సమయస్ఫూర్తి అవసరం మరి. శ

దృశ్యాన్ని దుర్వినియోగం చేయడం ఇలానా? Andhra bhoomi daily 21 Sep 2010

on Thursday, September 23, 2010

వార్తా చానళ్ళమీద విమర్శలు గమనిస్తే- అవి వార్తా చానళ్ళు అనే ధర్మం కోల్పోయాయి, మిగతా వినోదాత్మక చానళ్ళు ప్రసారం చేసే కార్యక్రమాలు- భక్తి, సినిమా, ఆరోగ్యం, క్రీడలు.. ఇలా ప్రతి సెగ్మెంట్ అంశాలు న్యూస్ చానళ్లలో తప్పనిసరి అయ్యాయి, వార్తా చానళ్ళు మిగతా చానళ్ళను కాపీ కొడుతున్నాయనే అభిప్రాయం ఉంది. అయితే ఈ అనురకరణ అనేది ఒకే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో కూడా సాగుతున్నదని ఇటీవల తెలిసి వచ్చింది. ఉదయం ఫోన్ ఆధారిత జ్యోతిష్య సలహాలు ప్రతి వార్తా చానల్‌లో స్థిరపడిపోయాయి. ఇటువంటి కార్యక్రమాలవల్ల చానళ్ళకు ఆదాయంతోపాటు వీక్షకులు లభిస్తున్నారు.
కొంతకాలం క్రితం జెమిని టీవీ ‘శుభలగ్నం’ అనే జ్యోతిష్య సలహాలు కార్యక్రమం ప్రారంభించింది. ఈటీవీ ‘గ్రహబలం’ వంటి కార్యక్రమం ప్రతి ఆదివారం ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ సెప్టెంబర్ 13 నుంచి ఈటీవీ అటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రసారం చేస్తూ ‘శుభమస్తు’ అని నామకరణం చేసింది. దాంతో పాటు ‘జీవనజ్యోతి’ అనే ఆయుర్వేద సంబంధమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రెండు సినిమా ఆధారిత కార్యక్రమాలను రద్దుచేసి వీటిని ప్రారంభించారు. ఆయుర్వేదం సంబంధించిన ఆరోగ్య కార్యక్రమం జీ తెలుగులో చాలాకాలంగా ప్రసారమవుతూ, ప్రాచుర్యం పొందింది. అలాగే మాటీవీ కూడా!
***
అనుకరణ అనేది చాలా మామూలు అయిపోయింది. ప్రతి వార్తా చానల్ కూడా ‘కార్టూన్’ వంటి కార్యక్రమాలు రెండు మూడు ప్రారంభించింది. దీనిని ‘టీవీ కార్టూన్’ అని కూడా అనవచ్చునేమో! వికటకవి ఒక రకం కాగా, దాదా మరోరకం. సిల్లీబ్రాండ్, మిష్టర్ గిరీశం, గజనీ షో... ఇలాంటి పేర్లతో ఏ చానల్‌కా చానల్ రూపొందిస్తోంది. చానళ్ళు రాజకీయ పరంగా ధ్రువీకరణం చెందడంవల్ల ఇటువంటి సృజనకు మరింత వీలుంది. ఇటువంటి ప్రయత్నాలవల్ల ఉద్దేశిత భావాన్ని బట్వాడా చేయడం సులువు. ఖర్చు కూడా బాగా తక్కువ. వాయిస్ మిమిక్రీతో నడిపించివేయవచ్చు. అయితే ఇటువంటి ప్రయోగాలు కొన్ని వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వీటి నిడివి ఎక్కువగా ఉండటం, మరికొన్ని సమయాల్లో ఒకే కార్యక్రమాన్ని నాలుగైదు రోజులు ప్రసారం చేయడంవల్ల ఎవరికి ప్రమాదమో చానళ్ళు గమనించాలి. అలాగే చౌకబారు స్థాయిలో వ్యాఖ్యలు వీటిల్లో ఉండటం కూడా మంచిదికాదు.
టీవీ-5 చానల్ మొదలైనపుడు ‘పాటనై వస్తున్నా’ అనే కార్యక్రమం ప్రారంభించింది. జనపదాల్లో వినిపించే పాటలకు కేటాయించిన కార్యక్రమం. ఇపుడు మరికొన్ని చానళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించడం మంచిదే! జీ తెలుగు చానల్ వంటల కార్యక్రమాలను విభిన్నంగా రూపొందించి ప్రాచుర్యం పొందింది. దీంతో మిగతా చానళ్ళు అదే దారిలో బడ్డాయి. అలాగే పిల్లల్లో పాటల కార్యక్రమాలను ఇపుడు మరికొన్ని చానళ్ళు మొదలుపెట్టడం గమనార్హం.
