on Wednesday, July 27, 2011

on Wednesday, April 13, 2011

new ventures of Times Of India --Eevaram weekly

on Saturday, February 12, 2011

Aditya sinha's stint as editor in the new indian express

on Tuesday, February 1, 2011

Ombudsman at HMTV- A respectable initiative : Eevaram- 23rd Jan 2011

on Saturday, January 29, 2011

సైన్స్ ఉద్యమానికి సవాళ్లు - 17th Dec,2010

on Wednesday, January 19, 2011

సైన్స్ అంటే సత్యపథం, ఆశావాదం, కపటం లేని విధానం! ఈ విషయాలు పేర్కొనడానికి కారణాలున్నాయి. సైన్స్ ఆధారంగా ఏర్పడిన సంస్థలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్స్ ద్వారా ఆరోగ్యం, ఆహారం, ఆయుష్షు సాధ్యం కావాలని శ్రమిస్తున్నాయి. అర్ధరహితమైన నమ్మకాలు, దోపిడీ సాగకూడదని భావిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకునిపోయిన మూఢనమ్మకాలు ఇంకా విస్తరిస్తున్నాయి. కానీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి టెక్నాలజీ సైతం దోహదపడవచ్చు. అసంగతమైన నమ్మకాలకు పురిగొల్పే టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు విరివిగా ప్రసారం కావడంలో టెలివిజన్ అనే టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. దీనికి మించి కొత్త రకం సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి స్వరూపం గుర్తించే క్రమంలో బోల్తాపడకూడదు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక సదస్సు జరిగింది. దీని సారాం శం ఏమిటంటే మొబైల్ ఫోన్ల వాడకంతో సమస్యలు లేవనీ, అది కేవలం అర్ధరహిత ప్రచారమని. ఆ మేరకు మరుసటి రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ సదస్సును మొబైల్ కంపెనీలు ఖర్చుతో నిర్వహించారు. అందువల్ల ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే వల్లిస్తుంది. ఈ వార్త ప్రచురింపబడిన రోజునే ఆరోగ్య కార్యక్రమంలో మొబైల్‌ఫోన్‌తో అనర్థాలు చాలా ఉన్నాయని టీవీ చానల్ ప్రసారం చేసింది. నిజానికి ఈ పరిస్థితిని కూల్‌డ్రింకులలో రసాయనాల అంశంతో పోల్చవచ్చు. శీతల పానీయాలలో రసాయనాలున్నాయని సహేతుకంగా రుజువైనా, ప్రచారం పుణ్యమా అని చాలామంది దాన్ని పూర్తిగా నమ్మడం లేదు. ఈ స్థాయిలో శీతలపానీయాల సంస్థలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి.

శీతలపానీయాల లోగుట్టును వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలూ, సైన్స్ సంస్థలూ చాలా పాటుపడ్డాయి. కొంత విజయం సాధించాయి కూడా! తర్వాత సైన్స్ సంస్థలు ఈ విషయం పట్ల కాస్త వెనుకంజవేయ డం, దాంతో శీతల పానీయాల సంస్థలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. అయితే మొబైల్‌ఫోన్ల వాడకం గురించి పెద్దఎత్తున అవగాహ నా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ ముసుగున మన ఆరోగ్యం, ఉనికి మొదలైన వాటిని దెబ్బతీసే వాటిని గమనించడం సైన్స్ ఉద్యమశీలుర తక్షణ కర్తవ్యం. మొబైల్ బెడద కేవలం ఒకటి మాత్రమే కావచ్చు.

మరింత పరిశీలన చేస్తే మరిన్ని సమస్యలున్నాయని బోధపడవచ్చు. ఇటీవల కాలంలో గ్రహణం, శాంభవి, మరేదో మూఢనమ్మకం.. ఇలా ఏది సంభవించినా టీవీ చానళ్లలో అరగంటకు తక్కువ కాకుండా చర్చలు ప్రసారం అవుతున్నాయి. ఇందు లో ఉదయం పూట జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక వాదనకు నేతృత్వం వహిస్తుండగా; సైన్స్ సంస్థల వ్యక్తులు వారితో విభేదిం చే చర్చలో పాల్గొంటారు. అనుసంధానంగా ఉండే సమన్వయకర్త మాటలకు ఆజ్యం పోస్తూ, మంటలు ఎగిసే చర్చ జరపాలని ప్రయత్నిస్తారు.

ఎటువంటి వెలు గు లేకుండా కేవలం వేడి జిమ్ము తూ చర్చ ముగుస్తుంది. ఇరు వర్గాల తీవ్ర స్వరాలు గుర్తుంటా యి. కానీ చర్చ చివరకు ఏమి చెప్పిందో గుర్తుకురాదు. శృతిమించిన వాదనలు పెరిగి కొందరిని టీవీ కట్టేసేట్టు చేయవచ్చు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయం గల్లంతు కావడాన్ని ఎక్కువమంది గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి చర్చల వల్ల సైన్స్ సంస్థలకు కొంత ప్రచారం లభించవచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా సాధ్యపడిన విషయం కూడా కావచ్చు. కానీ వీక్షకుల దృష్టిలో ఇలా విభేదించే వారిగా, గొడవపడే వారిగా సైన్స్ సంస్థల వ్యక్తులు గుర్తుండిపోవచ్చు.

కానీ సైన్స్ అంటే వీలయినంత ఎక్కువమంది దోహదపడే గొప్ప సాధనమని చెప్పలేకపోతున్నారని గమనించాలి. నిజానికి జ్యోతిష్యం, వాస్తు.. వంటివి ఉపాధి కల్పించే మార్గాలు. కానీ సైన్స్ ప్రచారం వంటివి హాబీగా సాగే పనులు. అందువల్ల మొదటి వర్గంవారు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా, లాఘవంగా సాగుతా రు. వారే ప్రచార మాధ్యమాలకు ప్రకటనలు కూడా ఇస్తారని గమనించా లి. కనుక ప్రసార మాధ్యమాలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా సాగుతా యి. దీనితో సైన్స్ అసలు ప్రయోజనం కనబడకుండాపోతోంది. కానీ కొంత ప్రచారం మాత్రం మిగులుతుంది. సైన్స్‌లేని ప్రచారంతో ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి.