వార్తాపత్రికలను ఆధారం చేసుకుని ఉదయం కార్యక్రమం రూపొందించడం మనకు తెల్సిందే. పోటాపోటీగా అన్ని చానళ్ళు ప్రారంభించి ఎక్కువసేపు ప్రసారం చేసేవారు. తర్వాత కొన్ని చానళ్ళు అటువంటి కార్యక్రమాలను ఆపివేయడం కానీ, సమయాన్ని కుదించడం కానీ జరిగింది. ఇటీవల ఆపివేసిన చానళ్ళు మరలా ప్రారంభించాయి. జీ 24 గంటలు, ఐ న్యూస్ మరలా ప్రారంభిస్తే; సాక్షి సమయాన్ని మార్చి మరలా ప్రారంభించింది. హెచ్‌ఎంటీవీ సమయాన్ని తగ్గించి చాలా రోజులయ్యింది. ఇలా ప్రారంభించడం, సమయాన్ని పొడిగించడం, కుదించడం, రద్దుచేయడం అనేవి ఏ అంశాల ఆధారంగా జరుగుతాయో బోధపడదు. ఎటువంటి హేతుబద్ధత లేకుండా గొర్రెదాటు విధానంలో చానళ్ళు మార్పులు చేస్తున్నాయో- అని కూడా భావించాలేమో!
***
టెలివిజన్ మాధ్యమం స్థూలం దృశ్యమాథ్యం. కానీ బుల్లితెరమీద కేకలేస్తూ కార్యక్రమాలు సమర్పించే వారికి ఈ విషయం తెలిసి ఉండదు లేదా తెలుసుకోవడానికి నిరాకరిస్తారో తెలియదు. గొంతును దుర్వినియోగం చేసినట్టే చాలా సందర్భాలలో దృశ్యాలను దుర్వినియోగం చేస్తారు. నెల్లూరు సంఘటనలో నర్తన అనే బాలిక క్రౌర్యానికి గురైంది. ఆమె తల్లిని శాపనార్థాలు పెట్టడం అటుంచి, ఆ బాలిక గాయాలను, పుండ్లను దాదాపు అన్ని చానళ్ళు చాలా విపరీతంగా, అనౌచిత్యంగా, జుగుప్సాకరంగా చూపాయి. ఆ వార్తాంశం ప్రసారం చేసినపుడు ఒకసారి చూపి, వివరాలను న్యూస్‌రీడర్ చదివితే చాలు. ఆ అమ్మాయి మొహం చూపించవచ్చు. అలా కాకుండా పదే పదే చూపడంతో వీక్షకుల మనసులు విపరీతంగా గాయపడతాయి. దౌష్ట్యం గురించి చెప్పడం వేరు, చూపడం వేరు. ఈ తేడాను గమనించిన తెలుగు చానల్ ఒకటైనా ఉందా?
ఇలా చేయడం చాలా నీచమే! తల్లికాదు తాటకి- అనే స్థాయిలో శీర్షికలు పెట్టిన చానళ్ళు కార్యక్రమాలను చేశాయి. మనిషిలోని పాశవిక లేదా ఇంకా అథమమైన గుణాలు ప్రకోపిస్తే ఇలానే జరుగవచ్చు. ఆమెలోని తల్లికన్నా కామిని చాలా రెట్లు బలంగా ఉండి ఉండవచ్చు. అదే సమయంలో చానళ్ళు గాయపడిన నర్తనను పదే పదే క్లోజుప్పులలో వందలు, వేలుసార్లు చూపి వీక్షకులను హింసించాయి.
***
సంగీతాన్ని మేళవించే గుణం చానళ్ళకు తగ్గిపోతోందా! సంగీతం అంటే హైడ్‌లైన్స్ నేపథ్యంగా ఇచ్చే చప్పుడు కాదు. టీవీ-5 ప్రారంభమైనపుడు జిల్లాల నేపథ్యం గురించి ప్రత్యేకంగా పాటలు రాయించి, చిత్రించి ప్రసారం చేశారు. ఆ జిల్లా వార్తలకు దాన్ని విధిగా వాడేవారు. తర్వాత తర్వాత ఆపివేశారు- ఎందుకు? మిగతా అనుకరించలేదని ఆపివేశారేమో తెలియదు. కానీ కాస్త ఓపికగా ప్రసారం చేస్తే- ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రాంతాలకు చెందిన వారిలో ఇది తప్పక ఆకట్టుకుంటుంది. మిగతావారికి అది సమాచారం. అంతకుమించి వీక్షకుడికి మంచి రిలీఫ్. అలాగే మహా టీవీ మొదలైనపుడు మంచి పాట రాయించి, పలుసార్లు ప్రసారం చేశారు. మరి ఇపుడేమైందో? ఎందుకు వినిపించదు? కనీసం కొన్ని భాగాలుగానైనా అపుడపుడు వినిపించవచ్చు గదా!

శృతి మించకూడదు TV VEEXANAM , Andhra Bhoomi daily

on Friday, September 10, 2010

September 7th, 2010

పది పనె్నండేళ్ల క్రితం రెండే ప్రధానంగా టీవీ చానళ్లు వుండేవి-జెమిని, ఈటీవీ. వాటి మధ్య సిటీకేబుల్. సిటి కేబుల్ దేనితోనూ పడలేక సినిమాల విషయంలో భయంకరంగా వుండేది. ఏ ఇతర చానల్ ఫలానా గంటలకు ఫలానా సినిమా అంటే-దానికి ముందే సిటి కేబుల్ ఆ సినిమాను ప్రసారం చేసేది. అందుకే ఖర్చు, శ్రమలేని పోటీ అయితే అనుక్షణం సంసిద్ధం-అని అనడం. పదమూడేళ్లు గడిచినా, చానళ్ల సంఖ్య నలభైదాకా పెరిగినా-చౌకబారు పోటీ అదేస్థాయిలో లేదా మరింత తీవ్రంగా వుంటోంది. గత ఆదివారం ఒకేసమయంలో రెండు చానళ్లలో ప్రభాస్ నటించిన సినిమా ప్రసారం కావడం దానికి తార్కాణం! ఈ పోటీ కేవలం ప్రభాస్ సినిమాకే కాదని కాస్త పరిశీలిస్తే బోధపడింది. లోకల్ టీవీ టాటాడొకోమా అవార్డుల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే మా టీవీ మరో అవార్డుల కార్యక్రమాన్ని ఇచ్చింది. దీనితోడు తేజా (లేదా జెమిని) చానల్ రెండేళ్ల క్రితం అవార్డుల కార్యక్రమాన్ని మరలా ఇప్పుడు ప్రసారం చేసింది. ఇదెక్కడ దిక్కుమాలిన పోటీనో బోధపడడంలేదు. కేవలం పోటీగా ప్రసారం చేస్తున్నారు కానీ, ఆ కార్యక్రమాలు ఎందుకు ఇప్పుడు ప్రసారం చేయాలో వారు ఆలోచించడంలేదు. ఇలా అనౌచిత్యంగా, హాస్యాస్పదంగా ఇవ్వడంవల్ల చానళ్లకు గౌరవం తగ్గడం తప్ప మరొకటి జరగదు.
టాటా డొకోమా సంస్థ చాలా వితరణంగా చాలా పెద్ద సంఖ్యలో అవార్డులు ప్రకటించింది. టీవీ, పత్రికలు, రేడియో-లా చాలా రంగాలకు పాతిక, యాభైదాకా అవార్డులివ్వడం విశేషం. అయితే ఇక్కడ కూడా తమాషా కనబడుతోంది. ఏ కారణంవల్ల ఒక ఆవార్డు ఇస్తున్నారో, అదే కారణంతో మరో విజేతను విబేధించవచ్చు. కానీ అంత వైవిధ్యంగా, ఎంతో సహిష్టుతతో ఎంపిక చేయడంలో సంస్థల వాణిజ్య లాఘవం కనబడుతోంది. అదే సమయంలో అవార్డులు కూడా ఎలా ప్రస్తుత పోకడలతో మమేకమైపోతున్నాయో కూడా బోధపడుతుంది. అంటే ఒక వ్యవస్థీకృతమైనదిగా తయారవుతోంది. ఈ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి-వేణు సమర్పించిన హాస్య కార్యక్రమం గొప్పగా వుంది. టీవీ చానళ్లు టీఆర్‌పి వెంపర్లాటను చాలా పచ్చిగా, గట్టిగా బయటపెట్టింది. నిజానికి ఈ ప్రయత్నం ఆద్యంతం