మరోవైపు విలువైన రాళ్లు, శని యంత్రాలు, హనుమాన్ కవచాలు విశృంఖలంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకోవైపు అర్ధరహితమైన కథనాలు సైన్స్ కథనాలుగా రక్తికడుతున్నాయి. అంతకు మించి సైకాలజి, సైన్స్, ఆరోగ్యం అటూ అర్ధరాత్రికి ముందు విచిత్రమైన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. ఈ తరహా అంశాల వల్ల ఏమి ప్రయోజనం ఉందో ఆలోచించాలి.

వీటిని విసర్జించాలని పోరాడేవారు ఎవరు? సైన్స్ సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నారని ఇటువంటి పోకడలను ఉపేక్షించడం తగునా? అందుకే సైన్స్ ఉద్యమ సంస్థలను ఆలోచించమని కోరడం! ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినా, రాయడం అనేది చాలా మౌలికమైన అంశం. అది లేకుండా ఇతర మాధ్యమ రూపాలను మనం ఊహించ లేం. కానీ సైన్స్ రచయితలు ఎందరున్నారని ఎవరైనా అడిగితే చేతి వేళ్ల సంఖ్యను మించిన సంఖ్య రాకపోవడం నేటి విషాదం.

నలభై సంవత్సరాలలోపు సైన్స్ రచయితలు ఎవరైనా ఉన్నారా- అని ఎంతో మందికి సందే హం రావచ్చు. దీన్ని మరింత ముదరనిస్తే ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రావచ్చు. కనుక సైన్స్ ఉద్యమ సంస్థలు నేడు పూర్తిగా దృష్టిపెట్టి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే వాణిజ్య ఎత్తుగడలతో పోరాడుతూ, క్రమంగా ఆ వాణిజ్యానికే పావుగా మారిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు!
-డా. నాగసూరి వేణుగోపాల్

ప్రభావం ఎంతని చెప్పడం?-14th jan,2011

ఇరవయో శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక ప్రగతి అనూహ్యంగా ఉందని భావిస్తారు. గతం నుంచి వర్తమానంలోకి వస్తున్నప్పుడు ఈఅనూహ్యా లు వరసగా తారసపడతాయి. రేడియో, టెలివిజన్, సినిమా, టెలిఫోన్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ.. వంటి చాలా విభాగాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని, ఇంతగా ప్రభావాన్ని కలుగజేస్తాయని ఎవరూ ఊహించలేదు.

ఎలక్ట్రాన్‌ను ఆవిష్కరించిన జె.జె.థాంసన్ తన పరిశోధనకు ఫలితాలు పెద్దగా ఉండక పోవచ్చని భావించారు. కానీ పాదార్థిక పరిశోధనకు, ఎలెక్ట్రానిక్స్‌కూ తెరలేపింది ఈ ఎలెక్ట్రాన్ ఆవిష్కరణే! అలాగే గత దశాబ్దపు సాంకేతిక విజ్ఞాన ప్రభావాన్ని ఒక సారి అవలోకిస్తే-మరెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అక్షరం చెరిగిపోలేదు గానీ అదృశ్య రూపంగా, అరూపంగా మారింది. ఉత్తరాలు, వ్రాత ప్రతులు తగ్గిపోయి మౌఖిక రూపంలో సాఫ్ట్ అవతారం ధరించింది. వివరంగా చెప్పాలంటే ఈ పదేళ్ళలో ఉత్తరాలు బాగా తగ్గిపోయాయి.

డిసెంబర్ నెల చివరి వారం అంటే తమకు ఉత్తరాల భారం పెరుగుతుందని పోస్టల్ శాఖ వారూ, ఆలస్యంగా వస్తాయని ప్రజలు ఆందోళన పడేవారు. ఆ స్థాయిలో గ్రీటింగ్ కార్డుల హడావుడి ఉండేది. ఇపుడంత లేదు. కానీ ఈ భారం నేడు సెల్ ఫోన్, ఇంటర్నెట్‌ల మీద పడింది. కంప్యూటర్, ఇంటర్నెట్‌కు సంబంధించి చాలా గొప్ప ఫలితం, ఎక్కువ ప్రయోజనకరమైన విశేషం- ఈ మెయిల్. ఎటువంటి జాప్యం లేకుండా సమాచారం పంపడమే కాదు, మన సమాచా రం మన దగ్గరే భద్రంగా ఉంచుకుని-కావాల్సిన వాళ్ళకు క్షణంలో పంపవచ్చు.

మరో రకంగా జిరాక్స్ ఖర్చును తగ్గించింది. ఇక షార్ట్ మెసేజ్ సర్వీ స్ (ఎస్ఎమ్ఎస్)తో సమాచారం కచ్చితంగా, త్వరగా అరచేతిలో వాలడం మన దేశానికి ఈ దశాబ్దపు వింతే! అదే సమయంలో ఇంగ్లీషు భయంకరంగా రూపు కోల్పోతున్నదని భాషా వేత్తలు ఆందోళన పడుతున్నారు. తెలుగు ఇంకా కంప్యూటర్ భాషగా విస్తరించలేదు కనుక, మనకా సమస్య లేదు. తెలుగు భాషకు ఇంత స్థాయిలో సాంకేతిక పుష్టి లభించినప్పుడు మనం ఇంకెంత స్థాయిలో తెలుగును దోష భూయిష్టం చేస్తామో తేలీదు! సరళీకరణ, ఉదారీకరణ ఫలితాలు వెల్లువయ్యింది - ఈ దశాబ్దంలోనే.

విమాన ప్రయాణం ఇదివరకు కాల్పనిక రచనలలో కూడా తక్కువగా ఉం డేది. కానీ నేడు అది చాలా సామాన్యమైపోయింది. అంతేకాదు, విదేశాలకు పోక, తర్వాత బంధువులు పోయి రావడాలు, అక్కడి పరికరాలు వగైరా గమనించడాలు, ఇక్క డ కూడా అలాంటివి రావాల ని కోరుకోవడాలు బాగా పెరిగింది. స్వంత వాహనాలు విషయానికి వస్తే 20వ శతా బ్దం చివరి దశాబ్దంలో స్కూటర్ పాతబడి పోయింది. ఈ దశాబ్దంలో కారు సహజమైపోయింది. లక్ష రూపాయలకు నానో కారు అనే విషయాన్ని సంచలనాత్మకంగా చర్చించారు. చర్చ ఉన్న స్థాయిలో కారు లేదన్నది వేరే విషయం.

అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలాగానే కంప్యూటర్ ఖరీదు తగ్గింది. ఈ విషయం చెప్పుకుంటున్నప్పుడు ఎటిఎంల గురించి చెప్పుకోకపోతే బావుండదు. ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ -బ్యాంకులో డబ్బులుంటే చాలు రాల్చుకోవచ్చు శ్రమ లేకుండా. ఇటువంటి దానికీ పాస్‌బుక్కు, చెక్కు, బ్యాంక్ టైమింగ్స్, వెయిటింగ్ విసుగు వంటి వాటితో కలసిన రోజులను పోల్చుకోండి -అప్పుడు తెలుస్తుంది టెక్నాలజీ సౌఖ్యం! సరిగ్గా ఇటువంటిదే టీవీ వినోదం. ఎటువంటి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా, కాలయాపన లేకుండా 'కావాల్సింది కావాల్సినంత' అనే స్థాయి లో టీవీ వినోదం విచ్చల విడిగా లభిస్తోంది.

దీన్నయితే అసలు ఊహించలేదు. దేశంలో ఐదువందలకు పై చిలుకు - ఒక లెక్కింపు ప్రకారం 503 - రకరకాల చానళ్ళతో ముందు ముందు 'టీవీ వైరాగ్యం' కూడా విరివిగా పల్లవించే పరిస్థితి రావచ్చు. టెక్నాలజీ వినియోగం బాగా పెరిగి, వీటి రూపకల్పనకు మూల భూతమైన విజ్ఞాన భావనలు, శాస్త్రీయ అభినివేశం పూర్తిగా అంతరించి పోయిందేమో అనే భయం కలుగుతుంది. శాస్త్రీయ దృష్టి సరే, ఇంగితం కూడా అంతర్ధానం అవుతోందనే భయం కలుగుతోంది.

ఇది ఒక వైపుకాగా, మరో వైపు ఆత్మ విశ్వాసం క్లాసులతోపాటు దేవాలయాలు, పూజలు, మొక్కులు వగైరాలు కూడా మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతకుమించి విగ్రహాలు, బొమ్మలు, ఆచారాలు మరింతగా జనంలోకి చొచ్చుకువచ్చాయి. టెక్నాలజీ వాడకం పెరిగితే, దాని ద్వారా తారసపడే మోసాలు కూడా పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా - అన్నట్టు నేరాలలో సైబర్ నేరాలు గొప్పవయా -అని చెప్పుకోవాలి. వీటిలో ప్రక్రియ ఎంత సరళంగా, లాఘవంగా ఉంటుందో జరిగే మోసం అంత భారీ స్థాయిలో ఉంటోంది.

అంతకుమించి సృజనాత్మకంగా ఉంటుంది. నిజానికి దీని గురించి ఎక్కువ చర్చిస్తే టెక్నాలజీ అంటే భయం పెరుగుతుందని భావించే వారు కూడా ఉన్నారు. నిజానికి సైబర్ నేరాలకు అవసరమైన చట్టాలు మరింత పకడ్బందీగా ఏర్పడుతున్న కాలమిది. వీటన్నిటితో పాటు, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల విపరీతమైన మోజు పెరిగి మౌలిక విజ్ఞాన అంశాల పట్ల గౌరవం, అభిమానం తగ్గడం ఆందోళన కల్గిస్తోంది. బి.టెక్ వైపు ఉన్న హడావుడిలో బియస్సి వైపు దాదా పు లేదని డిగ్రీ కోర్సుల వివరాలు చెబుతున్నాయి

. ఇలా జరగడం ముందు ముందు మౌలిక పరిశోధనలనే దెబ్బతీస్తుంది. అందుకే పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి కల్గించాలనే కొంత ప్రయత్నం ఈ దశాబ్దంలో పెరిగింది. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రయోగశాలలను చూసే అవకాశం ఇప్పుడు కల్గిస్తున్నారు. ఫలితంగా సైన్స్ పట్ల మరింత మక్కువ పెరగగలదని నమ్మకం. ఇక చివరగా తెలుగు పత్రికలలో పాపులర్ సైన్స్, సైన్స్ అంశాల శీర్షికలు, సమాచారం బాగా తగ్గిపోయింది ఈ దశాబ్దంలోనే.

సైన్స్ పుస్తకాల అమ్మకాలు గణనీయంగా తగ్గకపోయినా -పత్రికలలో సైన్స్ సమాచారం బాగా తగ్గిపోయింది. కేవలం వాణిజ్యపు లంకె ఉండే టెక్నాలజీ అంశాలు, కన్స్యూమర్ గూడ్స్ వంటి వాటికి సంబంధించి సమాచారం ఇస్తున్నారు. అలాగే వైజ్ఞానిక కల్పనా సాహిత్యానికి సంబంధించి తెలుగులో ఈ దశాబ్దంలో వచ్చిన చెప్పుకోదగ్గ రచనలు పెద్దగా లేవు.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్

Medianaadi

on Monday, January 17, 2011

Recent chages in Telugu print media

on Sunday, December 19, 2010

సైన్స్ ఉద్యమానికి సవాళ్లు

సైన్స్ అంటే సత్యపథం, ఆశావాదం, కపటం లేని విధానం! ఈ విషయాలు పేర్కొనడానికి కారణాలున్నాయి. సైన్స్ ఆధారంగా ఏర్పడిన సంస్థలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్స్ ద్వారా ఆరోగ్యం, ఆహారం, ఆయుష్షు సాధ్యం కావాలని శ్రమిస్తున్నాయి. అర్ధరహితమైన నమ్మకాలు, దోపిడీ సాగకూడదని భావిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకునిపోయిన మూఢనమ్మకాలు ఇంకా విస్తరిస్తున్నాయి. కానీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి టెక్నాలజీ సైతం దోహదపడవచ్చు. అసంగతమైన నమ్మకాలకు పురిగొల్పే టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు విరివిగా ప్రసారం కావడంలో టెలివిజన్ అనే టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. దీనికి మించి కొత్త రకం సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి స్వరూపం గుర్తించే క్రమంలో బోల్తాపడకూడదు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక సదస్సు జరిగింది. దీని సారాం శం ఏమిటంటే మొబైల్ ఫోన్ల వాడకంతో సమస్యలు లేవనీ, అది కేవలం అర్ధరహిత ప్రచారమని. ఆ మేరకు మరుసటి రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ సదస్సును మొబైల్ కంపెనీలు ఖర్చుతో నిర్వహించారు. అందువల్ల ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే వల్లిస్తుంది. ఈ వార్త ప్రచురింపబడిన రోజునే ఆరోగ్య కార్యక్రమంలో మొబైల్‌ఫోన్‌తో అనర్థాలు చాలా ఉన్నాయని టీవీ చానల్ ప్రసారం చేసింది. నిజానికి ఈ పరిస్థితిని కూల్‌డ్రింకులలో రసాయనాల అంశంతో పోల్చవచ్చు. శీతల పానీయాలలో రసాయనాలున్నాయని సహేతుకంగా రుజువైనా, ప్రచారం పుణ్యమా అని చాలామంది దాన్ని పూర్తిగా నమ్మడం లేదు. ఈ స్థాయిలో శీతలపానీయాల సంస్థలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి.