నవ్వించడమే కాదు, చానళ్లకు తొడపాయసం పెట్టినట్టు నడిచింది. ఎంత అర్ధరహితంగా, అనౌచిత్యంగా టీవీ పోటీ సాగుతోందో ఇక్కడ వ్యంగ్యంగా బట్టబయలు అయింది. అయినా టీవీ చానళ్లు అదే తరహాలో తమ వెంపర్లాటలో అవిసాగుతున్నాయి. దీనికి చాలా ఉదాహరణలు చూడవచ్చు. అయితే అదే సమయంలో చానళ్ల రాజకీయ ప్రయోజనాలు కూడా ఘనంగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం పనె్నండు వార్తా చానళ్లను మూడు సమూహాలుగా పరిశీలించవచ్చు. ఈటీవీ-2, ఎబిఎన్, మహా టీవీ, స్టూడియో-ఎన్ ఒక సమూహం కాగా, ఎన్‌టివీ, టీవీ-5, సాక్షి, ఐన్యూస్ మరో సమూహం. మొదటి సమూహం వార్తలు ఎలావుంటాయో వేరుగా చెప్పనక్కర్లేదు అదేరీతిలో రెండో సమూహం! ఈ వర్గీకరణకు దొరకని చానళ్లు నాలుగున్నాయి. టీవీ-9 తొలి సంచలనాత్మక తెలుగుచానల్‌గా కీర్తిపొందింది. దీనికి గతిశీలత చాలా ఎక్కువ. రాజకీయపరమైన విధానం ఏమిటో ఒక్కోసారి బోధపడదు. ఒక్కసారి చాలా బ్యాలన్స్‌డు అనిపిస్తుంది. తర్వాత మరుక్షణంలో ఇంకోరకంగా వుంటుంది. జెమినీ న్యూస్ మూడవ తెలుగు న్యూస్ చానల్ అయినా సరైన రీతిలో వీక్షకులకు అందుబాటులో లేదు. అందువల్ల జెమినీ న్యూస్ గురించి వ్యాఖ్యానించడం తగదు. ఇక హెచ్‌ఎంటివి, జీ 24 గంటలు కాస్త తెలంగాణ మొగ్గుగల చానళ్లు అని ముద్రపడినవి. అయితే రాజ్ టీవీ రాకతో ఈ గుర్తింపును అది స్పష్టంగా తీసుకుంది. ఇటీవల జీ 24 గంటలు రాజకీయ వాసన తగిలించుకుని సినిమా, అశ్లీలం కలగలిపిన కార్యక్రమాలు బాగా పెంచింది. హెచ్‌ఎంటివి కాస్త విభిన్నంగా, నిలకడగా సాగుతున్న చానల్. దిశ-దశ కార్యక్రమాలతో తెలుగు న్యూస్ చానళ్లను స్టూడియో నుండి బయటకులాగిన ఘనత హెచ్‌ఎం టీవీదే! ఇటీవల ‘్థర్డ్ డిగ్రీ‘ అనే కార్యక్రమం స్టూడియో ఎన్‌లో చూశా. మూడు నాలుగు నిమిషాల ఈ కార్యక్రమానికి స్పూర్తి, ఆధారం సినిమా భావన. ఎమ్‌ఎస్ నారాయణను పోలిన బొమ్మ , గొంతుక ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. ఎంత స్థాయిలో తెలుగుదేశం సానుభూతి వున్నా, ఆ స్థాయిలో ముఖ్యమంత్రిని అగౌరవపరచడం భావ్యం కాదు. చానళ్లకు కనీస స్థాయిలో హుందాతనం వుండాలి. ఎన్‌టివి స్వాతంత్య్రదినోత్సవం రోజున కాస్త అతి చేసిందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే శృతి మించడం ఎవరికీ మంచిది కాదు!

అవివేకం, అజ్ఞానం వెరసి సంచలనం

on Tuesday, August 31, 2010

Aug 30,2010

ఒక సంచలన వార్త మీకు వినబడగానే అందులోని సత్యాసత్యాలు తెలుసుకోవడానికి ఏ న్యూస్‌ఛానల్ మొదట చూస్తారు?-ఇది దాదాపు సంవత్సరం క్రితం (మనకు న్యూస్ ఛానళ్లు బాగా పెరిగిన సమయంలో) సి.ఇ.ఓ స్థాయిలో వుండే వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న. ఫలానా చానల్ అంటే నాకు గట్టి నమ్మకం, ఆ ఫలానా ఛానలే చూస్తానని నేను చెబుతూ ఒక చానల్ పేరు చెప్పగలనని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. నిజానికి పోటీ పెరిగిన ఇటువంటి పరిస్థితి అటువంటి విశ్వసనీయత వుంటే ఏ చానల్ అయినా గర్వపడాలి.ఈ ప్రశ్న అడిగినందుకు ఆయనను అభినందించాలి. చానళ్లు ఆ రీతిలో ఆలోచిస్తే మరీ మంచిది!
గత మంగళవారం రాత్రి దాదాపు పది గంటల సమయంలో ఓ చానల్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ-కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో పెద్ద శబ్దం, ఎంతో వెలుగు, భయాందోళనల్లో ప్రజలు, అధికారుల అభిప్రాయం-కనబడింది. ఇది రిమోట్ కాలం మరి! మనం ఎంత వేగంగా చానల్ మారుస్తున్నామో, అదేవేగంలో అక్కడ కూడా దాదాపు అదే సమాచారం అన్ని చానళ్లలో కనబడుతోంది. అంతకుమించిన స్పష్టత లేదు. ఒకవేళ వుంటే సంచలనాత్మకతలో స్థాయి భేదం వుండవచ్చు. మనకు ఎన్ని తెలుగు చానళ్లు వున్నాయో, అన్నీ లేదా మా కేబుల్‌లో ఎన్ని తెలుగు చానళ్లు వస్తాయో అన్నీ అదేపంథాలో వున్నాయి.
మరి వీక్షకుల పరిస్థితి ఏమిటి? ఏదో చానళ్ల వ్యవహారంలే! ఏదైనా ఉంటే గింటే ఉదయానికి తెలుస్తుంది కదా అని నిద్రపోక తప్పనిపరిస్థితి తయారైంది. ఆ మధ్య వెంకటాద్రి రైలో, పద్మావతి ఎక్స్‌ప్రెసో-అంటూ కొంతసేపు హడావుడి సాగింది. చీకటిమాటున సాగిన వార్త తెలారేసరికి నల్లబారిపోయిందిసరే, మొదటి ప్రశ్నను చూద్దాం. ఒక్క ఫలానా చానల్‌విశ్వసనీయత గలిగి ఉంది-ఎందుకంటే అది ఫలానా ప్రతిష్టాత్మక సంస్థతి లేదా ఒక ప్రముఖ వ్యక్తి నిర్వహిస్తున్నారు అని భావించే పరిస్థితి పత్రికలకు వుండవచ్చు. అది చానళ్లకు వర్తిస్తుందా? పత్రికా రంగం కొంత వ్యవస్థీకృతంగా, కొంత క్రమశిక్షణతో సాగుతుంది. వార్తా చానళ్లకు సమయంలో పరిమితి లేనట్టే చాలా విషయాల్లో వెసులుబాటు వుంది. కొందరు వ్యక్తులు గొప్పగా ఉన్నంత మాత్రాన ఆ గొప్పతనం 24 గంటలూ వ్యాపించదు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రసార కాలమిది. మారుమూల ప్రాంతాని చెందిన వార్త వివరించడానికి ఒక యువకుడికి కెమెరా, మైకు అప్పగించిన సమంలో ఆ వార్తకు ఆయనే సర్వాధికారి. ప్రపంచం గురించి, జర్నలిజం గురించి ఆయనకు ఎటువంటి అవగాహన వుందో, అదే వార్తను రూపుదిద్దుతుంది. ఈ ఫలానా వ్యక్తి స్థాయికి ఆ సంస్థకు సంబంధం వుందా? ఉండాలా? లేకపోతే దాన్ని సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయా? అనేది వేరే ప్రశ్నలు.