శీతలపానీయాల లోగుట్టును వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలూ, సైన్స్ సంస్థలూ చాలా పాటుపడ్డాయి. కొంత విజయం సాధించాయి కూడా! తర్వాత సైన్స్ సంస్థలు ఈ విషయం పట్ల కాస్త వెనుకంజవేయ డం, దాంతో శీతల పానీయాల సంస్థలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. అయితే మొబైల్‌ఫోన్ల వాడకం గురించి పెద్దఎత్తున అవగాహ నా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ ముసుగున మన ఆరోగ్యం, ఉనికి మొదలైన వాటిని దెబ్బతీసే వాటిని గమనించడం సైన్స్ ఉద్యమశీలుర తక్షణ కర్తవ్యం. మొబైల్ బెడద కేవలం ఒకటి మాత్రమే కావచ్చు.

మరింత పరిశీలన చేస్తే మరిన్ని సమస్యలున్నాయని బోధపడవచ్చు. ఇటీవల కాలంలో గ్రహణం, శాంభవి, మరేదో మూఢనమ్మకం.. ఇలా ఏది సంభవించినా టీవీ చానళ్లలో అరగంటకు తక్కువ కాకుండా చర్చలు ప్రసారం అవుతున్నాయి. ఇందు లో ఉదయం పూట జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక వాదనకు నేతృత్వం వహిస్తుండగా; సైన్స్ సంస్థల వ్యక్తులు వారితో విభేదిం చే చర్చలో పాల్గొంటారు. అనుసంధానంగా ఉండే సమన్వయకర్త మాటలకు ఆజ్యం పోస్తూ, మంటలు ఎగిసే చర్చ జరపాలని ప్రయత్నిస్తారు.

ఎటువంటి వెలు గు లేకుండా కేవలం వేడి జిమ్ము తూ చర్చ ముగుస్తుంది. ఇరు వర్గాల తీవ్ర స్వరాలు గుర్తుంటా యి. కానీ చర్చ చివరకు ఏమి చెప్పిందో గుర్తుకురాదు. శృతిమించిన వాదనలు పెరిగి కొందరిని టీవీ కట్టేసేట్టు చేయవచ్చు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయం గల్లంతు కావడాన్ని ఎక్కువమంది గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి చర్చల వల్ల సైన్స్ సంస్థలకు కొంత ప్రచారం లభించవచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా సాధ్యపడిన విషయం కూడా కావచ్చు. కానీ వీక్షకుల దృష్టిలో ఇలా విభేదించే వారిగా, గొడవపడే వారిగా సైన్స్ సంస్థల వ్యక్తులు గుర్తుండిపోవచ్చు.

కానీ సైన్స్ అంటే వీలయినంత ఎక్కువమంది దోహదపడే గొప్ప సాధనమని చెప్పలేకపోతున్నారని గమనించాలి. నిజానికి జ్యోతిష్యం, వాస్తు.. వంటివి ఉపాధి కల్పించే మార్గాలు. కానీ సైన్స్ ప్రచారం వంటివి హాబీగా సాగే పనులు. అందువల్ల మొదటి వర్గంవారు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా, లాఘవంగా సాగుతా రు. వారే ప్రచార మాధ్యమాలకు ప్రకటనలు కూడా ఇస్తారని గమనించా లి. కనుక ప్రసార మాధ్యమాలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా సాగుతా యి. దీనితో సైన్స్ అసలు ప్రయోజనం కనబడకుండాపోతోంది. కానీ కొంత ప్రచారం మాత్రం మిగులుతుంది. సైన్స్‌లేని ప్రచారంతో ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి.

మరోవైపు విలువైన రాళ్లు, శని యంత్రాలు, హనుమాన్ కవచాలు విశృంఖలంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకోవైపు అర్ధరహితమైన కథనాలు సైన్స్ కథనాలుగా రక్తికడుతున్నాయి. అంతకు మించి సైకాలజి, సైన్స్, ఆరోగ్యం అటూ అర్ధరాత్రికి ముందు విచిత్రమైన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. ఈ తరహా అంశాల వల్ల ఏమి ప్రయోజనం ఉందో ఆలోచించాలి.

వీటిని విసర్జించాలని పోరాడేవారు ఎవరు? సైన్స్ సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నారని ఇటువంటి పోకడలను ఉపేక్షించడం తగునా? అందుకే సైన్స్ ఉద్యమ సంస్థలను ఆలోచించమని కోరడం! ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినా, రాయడం అనేది చాలా మౌలికమైన అంశం. అది లేకుండా ఇతర మాధ్యమ రూపాలను మనం ఊహించ లేం. కానీ సైన్స్ రచయితలు ఎందరున్నారని ఎవరైనా అడిగితే చేతి వేళ్ల సంఖ్యను మించిన సంఖ్య రాకపోవడం నేటి విషాదం.

నలభై సంవత్సరాలలోపు సైన్స్ రచయితలు ఎవరైనా ఉన్నారా- అని ఎంతో మందికి సందే హం రావచ్చు. దీన్ని మరింత ముదరనిస్తే ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రావచ్చు. కనుక సైన్స్ ఉద్యమ సంస్థలు నేడు పూర్తిగా దృష్టిపెట్టి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే వాణిజ్య ఎత్తుగడలతో పోరాడుతూ, క్రమంగా ఆ వాణిజ్యానికే పావుగా మారిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు!
-డా. నాగసూరి వేణుగోపాల్

The Hindu literary suppliment,award

Niira Radia tapes-role of media

Jagrithy-Telugu weekly

on Sunday, October 31, 2010

టెక్నాలజీకి జై

on Wednesday, October 27, 2010

దాదాపు లక్షన్నరమంది 'తారలు' గ్రూప్-4 పరీక్షలకు అభ్యర్థులుగా ఉండడం అసలు వార్త. సుమారు పన్నెండు లక్షలమంది అభ్యర్థుల లో కొందరు అంటే ఐశ్వర్యరాయ్, నయనతార, శ్రీదేవి, మాధురిదీక్షిత్, సానియామీర్జా, సోనియాగాంధీ, రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, చిరంజీవి వంటి వారి ఫోటోలు కనిపించాయట! తమాషాగా అప్లయి చేసి-పేర్లు, ఫోటోలు ఇలాంటి ప్రముఖులవి తగిలించారట. ఇలా ఎనిమిదోవంతు దాకా వ్యాపించి ఉన్న దరఖాస్తులను వేరు చేయడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి గగనమైందట. ఆటపట్టించడానికి అప్లయ్ చేసిన వారెవరూ పరీక్ష రుసుము పంపలేదట. కంప్యూటర్ ప్రోగ్రాంలో సమస్య ఉండి,పరీక్ష రుసుం లేకనే అప్లికేషన్ ఆమోదింపబడిందట. మరికొందరు ప్రబుద్ధులు మొక్క లు, చెట్లు, జంతువుల ఫోటోలతో నింపారట. ఈ వ్యవహారం చూస్తే 'పిల్లి కి చెలగాటం' అనే సామెత గుర్తుకురావచ్చు.అలాగే 108 నెంబర్‌కు ఫోన్ చేసే ఆకతాయి కాలర్స్ ఎక్కువైపోయారని సమాచారం. నిజంగా సమస్య లేకపోయినా, ఫోన్ చేసి ఆటపట్టించడం పెరిగిందని తెలుస్తోంది. ఇక్కడ తొలిరకం ఆకతాయిలకూ, రెండవ రకం ఆకతాయిలకు తేడా ఏమీ లేదు. ఆన్‌లైన్‌లో అల్లరి చేసే వారికి కాస్తా సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. అంతే!ఇది ఒక పార్శ్వం కాగా, దీనికి పూర్తిగా భిన్నమైన దృశ్యం ఇంకోటి ఉంది. నెంబర్ 782474317884 ప్రాధాన్యం ఏమిటి? ఇది మన దేశంలో తొలి ఆధార్ గుర్తింపు సంఖ్య. మహారాష్ట్రకు చెందిన గిరిజన మహిళ రంజ న సోనా వాణెకు చెందిన గుర్తింపు సంఖ్య అది. ఆవిడ వేలుముద్రలు, కనుపాప ముద్రలతో సహా నిక్షిప్తమైన బయోమెట్రిక్ ఐడెంటిటి నెంబర్ అది. దీనినే సులువుగా అర్థం కావడానికి 'ఆధార్' అని వ్యవహరిస్తున్నారు. ఇందులో పన్నెండు అంకెలుంటాయి.వీటితో పాటు బహిర్గతం కానీ మరో నాలుగు అంకెలు కూడా ఉంటాయి. ఇది అధికారిక అవసరాల కోసం రహస్యంగా ఉంచబడతాయి. ఈ గుర్తింపు సంఖ్య ప్రాధాన్యం ఏమిటంటే భారతదేశంలో మరే వ్యక్తికీ ఈ సంఖ్య ఉండదు. ఈ సంఖ్య అంటే ఆ ఫలానా వ్యక్తి అని అర్థం. దీనిద్వారా బ్యాంకు అకౌంట్ తెరవడం, గ్యాస్ కనెక్షన్ సాధించడం, రేషన్‌కార్డు పొందడం, ఇంకా పాన్‌కార్డు, ఫోన్ కనెక్షన్, పాస్‌పోర్టు వంటివి కూడా పొందడానికి వీలవుతుంది. ఈ జాబితాలో మరికొన్ని వచ్చి చేరే అవకాశం ఉంది.అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధా ని మన్మోహన్ 'ప్రపంచంలో మరెక్కడా ఇంత భారీ స్థాయిలో సాంకెతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం లేదని' పేర్కొంటూ త్వరలో ప్రతి భారతీయుడు 'ఆధార్' సంఖ్య పొందే వీలుందని విశదం చేశారు. ఇది తక్కువ ఖర్చుతో, జాతీయస్థాయిలో ఉపయోగపడే, తర్వగా పరీక్షించే వీలున్న గుర్తింపు సంఖ్య ఆధార్.