మొత్తం ప్రసారాలు ఎలా సాగుతున్నాయో పరిశీలించే వ్యవస్థ లేదు. కనీసం ప్రసారమైన తర్వాత దాచుకునే వెసులుబాటు కానీ, తీరిక కానీ చాలా చానళ్లకు ఉండకపోవచ్చు. అలా దొరికింది, ఇలా వడ్డించడమే తప్ప మరో చర్యకు అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే తక్షణమే తెలియజెప్పి అదే ప్రసారంలో దాన్ని సరిచేసే అవకాశం వుందా? ఆమంచి కృష్ణమోహన్ చానళ్ల యాజమాన్యాల ఘన కార్యాల గురించి కుండబద్దలుకొట్టినట్టు చెప్పిన విషయాలు అలానే ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఆ సమయంలో సదర చానళ్లు సిఇఓ కూడా సగటు వీక్షకుడిలా ఆ విషయాలు బుల్లితెర ద్వారా తెలుసుకోవడం జరగవచ్చు. అయితే గియితే ఆ వార్త ప్రసారమయ్యాక ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపివేయవచ్చు. అంతకు మించి మరే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా?
సిబ్బంది ఉన్నా లేకపోయినా-పోయినా పోటీపడి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం బాగానే వుంది. అయితే అంత ఉత్సాహం సిబ్బంది నాణ్యత పెంచడానికి కానీ, లేదా ప్రత్యామ్నాయం కూడా వుండే రీతిలో టెక్నాలజీని సంవృద్ధి పరచడానికి కానీ వుండద. దీనివల్ల ఖర్చు పెరుగుతుందని చానళ్ల అభిప్రాయం కానీ అవివేకం, అజ్ఞానం కలగలిస్తే టెలివిజన్ రేటింగ్ పాయింట్ (టిఆర్‌పి) పెరగడం ఒక అనుభవం. ఫలితంగా ఖర్చు తక్కువ, ఆదరణ ఎక్కువ అనే భావం కూడా స్థిరపడింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఏదో విమానం కూలిపోయిందనే రీతలో భయపెట్టిన చానళ్లు మరుసటిరోజు ఉదయం ఆ విషయం గురించి మెదలకుండా వేరే వార్తలు చెబుతూపోయాయి. నిజానికి ఆ ప్రాంతానికి వెళ్లి, చూసి, పరిశీలించే సిబ్బంది ఎన్ని చానళ్లకు వున్నారు. హైదరాబాద్ పొలిమేరలకు వచ్చాక ఎవరి వ్యవహారం వారిది, ఎవరిపోటీ వారిది అనే పోకడ వుంటుంది. కానీ అట్టడుగు స్థాయిలో ఆధారం ఒకేపుకారు కావచ్చుదాన్ని అందుకున్న జర్నలిస్టు కూడా కేవలం ఒక్కరే అయివుండవచ్చు. ఈ స్థాయిలో వార్తా సమాచారాన్ని పంచుకోవడం చాలా సహజం. ఎందుకంటే వారి కారణాలు వారికి ఉంటాయి! అలాగే పక్క చానళ్ల బ్రేకింగ్ చూసి తాము కూడా సాగే అలవాటు చానళ్లకుండవచ్చు!
నిజానికి ఇలాంటి చర్చ చాలామంది చానళ్ల ప్రముఖులకు అసహనం తెప్పిస్తుంది.
ఎప్పుడూ విమర్శలేనా? కొంత మెచ్చుకోలు వద్దా? అని వారడగవచ్చు.
అయితే ఈ చర్చ చేస్తున్నది వీక్షకులకోసం కాదా!