ఆధార్ గుర్తింపు సంఖ్య సెప్టెంబర్ 30న శ్రీకారం చుట్టుకుంది. దీనికి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు అవుతోందని ఒక అంచనా. సుమారు ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రజలంద రూ ఈ గుర్తింపు సంఖ్యను పొందగలరని మరో గణింపు. దీని ద్వారా ప్రభు త్వ పథకాల సద్వినియోగం కాగలవని ఆశ. ఎన్నికల మోసాలు అరికట్టటడంతోపాటు ఉగ్రవాదం వంటి సమస్యను అంతమొందించడానికి ఈ 'ఆధార్' వ్యవస్థ దోహదపడుతోందని భావిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలిస్తే ఇదంతా సాధ్యమా? అని కూడా అనిపించవచ్చు.సెప్టెంబర్ 30 దరిదాపుల్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఈ 12 అంకెల సంఖ్యను మరింత వినియోగించుకోవచ్చునని తెలుపుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన అయోధ్యకు సంబంధించి తీర్పు వెలువడింది. ఆ సందర్భంగా మొబైల్ ఫోన్లలో బల్క్ మెసేజ్‌లను నిషేధించారు. చాలా మంది మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఆధార పత్రాలు పంపమనే ప్రక్రియ మొదలైంది. రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ఉంటే సరిదిద్దుతారు. అంతేకాదు త్వరలో ఫోన్‌నెంబర్లు ఇక నుంచి 12 అంకెలు కలిగి ఉంటాయి. జనాభా వందకోట్లు దాటిపోయినప్పడు పది అంకెల మొబైల్‌నెంబర్ సరిపోదు. ఇంకా వివరంగా చెప్పాలంటే 117 కోట్ల జనాభా ఉండగా 65.242 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని అంటున్నారు. ఇది గత జూలై మాసపు లెక్కింపు అట. కాకతాళీయంగా సెప్టెంబర్ 28న మరో ప్రకటన వెలువడింది. బ్యాంకు బ్రాంచీలు, ఎటిఎం సేవలు అందని మారుమూల ప్రాంతాలకు సేవలు తప్పక అందాలని రిజర్వ్‌బాంక్ మార్గ నిర్దేశాలను గత మంగళవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా బిజినెస్ కరస్పాండెం ట్లు నియమించబడతారు. డబ్బులు జమ చేయడం, వెనక్కి తీసుకోవడం వంటి పనులను ఈ కరస్పాండెంట్లు చేస్తారు. దీనికి మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం దోహదపడుతుంది.ఒక వారంలో సంబంధించిన మూడు సంఘటనలకు ఈ పన్నెండు అంకెల సంఖ్య మంచి పరిష్కారం కాగలదని 'టెక్నాలజీ విజనరీస్' భావిస్తున్నారు. యూనిక్ ఐడెంటిటి నెంబర్ ఒకవైపు మొబైల్ ఫోన్ నెంబర్‌గా, మరోవైపు మొబైల్ బ్యాంకింగ్ నెంబర్‌గాకూడా ఉపయోగపడుతుందని వీరి ప్రతిపాదన. వివరాలు పరిశీలిస్తే ఇది సాధ్యమా అని ఆశ్చర్యం కలగవచ్చు.అదే సమయంలో గత మూడు దశబ్దాలలో సంభవించిన కంప్యూట ర్ విప్లవాలు పరికిస్తే ఇవన్నీ సాధ్యం కావచ్చు అనే నమ్మకం కూడా కలుగుతుంది. అరకొర పొరపాట్లు, అజాగ్రత్తలు, కొన్ని మోసాలు కూడా ఎదురుకావచ్చు. వాటికి వ్యవస్థలో స్వాభావికంగా ఉండే నిర్లిప్తత ఆజ్యం పోయవచ్చు. అయినా పట్టు సడలవలసిన పని లేదు. అటువంటి దుశ్చర్యలకు కళ్ళెం వేయాల్సిందే!మన సమాజం వైవిధ్యంగా ఉన్నప్పుడు ప్రయత్నా లు, ప్రయోగాలు విభిన్నంగానే ఉంటాయి. అందుకే ఐశ్వర్యరాయ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థిగా ఆవిడ ప్రమేయం లేకుండా మారిపోయింది. కొసమెరుపు లాంటి తాజాకలం ఏమిటంటే రైతులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తారట. ఈ మంగళవారం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