హిందీ రాజ్యంలో తెలుగు తేజం

on Tuesday, August 24, 2010

హిందీ రాజ్యంలో తెలుగు తేజం
August 23rd, 2010

ఒక్కసారిగా తెలుగు చానళ్లన్నీ ఆనంద పడుతూ ఒకేరకంగా బృందగీతాన్ని ఆలపించాయి. అటువంటి సందర్భం చాలా విశేషంగా వుంటుంది. శ్రీరామ్ ఇండియన్ ఐడల్‌గా ఎంపిక కావడమే అపురూపమైన విషయం. గతంలో కారుణ్య, హేమచంద్ర తృటిలో తప్పిపోయారు. ఆ సందర్భంలో హిందీ చానళ్లు ఉత్తరాది పక్షపాతమని చాలా చర్చలు జరిగాయి. ఎస్‌ఎంఎస్‌లలో రాజకీయాలు సాగుతాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈసారి తెలుగు కుర్రాడు సోనీ ఇండియన్ ఐడల్-5 ఫేం అధిరోహించడం తెలుగువారి అసంతృప్తిని వమ్ము చేసింది. అంతేకాదు దక్షిణాది పట్ల చానళ్లు చిన్నచూపు అనే అపవాదు కూడా పోయింది.
టీవీ రంగం తారలను తయారుచేస్తోందనే వాస్తవం క్రమం స్థిరపడుతోంది. కారుణ్య, హేమచంద్ర ప ఊర్తిగా విజేతలు కాకపోయి, తర్వాత ఆ ప్రచారం వారికి ఎంతో గుర్తింపు నిచ్చింది. సోనీ షోల తర్వాతనే వారు మ రింత ప్రాచుర్యంలోకి వచ్చారు. ఒకరకంగా చూస్తే సినిమాను మించిన గుర్తింపు టీవీ ద్వారా సిద్ధిస్తోంది. ఒక దశలో టీవీ చిన్నతెర, సినిమా పెద్ద తెర అని భావించేవారు. కానీ నేడు చిన్న తెర ద్వారా మరింత ఆదరణ పొందాలని సినీ తారలు ఆశిస్తున్నారు. ఆగస్టు 24న ఈటీవీలో జగపతిబాబు పాల్గొనే ‘రాజురాణి జగపతి’ అనే షో రాత్రి 9.30కు మొదలైంది. ఇది వరకే హీరో సాయికుమార్ సమర్పించే ‘వావ్’ ఈ టీవీలో ఎంతో ప్రజాదరణ పొందింది. అదే షో అదే యాంకర్‌తో ఈటీవీ కన్నడలో మొదలవుతోంది.
ఇటీవల ఈటీవీ కాస్త వైవిధ్యంగా షోలు రూపొందిస్తూ మిగతా చానళ్లకు గట్టిపోటీ ఇస్తోంది. రాత్రి 9.30కు రెండుజులు ఉదయభాను ‘్ఢ’, రెండు రోజులు సాయికుమార్ ‘వావ్’, రెండురోజులు సంగీతం ఆధారమైన కార్యక్రమాలు ఇలా రక్తికడుతున్నాయి. వార్తా చానళ్లలో ఈటీవీ-2 పోటీపడకుండా సాగిపోతున్నా ఈటీవీ మాత్రం మంచి పోటీ ఇస్తోంది.
* * *
అమెరికా సంస్థ సిబిఎస్, రిలయన్స్ సంస్థ బిగ్ కలిసి చెరిసగం వాటాలతో బిగ్ సిబిఎస్ అనే సంస్థను ఏర్పరిచాయి. రెండు నెలల క్రితం ఈ వార్త భారతీయ టీవీ రంగంలో సంచలనం కలిగించింది. ఇటీవల ఈ ఒప్పందంవల్ల సాధ్యపడే అంశాలు కొన్ని వెల్లడి అయ్యాయి. ఈ సంవత్సరాంతానికి మూడు ఇంగ్లీషు చానళ్లు వస్తాయి. బిగ్ సిబిఎస్‌ప్రైమ్ అనే చానల్ 18-34 వయసున్న వారికోసం ప్రారంభమయ్యే జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్. బిగ్ సిబిఎస్ స్పార్క్ అనేది 18-24 వయసున్న యువత కోసం కాగా బిగ్ సిబిఎస్ లవ్ అనే చానల్ 18-34 వయసున్న మహిళలకోసం.
మన దేశంలో హిందీ చానళ్ల మధ్యే పోటీ బాగా వుంది కానీ, వినోదాత్మక ఇంగ్లీషు చానళ్ల మధ్య పోటీ తక్కువే అని ఈ సంస్థ అభిప్రాయం. స్టార్ వరల్డ్, జీ కెఫె, జీస్టుడియో తప్ప మరే వినోదాత్మక ఇంగ్లీషు చానల్ ప్రాచుర్యం కాలేదు. కనుక ఇంగ్లీషు చానళ్లకు మార్కెట్ వుందని అభిప్రాయం. ఒక్క భారత దేశమే కాకుండా శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్తాన్ వంటి దేశాలను కూడా ఆకట్టుకోవచ్చని వీరి వ్యూహం. 2012 కు ప్రపంచంలోనే అత్యధిక డిటిహెచ్ కనెక్షన్లున్న దేశంగా భారతదేశం వుంటుందని ఒక అంచనా. అందువల్ల డిటిహెచ్‌ను కూడా నిర్వహించే బిగ్ సంస్థతో సిబిఎస్ చేతులు కలిపింది. ఈ సంస్థ ముందు ముందు ఇతర భారతీయ భాషలలో ప్రవేశిస్తోంది. అందులో తెలుగు ఖచ్చితంగా వుంటుంది.
* * *
తెలుగు చానళ్లను అవార్డులు ముంచెత్తుతున్నాయి. టాటా డొకొమో సంస్థ లోకల్ టీవీతో కలిసి అవార్డులు ప్రకటించింది. అయితే సమస్య ఏమిటంటే చానళ్లలో ఎంత వైవిధ్యముందో, అవార్డులలో కూడా అంతకు మించిన వైరుధ్యముంది. ఎన్ని చానళ్లకు ఏ అవార్డులిచ్చారో మనకు సులువుగా తెలిసే అవకాశం లేదు. ప్రతి మీడియా సంస్థ తమకు వచ్చిన అవార్డు గురించి ఊదరకొడుతుంది. అవార్డులిచ్చిన సంస్థకు ఆ మేరకు ప్రచారం వుంటుంది. అయితే ఏ మీడియా సంస్థ కూడా ఇతర మీడియా సంస్థలు పొందిన అవార్డుల గురించి చెప్పవు. అవార్డుల సంస్థలు కూడా సాధ్యమైనంత ఎక్కువ చానళ్లకు ఇవ్వాలని ప్రయత్నిస్తాయి. చానళ్లు పాపులర్‌గా మారినట్టు అవార్డులు కూడా అటువంటి రీతిలోనే స్పందిస్తున్నాయి. ఎబిఎన్‌లో ప్రసారమయ్యే ‘ఓపన్ హార్ట్’ కార్యక్రమాన్ని మోస్ట్ పాపులర్ న్యూస్ బేస్డ్ టాక్‌షోగా టాటా డొకొమో తీర్మానించింది. ఇంతవరకు ఏ టీవీ చానల్ కనీసం టీవీ-9కూడా నడవని రీతిలో ఎబిఎన్ షో సాగుతుంది. మందు కొట్టారా అని ఒక నాయకుడినీ, ఎంతమందిని పడేశారని ఓ నాయకురాలినీ...ఇలా ఒక ప్రత్యేకమైన పంథాలో ఈ ఓపన్ హార్ట్ సాగుతుంది. యధా ప్రజ-తధా రాజా అన్నట్టు యధా ఛానళ్లు-తథా అవార్డులు అనవచ్చునేమో!
* * *
అన్నట్టు ఒక కొసమెరుపు లాంటి అంశం చూద్దాం. సీరియళ్లలో ఎపిసోడ్లు వందలు దాటిపోతున్నాయని విమర్శలు మనకు తెలిసిందే! అయితే ఒక అవార్డుల ఫంక్షన్‌లో ఇలాంటి విమర్శ ఎదురైతే అవార్డు పొందిన నిర్మాత చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? తమిళం వంటి భాషల్లో వేలసంఖ్యలో (మన తెలుగుకన్నా ఎక్కువగా) సీరియల్ ఎపిసోడ్లు సాగుతున్నాయని