విశ్వకవి సైన్స్ వీక్షణం

రవీంద్రనాథ్ ఠాగూర్ సాహితీవేత్తగా, శాంతినికేతన్ నిర్మాతగా, రవీంద్ర సంగీతం రూపకర్తగా మనకు తెలుసు. అయితే రవీంద్రనాథుని సాహిత్య వర్ణ పటంలో శాస్త్ర విజ్ఞానం కూడా ఒక ప్రధాన అంశమని; సాహిత్యాన్ని, సైన్స్‌ను, తత్వశాస్త్రాన్నీ మేళవించి చక్కని గీతాలు, పద్యా లు రాశారని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయాలు తెలుగునాట అంతగా ప్రాచుర్యంలో లేవు. కనుక వాటిని ఒకసారి పరిశీలించడం ఎంతో స్ఫూర్తిదాయకం. అప్పటికి బెంగాల్‌లో ఆచార్య రామేందర్ సుందర్ త్రివేది, అక్షయ్ కుమర్‌దత్తా, ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్, జగదానందరాయ్, ఆచార్య జగదీశ్‌చంద్రబోస్ వంటి వారు పాపులర్ సైన్స్‌ను బెంగాల్‌లో రాస్తున్నారు. కానీ వీరికంటే సుబోధకంగా, జటిలమైన శాస్త్ర అంశాలను జనరంజకంగా రాసి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు గడించడం విశేషం. ఠాగూర్ సైన్స్ ఆసక్తి ఆయన స్వగృహం (జోరాశంకో)లోనే మొదలైం ది. ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్‌ఠాగూర్ ప్రోత్సాహంతో సీతానాథ్‌ఘోష్ ఎన్నో పాపులర్ సైన్స్ వ్యాసాలు రాశాడు. ఈ సీతానాథ్‌ఘోష్‌నే ఠాగూర్ తన స్వీయచరిత్రలు 'జీవన స్మృతి', 'బాల్యం'లలో ఎంతగానో ప్రస్తుతి స్తూ, తనకు స్ఫూర్తి అని పేర్కొంటారు. తన సైన్స్ టీచర్ సీతానాథ్‌ఘోష్ రచనల కారణంగానే విదేశాలలో సాంకేతిక విజ్ఞానంతో ముడిపడిన వ్యవసాయాన్ని అధ్యయనం చేశాడు. శాంతినికేతన్‌లో పట్టుపురుగుల పెంప కం, సిల్కుదారం తయారీ సంబంధించి కృషిచేసి ప్రారంభించాడు ఠాగూర్! ఆరువేల అడుగుల రాగితీగ, బ్యాటరీ సాయంతో సీతానాథ్‌ఘోష్ అప్పట్లో 'మేగ్నటిక్ హీలర్' రూపొందించి కలకత్తాలో సంచలనం కలిగించిన వ్యక్తి. దీని సాయంతో కీళ్లనొప్పులు తొలగించిన ఆయన దగ్గరనే ఠాగూర్ తొలిసైన్స్ పాఠాలు నేర్చుకున్నారు. వడికే యంత్రం, గోధుమల ను దంచే యంత్రం, మరనాగలి, ఇంకు తయారు చేశాడు సీతానాథ్‌ఘోష్. స్వదేశీ పరిజ్ఞానంతో కృషి చేయాలనే భావన ఠాగూర్ మనసులో చిన్ననాటనే పడింది. అందుకే పి.సి.రే 'బెంగాల్ కెమికల్స్'తో ముందుకు వస్తే ఠాగూర్ ఎంతగానో ఆనందపడి అభినందించాడు. అంతేకాదు, గ్రామీణ మహిళలకు కుటీర పరిశ్రమలలో నైపుణ్యం పెంచడానికి శిక్షణాశాలను శాంతినికేతన్‌లో ఏర్పరచాడు ఠాగూర్. ఫ్రెంచి శాస్త్రవేత్త, తత్వవేత్త హెన్రీ బెర్గ్‌సన్-సృష్టి ఎలా ఏర్పడిందనే సిద్ధాంతం తెలుసుకున్నాక ఆస క్తి కలిగి చార్లెస్ డార్విన్, లామార్క్ సిద్ధాంత కృషిని అధ్యయనం చేశా డు ఠాగూర్. మానవ జననం తొలు త ఆఫ్రికాలో మొదలైందని తెలుసుకున్న ఠాగూర్ 'ఆఫ్రికా' అనే పద్యం రాశాడు. అబిసీనియా (ఇథియోపియా) మీద ఇటలీ దాడి చేసినప్పుడు ఈ పద్యం రాశాడు. విశ్వాన్ని పరిచయం చేస్తూ 'విశ్వ పరిచయ' అనే గ్రంథంలో ఠాగూర్ ఖగోళశాస్త్రం, భౌతిక శాస్త్ర అంశాలు రాశారు. ఈ గ్రంథాన్ని మహా శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌బోస్‌కు అంకితమివ్వడం విశేషం. ఈ పుస్తకంలో సూత్రాలు, సమీకరణలు కాకుండా సరళంగా రచన సాగింది. విజ్ఞాన సమాచారం చాలా ఉన్న ఆసక్తి కొరవడదు. ఈ రచనకు మూలకారణం తండ్రితో పాటు బాల్యంలో సాగిన ఆకాశదర్శనమే (స్కైవాచ్) అని ఠాగూ ర్ పేర్కొంటాడు. సౌరకాంతిలోని ఏడు రంగులను నృత్యమాడే నెమలి ఫించంలోని ఏడు రంగులతో పోలుస్తాడు ఠాగూర్. రేడియోథార్మిక గామా, బీటా కిరణాలను ఠాగూర్ 'ఆకాశవాణి' అని పునర్ నామకరణం చేశాడు. తర్వాత ఇదే పేరును రేడియోకు ఆయనే వాడాడు. శరీరం లోప లి ఎముకలను గమనించగల ఎక్స్ కిరణాల శక్తిని గమనించి, వాటి ఆవిష్కర్త రాంట్‌జన్‌ను ఎంతగానో ప్రస్తుతిస్తాడు. పరమాణువు అతి చిన్నదని ఠాగూర్ వివరిస్తాడు. ఠాగూర్ రచనలలో హాస్యం కూడా తొణికిసలాడుతుంది. ఎలక్ట్రాన్‌లలోని రుణాత్మకతను స్త్రీత్వంతో, ప్రోటాన్‌లోని ధనాత్మకతను పురషత్వంతో పోల్చాడు ఠాగూర్. రేడియో ధార్మికత గురించి చర్చించినప్పుడు అటువంటి దానితో (భవిష్యత్తులో) శక్తి తయారవుతుందని వివరిస్తాడు. సర్ జేమ్స్‌జీన్స్ సంక్లిష్ట ఆలోచనలను చాలా సరళంగా వివరిస్తాడు ఠాగూర్. సౌరకుటుంబంలో భూభ్రమణం గురించి విశదపరచడానికి బంగాళాదుంపతో వివరిస్తాడు. జగదీశ్‌చంద్రబోస్, ఠాగూర్ మంచి మిత్రులు. బోస్ కోసం ఠాగూర్ 'కర్ణ' అనే పద్యం రాశాడు. జగదీశ్‌చంద్రబోస్ పరిశోధనలంటే ఠాగూర్‌కు చాలా గురి. ఆయన స్ఫూర్తితో శాంతినికేతన్‌లో ఠాగూర్ చెట్లను పెంచే కార్యక్రమం, విత్తనాలు చల్లే కార్యక్రమా లు ప్రారంభించాడు. విశ్వభారతిలో సైన్స్ ఉపాధ్యాయుడు జగదానంద రే ను జనరంజక విజ్ఞాన వ్యాసాలు రాసేలా ప్రోత్సహించాడు ఠాగూర్. సివి రామన్ పరిశోధన చేసిన 'ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్' సంస్థను స్థాపించింది మహేంద్రలాల్ సర్కార్. సర్కార్‌కు మంచి మిత్రుడు ఠాగూర్. సర్కార్ మహాశయుడు హోమియో ప్రాక్టీసును ప్రారంభించడంలో ఠాగూర్ ప్రోత్సాహం ఉందంటారు. సరోజినీనాయు డు కూతురు పద్మజానాయుడు, శాస్త్రవేత్త మహల్నాజాన్ భార్య జబ్బు పడినప్పుడు ఠాగూర్ హోమియో విధానంలో చికిత్స చేశాడని అశోక్‌బాగ్చీ తన పుస్తకంలో వివరిస్తాడు. ఈ సమాచారం పరిశీలిస్తే రవీంద్రుడికి బాల్యం నుంచి సైన్స్ పట్ల, సైన్స్ ప్రయోజనం పట్ల, సైన్స్ సాహిత్యం పట్ల ఆసక్తి, దృక్పథం మెండు గా ఉన్నాయని గమనించవచ్చు. సైన్స్‌ను, ఫిలాసఫిని, సాహిత్యాన్ని రంగరించి సాగడం; సైన్స్ అనువర్తనాలను తన దగ్గరి నుంచే ప్రారంభించడం చాలా ఆసక్తిని కలిగిస్తాయి. నిజానికి ఈ మేళవింపు కారణంగా సాహిత్యానికి ఔచిత్యాన్ని, సైన్స్‌కు లాలిత్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవ న పంథా రూపొందుతుంది. విశ్వకవి విజ్ఞాన విశ్వవీక్షణం విస్తృతి మనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది.- నాగసూరి వేణుగోపాల్

చానళ్ల బుద్ధి కురచ Andhrabhoomi 5-10-10

on Wednesday, October 6, 2010

పెళ్లెప్పుడు బాబూ-అని ప్రశ్నిస్తూ ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వరుణ్‌గాంధీ పెళ్లి కబురు వచ్చేసరికి రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదని మన తెలుగు చానళ్లకు తెలిసివచ్చింది. అంతే సదరు విషయంపై కార్యక్రమం సిద్ధమై, తెలుగునాట వాలిపోయింది.చానళ్లకు జ్ఞాపకశక్తి అతి కురచ అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం!
సరిగా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయి. మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలు తల్లడిల్లిపోయాయి. తెలుగు చానళ్లు ఈ వార్తలతో మహావరదలుగా మారిపోయాయి. టీవీ-9 దీనిమీద ఊరూరా ర్యాలీలుపెట్టి విరాళాలు సేకరించింది కూడా! నిజానికి ఇలా విరాళాలు సేకరించడంపై మరో చానల్ ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించబోయి చివరకు ఆ అంశం తప్ప మిగతా విషయాలతో కార్యక్రమాన్ని నింపింది. సరే! టీవీ-9 ఇంతవరకు అలా సేకరించిన విరాళం ఎలా వ్యయం చేసిందో టీవీ చానళ్లను తక్కువగా వీక్షించే భవదీయ కాలమిస్టుకు ఇంతవరకు కంటకానీ, చెవినగానీ పడలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళం కనుక, వారికి తెలుసుకొనే హక్కు లేదని ఏలే చానళ్ల ‘ఆధునిక నీతి నియమం’ కావచ్చుకాక! కానీ సంవత్సరం తిరగలేదు, ఏ చానల్‌కైనా 2009 అక్టోబర్ వరదలు గుర్తుకు వచ్చాయా? ఏదో పొరపాటున మహాటీవీ వారికి మాత్రం గుర్తు వచ్చినట్టుంది. వారు మాత్రం అరగంట కార్యక్రమం చేసినట్టు మాత్రమే మా కంటబడింది.
* * *
చానళ్లకు పేర్లు మారడం తెలుగులో బాగా పెరిగిందా? తేజ న్యూస్, అల్ఫా తెలుగు, ఆదిత్య, సంస్కృతి, తేజ, నవ్వులు, ఖుషీ వీటిపేర్లు మారిపోయాయి. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి ‘తేజ’ జెమిని మూవీస్‌గా మారింది. అలాగే నవ్వులు, ఖుషీ కూడా అదే త్రోవలో నడిచాయి. అంటే సన్ నెట్‌వర్క్ చానళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఏదోరకంగా జెమినీ అనే అక్షరాలను తప్పక కలిగి ఉంటాయి. అలాగే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో వరసగా ఉదయ, సూర్య, సన్ అనే పేర్లను కచ్చితంగా కలిగి ఉంటాయి. ఇది యాజమాన్యపరంగా అనుకూలించే విషయం. అంతకుమించి జాతీయస్థాయిలో ప్రకటనలు ఆకర్షించడానికి కొంత వెసులుబాటు అదనంగా ఉంటుంది.
* * *
ఈసారి వినాయకచవితి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గడిచిపోయింది. నిమజ్జనంతోపాటు అయోధ్య తీర్పు అనే హడావుడి వార్తలు జనాలను బెదరగొట్టాయి. తర్వాత తీర్పు 28 అనీ ప్రచారం మొదలైంది. చివరికి సెప్టెంబర్ 30గా ఖరారు అయింది. తీర్పు కూడా భయాందోళనలు లేని రీతిలో రావడం దేశం ఊపిరి పీల్చుకుంది.
వినాయక చవితి సమయంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ప్రేలుడు సంభవించింది అని చానళ్లు హంగామా చేశాయి. కానీ చానళ్లు భయపెట్టినంత స్థాయిలో సంఘటన లేదు కానీ ఒకవైపు వినాయకచవితి ఉత్సవాలు, మరోవైపు బాబ్రీ మసీదు తీర్పు అని సంశయ పడుతున్న వేళ ఇటువంటి వార్తలకు అటువంటి స్థాయిలో సంచలనం సృష్టించాలనుకోవడం మన తెలుగు చానళ్ల స్థాయికే చెల్లింది.
టెక్నాలజీ బాగా పెరిగితే, బుర్ర మరీ నేలబారిపోతోందా? నిమజ్జనంరోజున ఒకేసారి పలు దృశ్యాలను చూపాలని నాలుగు కాదు, ఏడెనిమిది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంగా చూపాలని తాపత్రయపడ్డారు. ఈ దృశ్యాలు ఎంత చిన్నగా మారాయంటే ఒక్కోసారి సదరు చానల్ లోగో ఒక దృశ్యాన్ని మింగేసేటంత! అదే సమయంలో లైవ్ అంటూ మాటలు రాని రిపోర్టర్ చేత వ్యాఖ్యానం ఇప్పించాలని ప్రయత్నించడం మరో విషయం. ఈ రిపోర్టర్‌లు అంతా నాయకుల తగవులను బాగా అందివ్వగలరు గానీ ఇటువంటి సంఘటనలను కాదు. టీవీ-9 వ్యాఖ్యాత తొమ్మిది ప్రాధాన్యతను చెబుతూ టీవీ-9ను సంకీర్తన లంకించుకోవడం ఎంతో ఎబ్బెట్టుగా ఉంది. వినాయక చవితి నిమజ్జనం వ్యాఖ్యానం విషయంలో దూరదర్శన్ పైచేయి అని రుజువు చేసుకుంది. మిగతా చానళ్లు ఏమాత్రం శ్రమ, ఖర్చు లేకుండా రేటింగులు రాలాలని ప్రయత్నించాయి. కానీ బాలాపూర్ లడ్డు వేలం వివాద విషయాన్ని ప్రత్యక్ష ప్రసారంగా మలచిన చానళ్లు కూడా రెండు ఉన్నాయి. దానికేశ్రమ అక్కరలేదు. ప్రచారం కావాలనుకున్నవారు, వారే సొంత వాహనం మీద పారితోషికం ఆశించకుండా స్టుడియోలో వాలుతారు. అదీ కిటుకు!
* * *
టీవీ చానళ్లు చూస్తుంటే ఎవరి గోల వారిది అనే సామెత పదే పదే గుర్తుకువస్తుంది. సాక్షి చూస్తే జగనన్న యాత్ర పదేపదే చూపుతారు కదా అని స్టుడియో ఎన్‌వైపు వెళ్లాను. రాత్రి పదిగంటలకు ఒన్‌మినిట్ అని అరగంటలో ముప్పయి వార్తలు ఇచ్చే కార్యక్రమం అది. కానీ ఆ కార్యక్రమం ఎవరికీ చెప్పకుండా రద్దయిపోయింది. అంతేకాదు చంద్రబాబు యాత్రతో చానల్ సాగిపోయింది. అది అరగంటో, గంటో-మనకు తెలియదు. ఎందుకంటే పరీక్షగా చూసే ఓపిక లేదు కనుక. చమక్కు: ఓరు‘ఘల్లు’, విశాఖ తీరాన, కృష్ణాతీరం...ఇవి ఎన్‌టీవీలో ప్రాంతాలవారీ వార్తాకదంబాలకు చేసిన నామకరణాలు. ఇంగ్లీషు శీర్షికల ఎడారిలో తెలుగు ఒయాసిస్సులా ఇవి వినపడుతున్నాయి